హోండా సీబీ షైన్.. కొత్త మోడల్ ధర రూ.60,000-64,400 | onda launches CB Shine SP priced up to Rs 64400 | Sakshi
Sakshi News home page

హోండా సీబీ షైన్.. కొత్త మోడల్ ధర రూ.60,000-64,400

Published Thu, Nov 19 2015 11:34 PM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

హోండా సీబీ షైన్.. కొత్త మోడల్ ధర రూ.60,000-64,400 - Sakshi

హోండా సీబీ షైన్.. కొత్త మోడల్ ధర రూ.60,000-64,400

న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ) కంపెనీ ఎగ్జిక్యూటివ్ సెగ్మెంట్ బైక్ కేటగిరిలో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. సీబీ షైన్ ఎస్‌పీ పేరుతో అందిస్తున్న ఈ 125 సీసీ మోడల్ బైక్ ధరలు రూ.59,900 నుంచి  రూ.64,400(ఎక్స్ షోరూ మ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయని  కంపెనీ తెలిపింది. ఈ కొత్త మోడల్ బైక్‌లను ఏడాది కాలంలో 3 లక్షలు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వై.ఎస్. గులేరియా చెప్పారు. ఇప్పటివరకూ 43 లక్షల షైన్ బైక్‌లను విక్రయించామని వివరించారు. గుజరాత్‌లో ప్లాంట్ నిర్మాణానికి రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నామని హెచ్‌ఎంఎస్‌ఐ ప్రెసిడెంట్, సీఈఓ కీత మురమత్సు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement