సీబీఆర్ 650 ఎఫ్ @ 7.3 లక్షలు
- హోండా నుంచి కొత్త స్పోర్ట్ ్స బైక్
న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) కంపెనీ కొత్తగా స్పోర్ట్స్ బైక్ సీబీఆర్ 650 ఎఫ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ బైక్ ధరరూ.7.3 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది 15 కొత్త వాహనాలను అందుబాటులోకి తెచ్చే వ్యూహాంలో భాగంగా ఈ స్పోర్ట్స్ బైక్‌ను అందిస్తున్నామని హెచ్‌ఎంఎస్‌ఐ ప్రెసిడెంట్, సీఈఓ కీత మురమత్సు చెప్పారు. ఈ బైక్‌తో పాటు మరో నాలుగు కొత్త మోడళ్లను కూడా కంపెనీ ఈ సందర్భంగా ఆవిష్కరించింది. కొత్తగా మార్కెట్లోకి తేనున్న 160 సీసీ బైక్ సీబీ హార్నెట్ 160ఆర్‌ను, సీబీఆర్ 250ఆర్, సీబీఆర్ 150ఆర్ మోడళ్లలో అప్‌డేటెడ్ వెర్షన్లను, మిస్టరీ మోటార్‌సైకిల్‌ను కూడా ప్రదర్శించింది.
బైక్ ప్రత్యేకతలు...: ఈ ఫుల్ ఫెయిర్డ్ సీబీఆర్ 650 ఎఫ్ బైక్‌లో 649 సీసీ డబుల్ ఓవర్‌హెడ్ కాంషిఫ్ట్(డీఓహెచ్‌సీ) లిక్విడ్ కూల్ ఇంజిన్, ఆరు గేర్లు, మోనో షాక్ సస్పెన్షన్, టాకోమీటర్, రెండు ట్రిప్ మీటర్లు, ఫ్యూయల్ గేజ్, గడియారం తదితర ఫీచర్లతో కూడిన ఇన్‌స్ట్రుమెంటల్ కంట్రోల్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. మైలేజీ లీటర్‌కు 21 కిమీ. ఈ బైక్ కవాసాకి నింజా 650, బెనెల్లి టీఎన్‌టీ 600 జీబీ బైక్‌లకు పోటీనిస్తుందని అంచనా. ఈ బైక్‌ను థాయ్‌లాండ్, జపాన్ నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకొని మానేసర్ ప్లాంట్‌లో అసెంబ్లింగ్ చేస్తున్నారు.