
కొరుక్కుపేట: ప్రముఖ మెసేజింగ్ యాప్ హైక్‌తో ప్రపంచంలోనే అతిపెద్ద రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వినియోగదారులకు మెరుగైన సేవల లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు ఓలా సీఈవో భవిష్ అగర్వాల్, హైక్ వ్యవస్థాపకులు కవిన్ భారతీ మిట్టల్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో కవిన్ భారతీ మిట్టల్ మాట్లాడుతూ వినియోగదారులకు సౌకర్యవంతంమైన సేవలు అందించేవిధంగా ఓలాతో ఒప్పందం చేసుకున్నామని అన్నారు. ఓలాకారును, ఆటోలను హైక్ యాప్ ద్వారానే బుక్ చేసుకోవచ్చునని అన్నారు. హైక్ వ్యాలెట్ ద్వారానే చెల్లింపులు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని హైక్ వినియోగదారులకు తెలియజేశారు.