
వాటా విక్రయించనున్న డీఎల్‌ఎఫ్ ప్రమోటర్లు
న్యూఢిల్లీ: డీఎల్‌ఎఫ్ కంపెనీ ప్రమోటర్లు, తమ రెంటల్ విభాగంలో 40 శాతం వాటాను విక్రయించనున్నారు. తమ రెంటల్ విభాగం, డీసీసీడీఎల్(డీఎల్‌ఎఫ్ సైబర్ సిటీ డెవలపర్స్ లిమిటెడ్)లో 40 శాతం వాటాను సింగపూర్‌కు చెందిన జీఐసీకు ప్రమోటర్లు విక్రయించనున్నట్లు డీఎల్‌ఎఫ్ తెలిపింది.
డీల్ విలువ రూ.12,000–13,000 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. జీఐసీతో ఒప్పందం మరో రెండు, మూడు నెలల్లో కుదరగలదని డీఎల్‌ఎఫ్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌ఓ) అశోక్ త్యాగి చెప్పారు. వాటా విక్రయ ప్రక్రియ ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా పూర్తవగలదని అంచనాలున్నాయని వివరించారు. డీఎల్‌ఎఫ్‌కు నికర రుణ భారం రూ.24,000 కోట్లుగా ఉంది. ఈ రుణభారం తగ్గించుకోవడానికి డీఎల్‌ఎఫ్ ప్రమోటర్లు ప్రయత్నిస్తున్నారు.