ముంబై: టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ తన మొబైల్ టవర్‌సంస్థ భారతి ఇన్ ఫ్రాటెల్ లో వాటాలను విక్రయించింది. ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు కేకేఆర్, కెనడా పెన్షన్ ఫండ్ ల కన్సార్టియంకు భారతీ ఇన్‌ఫ్రాటెల్‌లో 10.3 శాతం వాటా విక్రయించింది. షేరుకి రూ. 325 ధరలో ఈ వాటాను విక్రయించినట్లు భారతీ ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. తద్వారా సమకూరే రూ. 6194 కోట్లతో రుణభారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తామని ఎయిర్‌టెల్ పేర్కొంది. దీంతో భారతీ ఇన్‌ఫ్రాటెల్ కౌంటర్ 2శాతానికిపై లాభాలతో మార్కెట్ లో దూసుకుపోయింది. అటు ఇన్‌ఫ్రాటెల్ మాతృ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ కూడా 0.7 శాతం లాభపడి రూ. 341 వద్ద ట్రేడవుతోంది. ఇది టెలికాం మౌలిక సౌకర్యాల రంగానికి అనుకూలమైన దృక్పధాన్ని పటిష్టం చేస్తుందని చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ చెప్పారు ,
కాగా ఈ లావాదేవీ తరువాత భారతి ఇన్ ఫ్రాటెల్ లో కేకేఆర్ రెండవసారి పెట్టుబడి పెట్టినట్టయింది. 2008-15 మధ్య కేకేఆర్ పెట్టుబడులు పెట్టింది. ఈ డీల్ తరువాత ప్రస్తుతం ఇన్ఫ్రాటెల్‌లో ఎయిర్‌టెల్ వాటా 61.7 శాతానికి తగ్గింది. అలాగే కేకేఆర్ ఏకైక పెద్ద పబ్లిక్ షేర్ హోల్డర్‌గా ఉండనుంది.
భారతి ఇన్ ఫ్రా వాటా విక్రయించిన ఎయిర్‌టెల్
Published Tue, Mar 28 2017 12:27 PM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM
Advertisement
Advertisement