Bharti infratel
-
ఇన్ఫ్రాటెల్- అదానీ పోర్ట్స్ జూమ్
ముంబై, సాక్షి: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 460 పాయింట్లు జంప్‌చేసి 44,537ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. నిఫ్టీ 135 పాయింట్లు ఎగసి 13,061 వద్ద ట్రేడవుతోంది. వెరసి దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 13,000 పాయింట్ల మార్క్‌ను నిఫ్టీ అధిగమించింది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా మౌలిక సదుపాయాల కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, టెలికం టవర్ల దిగ్గజం భారతీ ఇన్ఫ్రాటెల్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ట్రాన్స్‌పోర్టేషన్, రవాణా మౌలిక సదుపాయాల విభాగంలో దేశీయంగా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌కు 14వ ర్యాంక్ లభించినట్లు డోజోన్స్ సస్టెయినబిలిటీ ఇండైసెస్(డీజేఎస్ఐ) తాజాగా పేర్కొంది. ఎస్ఏఎం కార్పొరేట్ సస్టెయినబిలిటీ ఆధారంగా డోజోన్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌లో అదానీ పోర్ట్స్‌కు మాత్రమే చోటు దక్కినట్లు తెలియజేసింది. దీంతో డీజేఎస్ఐ ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే పలు ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఇకపై అదానీ పోర్ట్స్ కౌంటర్‌పై దృష్టి పెట్టే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అదానీ పోర్ట్స్ కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. వెరసి అదానీ పోర్ట్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 7 శాతంపైగా జంప్‌చేసింది. రూ. 402ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.5 శాతం ఎగసి రూ. 396 వద్ద ట్రేడవుతోంది. భారతీ ఇన్ఫ్రాటెల్ ఇండస్ టవర్స్‌తో విలీనం పూర్తి చేసుకోవడం ద్వారా భారతీ ఇన్ఫ్రాటెల్ అతిపెద్ద టవర్ల కంపెనీగా ఆవిర్భవించింది. ఇండస్ టవర్స్ కంపెనీ పేరుతో ఏర్పాటైన సంయుక్త సంస్థలో భారతీ ఎయిర్‌టెల్‌కు 36.7 శాతం, వొడాఫోన్ గ్రూప్‌నకు 28.12 శాతం చొప్పున వాటా లభించింది. ఈ బాటలో పీఎస్ ఏషియా హోల్డింగ్ ఇన్వెస్ట్మెంట్స్ మారిషస్‌కు 3.25 శాతం వాటా దక్కింది. టవర్ల రంగంలో అతిపెద్ద కంపెనీగా ఆవిర్భవించిన నేపథ్యంలో భారతీ ఇన్ఫ్రాటెల్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 230 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 238 వరకూ ఎగసింది. విలీనం పూర్తయిన వార్తలతో గత మూడు రోజులుగా ఈ కౌంటర్ జోరు చూపుతోంది. వెరసి 28 శాతంపైగా లాభపడింది. -
బీఈఎల్- భారతీ ఇన్ఫ్రాటెల్.. భల్లేభల్లే
ముంబై, సాక్షి: తొలుత హుషారుగా ప్రారంభమైనప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. అయితే సానుకూల వార్తల కారణంగా ఓవైపు పీఎస్‌యూ దిగ్గజం భారత్ ఎలక్ట్రానిక్స్(బీఈఎల్), మరోపక్క టెలికం టవర్ల దిగ్గజం భారతీ ఇన్ఫ్రాటెల్ కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. భారత్ ఎలక్ట్రానిక్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) క్యూ2లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ పూర్తి ఏడాదిలో ఆకర్షణీయ పనితీరు చూపే వీలున్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్ ఎలక్ట్రానిక్స్ తాజాగా తెలియజేసింది. ఎల్సీఏ, ఆకాష్ వెపన్ సిస్టమ్, స్మార్ట్ సిటీ, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ తదితరాల నుంచి రూ. 15,000 కోట్ల విలువైన ఆర్డర్లను ఆశిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఆదాయంలో రెండంకెల వృద్ధిని అందుకోగలమని అంచనా వేసింది. అంతేకాకుండా 20-21 శాతం స్థాయిలో ఇబిటా మార్జిన్లు సాధించగలమని అభిప్రాయపడింది. దీంతో వరుసగా రెండో రోజు ఈ కౌంటర్‌కు డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బీఈఎల్ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 109 వద్ద ట్రేడవుతోంది. వెరసి రెండు రోజుల్లో 13 శాతం లాభపడినట్లయ్యింది. క్యూ2లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 443 కోట్లకు పరిమితమైన సంగతి తెలిసిందే. భారతీ ఇన్ఫ్రాటెల్ టెలికం మౌలిక సదుపాయాల కంపెనీ ఇండస్ టవర్స్‌తో విజయవంతంగా విలీనాన్ని పూర్తిచేసుకున్నట్లు భారతీ ఇన్ఫ్రాటెల్ పేర్కొంది. తద్వారా ఇండస్ టవర్స్ కంపెనీ పేరుతో అతిపెద్ద టవర్ల కంపెనీగా ఆవిర్భవించింది. ఈ సంయుక్త సంస్థలో మాతృ సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌కు 36.73 శాతం వాటా లభించగా.. వొడాఫోన్ గ్రూప్ 28.2 శాతం వాటాను పొందింది. ప్రావిడెన్స్‌కు సైతం 3.25 శాతం వాటా దక్కింది. ఈ నేపథ్యంలో భారతీ ఇన్ఫ్రాటెల్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 13 శాతం దూసుకెళ్లి రూ. 210 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 214 వరకూ ఎగసింది. నేటి ట్రేడింగ్ తొలి గంటలోనే (బీఎస్ఈ, ఎన్ఎస్ఈ) ఈ కౌంటర్లో 10 మిలియన్ షేర్లు చేతులు మారడం గమనార్హం! -
కెనరా బ్యాంక్- ఇన్ఫ్రాటెల్.. బోర్లా
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థ కెనరా బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు దీర్ఘకాలంగా వేచిచూస్తున్న ఇండస్ టవర్స్‌తో విలీన అంశం మరోసారి వాయిదా పడటంతో టెలికం రంగ మౌలిక సదుపాయాల దిగ్గజం భారతీ ఇన్ఫ్రాటెల్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. వెరసి ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో కళ తప్పాయి. వివరాలు చూద్దాం.. కెనరా బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం క్యూ4(జనవరి-మార్చి)లో పీఎస్‌యూ కెనరా బ్యాంక్ రూ. 3259 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2108-19) క్యూ4లో రూ. 552 కోట్ల నష్టం మాత్రమే నమోదైంది. పన్నుకు ముందు నష్టం సైతం రూ. 2550 కోట్ల నుంచి రూ. 3335 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) తగ్గడం, ఉద్యోగ వ్యయాలు పెరగడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎన్ఐఐ 9 శాతం తక్కువగా రూ. 3319 కోట్లను తాకింది. ఉద్యోగ వ్యయాలు రెట్టింపై రూ. 2175 కోట్లను తాకగా.. ఇతర ఆదాయం 19 శాతం పుంజుకుని రూ. 2175 కోట్లుగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో వరుసగా రెండో రోజు కెనరా బ్యాంక్ కౌంటర్ బలహీనపడింది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు దాదాపు 5 శాతం పతనమై రూ. 104 వద్ద ట్రేడవుతోంది. బుధవారం సైతం ఈ షేరు 4 శాతం తిరోగమించి రూ. 110 దిగువన స్థిరపడింది. భారతీ ఇన్ఫ్రాటెల్ ఇండస్ టవర్స్‌తో విలీనానికి ఇంతక్రితం నిర్ణయించిన జూన్ 24 గడువును తాజాగా రెండు నెలలు పొడిగిస్తున్నట్లు భారతీ ఇన్ఫ్రాటెల్ పేర్కొంది. బుధవారం సమావేశమైన బోర్డు ఆగస్ట్ 31వరకూ విలీన గడువును పొడిగించేందుకు నిర్ణయించినట్లు తెలియజేసింది. నిజానికి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇండస్ టవర్స్ విలీన అంశానికి గడువును ఈ 24 వరకూ పొడిగిస్తున్నట్లు ఏప్రిల్ 24న భారతీ ఇన్ఫ్రాటెల్ తెలియజేసింది. టెలికం టవర్ల కంపెనీ ఇండస్ టవర్స్‌లో వొడాఫోన్ ఐడియాకు సైతం 11.15 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారతీ ఇన్ఫ్రాటెల్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 222 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 218 వరకూ జారింది. కాగా.. గ్లోబల్ రీసెర్చ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తాజాగా భారతీ ఇన్ఫ్రాటెల్ షేరుకి అండర్‌వెయిట్ రేటింగ్‌ను ఇచ్చింది. రూ. 175 టార్గెట్ ధరను సైతం ప్రకటించింది. -
ఇన్ఫ్రాటెల్ పతనం- శంకర బిల్డ్ ఖుషీ
ఇండస్ టవర్స్ విలీనంపై కొనసాగుతున్న అనిశ్చితికి మరోమారు తెరతీస్తూ.. నేడు నిర్వహించవలసిన బోర్డు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు టెలికం మౌలిక సదుపాయాల దిగ్గజం భారతీ ఇన్ఫ్రాటెల్ తాజాగా వెల్లడించింది. మరోపక్క గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో హోమ్ ఇంప్రూవ్మెంట్ ప్రొడక్టుల కంపెనీ శంకర బిల్డ్ ప్రో కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఇన్ఫ్రాటెల్ షేరు నష్టాలతో కళతప్పగా.. శంకర బిల్డ్ భారీ లాభాలతో కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం.. భారతీ ఇన్ఫ్రాటెల్ టెలికం మౌలిక సదుపాయాల దిగ్గజం భారతీ ఇన్ఫ్రాటెల్ నేడు నిర్వహించవలసిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. నేడు నిర్వహించతలపెట్టిన సమావేశంలో ఇండస్ టవర్స్ విలీనంపై బోర్డు నిర్ణయం తీసుకోనున్నట్లు తొలుత పేర్కొంది. అయితే బోర్డు తుది నిర్ణయం తీసుకునేందుకు మరికొన్ని ఇన్పుట్ల అవసరమున్నట్లు భారతీ ఇన్ఫ్రాటెల్ వివరించింది. దీంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు వెల్లడించింది. ఈ నెల 24లోగా తిరిగి బోర్డు సమావేశాన్ని చేపట్టనున్నట్లు బీఎస్ఈకి తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఇన్ఫ్రాటెల్ షేరు ఎన్ఎస్ఈలో 8 శాతం పతనమైంది. రూ. 214 వద్ద ట్రేడవుతోంది. నిజానికి ఈ నెల 4న ఇండస్ టవర్స్ విలీనంపై అనిశ్చితి కొనసాగుతున్నట్లు కంపెనీ వివరించింది. కాగా.. 2019 మార్చికల్లా ముగియవలసిన విలీన ప్రక్రియ నాలుగోసారి వాయిదా పడటం గమనార్హమని పరిశ్రమవర్గాలు వ్యాఖ్యానించాయి! శంకర బిల్డ్ ప్రొ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో ఈ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 61 ఎగసి రూ. 364 వద్ద ఫ్రీజయ్యింది. క్యూ4(జనవరి-మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన శంకర బిల్డ్ ప్రొ పన్నుకు ముందు లాభం(పీబీటీ) మూడు రెట్లు ఎగసి రూ. 15 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం సైతం 74 శాతం పెరిగి రూ. 27 కోట్లను అధిగమించింది. ఇబిటా మార్జిన్లు 2.6 శాతం నుంచి 4.06 శాతానికి మెరుగయ్యాయి. ఈ కాలంలో మొత్తం ఆదాయం 12 శాతం పుంజుకుని రూ. 667 కోట్లను తాకింది. -
ఇన్ఫ్రాటెల్- యూపీఎల్.. ఖుషీఖుషీగా
జూన్ డెరివేటివ్ సిరీస్ తొలిరోజు మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగుతున్నాయి. అయితే ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీ ఇన్ఫ్రాటెల్, యూపీఎల్ లిమిటెడ్ కౌంటర్లు టాప్ పెర్ఫార్మర్లుగా నిలుస్తున్నాయి. టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియాలో ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఇన్వెస్ట్‌చేయనున్న వార్తలు మొబైల్ టవర్ల దిగ్గజం భారతీ ఇన్ఫ్రాటెల్ కౌంటర్‌కు జోష్‌నివ్వగా.. క్యూ4 ఫలితాలకుతోడు.. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బయ్ రేటింగ్.. యూపీఎల్ షేరుకి ప్రోత్సాహాన్నిస్తున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. భారతీ ఇన్ఫ్రాటెల్ వొడాఫోన్ ఐడియాలో గూగుల్ 5 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు వెలువడిన వార్తలతో టెలికం మౌలికసదుపాయాల కంపెనీ భారతీ ఇన్ఫ్రాటెల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 235 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 242ను అధిగమించింది. ఇది మూడు నెలల గరిష్టంకాగా.. మార్చి 19న నమోదైన కనిష్టం రూ. 121 నుంచి చూస్తే 100 శాతం దూసుకెళ్లింది. టెలికం టవర్లు, కమ్యూనికేషన్స్ పరికరాల ద్వారా మొబైల్ కంపెనీలకు మౌలిక సదుపాయాలను సమకూరుస్తుంది. కంపెనీకి గల అతిపెద్ద కస్టమర్ల జాబితాలో మొబైల్ దిగ్గజాలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్లను ప్రధానంగా ప్రస్తావించవచ్చు. దీంతో ఇటీవల దేశీ మొబైల్ టెలికం కంపెనీలలో పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు ఇన్ఫ్రాటెల్ బిజినెస్‌కు డిమాండ్‌ను పెంచే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా షేరు ఇటీవల జోరు చూపుతున్నట్లు తెలియజేశారు. యూపీఎల్ లిమిటెడ్ గతేడాది(2019-20) చివరి త్రైమాసికంలో అగ్రి కెమికల్స్ దిగ్గజం యూపీఎల్ రూ. 761 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 31 శాతం పెరిగి రూ. 11141 కోట్లను అధిగమించింది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ యూపీఎల్ షేరు కొనుగోలుకి సిఫారసు చేస్తూ రూ. 466 టార్గెట్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న యూపీఎల్ షేరు తాజాగా ఎన్ఎస్ఈలో 6.4 శాతం జంప్‌చేసి రూ. 416కు చేరింది. తొలుత రూ. 420కు ఎగసింది. దీర్ఘకాలంలో కంపెనీ అమ్మకాలు 7-10 శాతం మధ్య పుంజుకోగలవని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. తద్వారా మార్కెట్ వాటాను మరింత పెంచుకోగలదని ఆశిస్తోంది. అరిస్టా లైఫ్‌సైన్స్ కొనుగోలు ద్వారా కంపెనీ ఇటీవల కొలంబియా, మెక్సికోలతోపాటు దేశీయంగా మార్కెట్ వాటాను పటిష్టం చేసుకుంటున్నట్లు అభిప్రాయపడింది. ముడివ్యయాలు తగ్గుతున్న కారణంగా రానున్న రెండేళ్లలో ఇబిటా మార్జిన్లు 0.8 శాతం బలపడగలవని ఊహిస్తోంది. -
భారతీ ఇన్ఫ్రాటెల్కు విలీనం సెగ
న్యూఢిల్లీ: మొబైల్ టవర్ల కంపెనీ భారతీ ఇన్ఫ్రాటెల్ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక కాలంలో రూ.608 కోట్ల నికర లాభాన్ని(కన్సాలిడేటెడ్) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.606 కోట్ల నికర లాభం ఆర్జించామని భారతీ ఇన్ఫ్రాటెల్ తెలిపింది. ఆదాయం రూ.3,662 కోట్ల నుంచి 2 శాతం తగ్గి రూ.3,600 కోట్లకు చేరిందని భారతీ ఇన్ఫ్రాటెల్ చైర్మన్ అఖిల్ గుప్తా తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం ఫ్లాట్‌గా రూ.2,494 కోట్లుగా నమోదైందని వివరించారు. ఆదా యం మాత్రం రూ. 14,490 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.14,582 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.7.50 రెండో మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. విలీన ప్రభావం.... టెలికం రంగంలో ఏకీకరణ కారణంగా మొబైల్ టవర్ల అద్దెలు తగ్గడంతో నికర లాభంలో ఎలాంటి వృద్ధి లేదని అఖిల్ గుప్తా తెలిపారు. వొడాఫోన్–ఐడియా కంపెనీల విలీనం కారణంగా మొత్తం మీద 75,000 కో–లొకేషన్లను కోల్పోయామని పేర్కొన్నారు. అందుకని గత ఆర్థిక సంవత్సరం క్యూ4ల్లో ఆర్థికంగా కంపెనీ పనితీరు అంతంతమాత్రంగానే ఉందని వివరించారు. భవిష్యత్తు బాగు.... డేటాకు డిమాండ్ జోరుగా పెరుగుతోందని, భారీ స్థాయిలో నెట్వర్క్ విస్తరణ జరుగుతోందని, ఫలితంగా తమ కంపెనీకి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండనున్నదని అఖిల్ గుప్తా అంచనా వేస్తున్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇండస్ టవర్స్‌తో తమ కంపెనీ విలీన ప్రక్రియ షెడ్యూల్ ప్రకారమే సాగుతోందని, మరికొన్ని నెలల్లో విలీనం పూర్తవ్వగలదని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో భారతీ ఇన్ఫ్రాటెల్ షేర్ 3 శాతం లాభంతో రూ.302 వద్ద ముగిసింది. -
భారతీ ఇన్ఫ్రాటెల్ నికర లాభం 4% డౌన్
న్యూఢిల్లీ: మొబైల్ టవర్ కంపెనీ భారతీ ఇన్ఫ్రాటెల్ నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి త్రైమాసిక (క్యూ1, ఏప్రిల్–జూన్) కాలానికి నికర లాభం రూ.638 కోట్లుగా నమోదయింది. 2017–18 ఏడాది ఇదేకాలానికి రూ.664 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన కంపెనీ.. టెలికం రంగంలో కొనసాగుతున్న కన్సాలిడేషన్ నేపథ్యంలో 4 శాతం తగ్గుదలను చూపింది. అయితే, కన్సాలిడేట్ ప్రాతిపదికన ఆదాయం 4 శాతం వృద్ధిని నమోదుచేసింది. రూ.3,674 కోట్లుగా నిలిచింది. (ఇండస్ టవర్స్ వాటాను కలుపుకుని ఈ మొత్తం నమోదు కాగా, సంస్థలో 42 శాతం వాటాను భారతీ ఇన్ఫ్రాటెల్ కలిగిఉంది.) అంతకుముందు ఇదేకాలానికి ఆదాయం రూ.3,524 కోట్లుగా నమోదయింది. ‘ప్రస్తుతం టెలికం రంగం అనుసంధాన దశలో ఉంది. భవిష్యత్ అవకాశాల అందిపుచ్చుకోవడం కోసం ఆపరేటర్లు తమ నెట్వర్కులను, స్పెక్ట్రమ్‌ను ఏకీకృతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.‘ అని చైర్మన్ అఖిల్ గుప్తా వివరించారు. -
భారతి ఇన్ఫ్రాటెల్తో ఇండస్ టవర్స్ విలీనం
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెలికం టవర్ల సంస్థ ఏర్పాటు దిశగా భారతి ఇన్ఫ్రాటెల్, ఇండస్ టవర్స్ త్వరలో విలీనం కానున్నాయి. తద్వారా 14.6 బిలియన్ డాలర్ల (రూ. 96,500 కోట్లు) దిగ్గజం ఆవిర్భవించనుంది. ఏకంగా 1,63,000 టవర్లతో చైనా టవర్ సంస్థ తర్వాత ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టవర్స్ సంస్థగా నిలవనుంది. విలీనానికి సంబంధించి ఇరు సంస్థలు ఒక అంగీకారానికి వచ్చాయి. విలీన సంస్థ పేరు ఇండస్ టవర్స్ లిమిటెడ్‌గా ఉంటుంది. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తాయి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), మార్కెట్స్ నియంత్రణ సంస్థ సెబీ తదితర నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరులోగా డీల్ పూర్తి కాగలదని అంచనా. ప్రత్యేక స్కీమ్ ప్రకారం భారతి ఇన్ఫ్రాటెల్లో ఇండస్ టవర్స్ విలీనం అవుతుందని భారతి ఎయిర్టెల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇండస్ టవర్స్ ప్రస్తుతం 15 టెలికం సర్కిల్స్‌లోను, భారతి ఇన్ఫ్రాటెల్ మిగతా 7 సర్కిల్స్‌లోనూ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2017–18లో ఇరు కంపెనీల ఆదాయాలు రూ. 25,360 కోట్ల పైగా ఉన్నాయి. వాటాల పంపకం ఇలా.. ప్రస్తుతం భారతి ఎయిర్‌టెల్‌కి భారతి ఇన్ఫ్రాటెల్లో 53.5 శాతం వాటాలున్నాయి. విలీన సంస్థలో దీనికి 33.8 నుంచి 37.2 శాతం వాటాలు దక్కే అవకాశం ఉంది. ఇండస్ టవర్‌లో వొడాఫోన్‌కి 42 శాతం వాటాలుండగా, విలీన సంస్థలో 26.7 శాతం నుంచి 29.4 శాతం దాకా వాటాలు దక్కనున్నాయి. ఇండస్ టవర్‌లో భారతి ఇన్ఫ్రాటెల్కు కూడా 42 శాతం వాటా ఉండగా, ఐడియాకి 11.15 శాతం, ప్రావిడెన్స్‌కి 4.85 శాతం వాటాలున్నాయి. విలీన సంస్థలో ఐడియా, ప్రావిడెన్స్లు తమ వాటాలను అట్టే పెట్టుకోవడం లేదా విక్రయించడాన్ని బట్టి ఎయిర్టెల్, వొడాఫోన్ల వాటాలు పెరగడం లేదా తగ్గడం ఆధారపడి ఉంటుంది. విలీన కంపెనీలో కొంత వాటాలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లతో చర్చించనున్నట్లు భారతి ఎయిర్టెల్ తెలిపింది. డీల్ ప్రకారం భారతి ఇన్ఫ్రాటెల్కి చెందిన ప్రతి 1,565 షేర్లకు ఇండస్ టవర్ షేరు ఒక్కటి చొప్పున లభిస్తుంది. విలీన సంస్థలో భారతి ఎయిర్టెల్, వొడాఫోన్‌కి సమాన అధికారాలుంటాయి. డీల్ పూర్తయ్యాక 11 మంది డైరెక్టర్లలో ఇరు సంస్థల నుంచి చెరి ముగ్గురు నియమితులవుతారు. ఐడియా, ప్రావిడెన్స్లు వాటాలు విక్రయిస్తే.. ఒకవేళ ఐడియా తన వాటాలను పూర్తిగా, ప్రావిడెన్స్ తనకున్న 4.85 శాతం వాటాలో 3.35 శాతాన్ని విక్రయించాలనుకున్న పక్షంలో .. విలీన సంస్థలో భారతి ఎయిర్‌టెల్‌కు 37.2 శాతం, వొడాఫోన్ గ్రూప్‌నకు 29.4 శాతం, ప్రావిడెన్స్‌కి 1.1 శాతం, మిగతా వాటాలు పబ్లిక్ షేర్‌హోల్డర్ల దగ్గర ఉంటాయి. అలా కాకుండా ఐడియా, ప్రావిడెన్స్ తమ పెట్టుబడులను కొనసాగించాలనుకుంటే భారతి ఎయిర్‌టెల్‌కి 33.8 శాతం, వొడాఫోన్‌కి 26.7 శాతం వాటాలు ఉంటాయి. ఐడియా గ్రూప్‌నకు 7.1 శాతం, ప్రావిడెన్స్‌కి 3.1 శాతం, మిగతా 29.3 శాతం వాటాలు పబ్లిక్ షేర్‌హోల్డర్స్ దగ్గర ఉంటాయి. -
భారతీ ఇన్ఫ్రాటెల్ లాభం రూ.606 కోట్లు
న్యూఢిల్లీ: మొబైల్ టవర్ల కంపెనీ భారతీ ఇన్ఫ్రాటెల్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.606 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో వచ్చిన నికర లాభం(రూ.597 కోట్లు)తో పోల్చితే 2 శాతం వృద్ధి సాధించామని భారతీ ఇన్ఫ్రాటెల్ తెలిపింది. ఆదాయం 4 శాతం వృద్ధితో రూ.3,662 కోట్లకు పెరిగిందని కంపెనీ చైర్మన్ అఖిల్ గుప్తా తెలిపారు. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.14 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 9 శాతం తగ్గి రూ.2,494 కోట్లకు, ఆదాయం 8 శాతం పెరిగి రూ.14,490 కోట్లకు పెరిగాయని గుప్తా వివరించారు. ఇబిటా 8 శాతం పెరిగి రూ.6,427 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో భారతీ ఇన్ఫ్రాటెల్ షేర్ 1 శాతం నష్టంతో రూ.328 వద్ద ముగిసింది. -
17 శాతం తగ్గిన భారతీ ఇన్ఫ్రాటెల్ లాభం
న్యూఢిల్లీ: టెలికం మార్కెట్లో ప్రతికూల పవనాల ప్రభావం భారతీ ఇన్‌ఫ్రాటెల్‌పై కూడా ప్రభావం చూపించినట్టున్నాయి. కంపెనీ నికర లాభం 17.57 శాతం తగ్గిపోయి రూ.638 కోట్లకు పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.774 కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.3,292 ఓట్లతో పోలిస్తే 11 శాతం వృద్ధితో రూ.3,648 కోట్లకు పెరిగింది. దీనిపై భారతీ ఇన్ఫ్రాటెల్ చైర్మన్ అఖిల్ గుప్తా మాట్లాడుతూ... భారతీ ఇన్‌ఫ్రాటెల్‌తోపాటు, ఇండస్ టవర్స్ (ఇందులో 42 శాతం వాటా భారతీ ఇన్ఫ్రాటెల్కు ఉంది) తగినంత మార్కెట్ వాటాను సొంతం చేసుకోగల స్థితిలో ఉన్నాయని, వాటాదారులకు స్థిరమైన విలువను అందించే సత్తా ఉందని చెప్పారు. దేశీ టెలికం పరిశ్రమ డేటా ఆధారిత నమూనాను స్వీకరించిందని, డిజిటల్ టెక్నాలజీకి నిదర్శనంగా మారుతోందని ఆయన చెప్పారు. ఆపరేటర్లు 4జీ నెట్‌వర్క్‌కు మారిపోతుండటం, దేశంలో 5జీ టెక్నాలజీ రానుండటం వంటి పరిణామాలను ఆయన ఉదహరించారు. ఆపరేటర్లు మరిన్ని పెట్టుబడులతో డిజిటల్ సదుపాయాలను పటిష్టం చేసుకునే ప్రణాళికలతో ఉన్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీల కార్యక్రమం అదనపు అవకాశాలను తెస్తుందన్నారు. ఇవన్నీ పరిశ్రమకు మేలు చేసే పరిణామాలుగా వివరించారు. మరోవైపు సోమవారం జరిగిన భారతీ ఇన్ఫ్రాటెల్ బోర్డు సమావేశంలో ఇండస్ టవర్స్‌ను అనుబంధ కంపెనీగా మార్చుకునే లక్ష్యంతో ఆ కంపెనీలో మరింత వాటాను సొంతం చేసుకునే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించింది. -
ఆర్థిక ఫలితాలు
అంబూజా సిమెంట్స్ నికర లాభంలో 11.83% వృద్ధి ముంబై: అంబూజా సిమెంట్స్ కన్సాలిడేటెడ్ నికరలాభం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 11.83% వృద్ధిచెంది రూ. 642 కోట్ల నుంచి రూ. 718 కోట్లకు చేరింది. నికర అమ్మకాల ఆదాయం 14.67% పెరుగుదలతో రూ. 5,359 కోట్ల నుంచి రూ. 6,145 కోట్లకు చేరింది. 12 శాతం తగ్గిన భారతి ఇన్ఫ్రాటెల్ నికర లాభం న్యూఢిల్లీ: భారతి ఇన్ఫ్రాటెల్ నికరలాభం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 12% క్షీణించి రూ.756 కోట్ల నుంచి రూ. 664 కోట్లకు తగ్గింది. ఆదాయం 10% వృద్ధితో రూ. 3,211 కోట్ల నుంచి రూ. 3,525 కోట్లకు పెరిగింది. టాటా కమ్యూనికేషన్స్ లాభంలో క్షీణత న్యూఢిల్లీ: టాటా కమ్యూనికేషన్స్ లాభం జూన్ త్రైమాసికంలో 22% క్షీణించింది. రూ.32.94 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్లో వచ్చిన లాభం రూ.42.38 కోట్లు కావడం గమనార్హం. మొత్తం ఆదాయం 5% క్షీణించి రూ.4,552 కోట్ల నుంచి రూ.4,354 కోట్లకు పరిమితం అయింది. హడ్కో లాభం 50 శాతం జంప్ న్యూఢిల్లీ: హడ్కో లాభం జూన్ క్వార్టర్లో ఏకంగా 52% వృద్ధితో రూ.211 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.139 కోట్లు. ఆదాయం రూ.891 కోట్ల నుంచి రూ.929 కోట్లకు పెరిగింది. వామా ఇండస్ట్రీస్ లాభం రూ.1.8 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వామా ఇండస్ట్రీస్ జూన్ క్వార్టర్లో నికర లాభం రూ.1.87 కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1.44 లక్షలు. టర్నోవరు రూ.6 కోట్ల నుంచి 41.6 కోట్లకు ఎగసింది. -
భారతి ఇన్ ఫ్రా వాటా విక్రయించిన ఎయిర్టెల్
ముంబై: టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తన మొబైల్ టవర్‌సంస్థ భారతి ఇన్ ఫ్రాటెల్ లో వాటాలను విక్రయించింది. ఇన్వెస్ట్మెంట్ సంస్థలు కేకేఆర్, కెనడా పెన్షన్ ఫండ్ ల కన్సార్టియంకు భారతీ ఇన్ఫ్రాటెల్లో 10.3 శాతం వాటా విక్రయించింది. షేరుకి రూ. 325 ధరలో ఈ వాటాను విక్రయించినట్లు భారతీ ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. తద్వారా సమకూరే రూ. 6194 కోట్లతో రుణభారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తామని ఎయిర్టెల్ పేర్కొంది. దీంతో భారతీ ఇన్ఫ్రాటెల్ కౌంటర్ 2శాతానికిపై లాభాలతో మార్కెట్ లో దూసుకుపోయింది. అటు ఇన్ఫ్రాటెల్ మాతృ సంస్థ భారతీ ఎయిర్టెల్ కూడా 0.7 శాతం లాభపడి రూ. 341 వద్ద ట్రేడవుతోంది. ఇది టెలికాం మౌలిక సౌకర్యాల రంగానికి అనుకూలమైన దృక్పధాన్ని పటిష్టం చేస్తుందని చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ చెప్పారు , కాగా ఈ లావాదేవీ తరువాత భారతి ఇన్ ఫ్రాటెల్ లో కేకేఆర్ రెండవసారి పెట్టుబడి పెట్టినట్టయింది. 2008-15 మధ్య కేకేఆర్ పెట్టుబడులు పెట్టింది. ఈ డీల్ తరువాత ప్రస్తుతం ఇన్ఫ్రాటెల్లో ఎయిర్టెల్ వాటా 61.7 శాతానికి తగ్గింది. అలాగే కేకేఆర్ ఏకైక పెద్ద పబ్లిక్ షేర్ హోల్డర్‌గా ఉండనుంది. -
భారతీ ఇన్ఫ్రాటెల్ లాభం 25 శాతం అప్
10 శాతం పెరిగిన రాబడి న్యూఢిల్లీ: భారతీ ఇన్ఫ్రాటెల్ నికర లాభం(కన్సాలిడేటెడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 25 శాతం వృద్ధి చెందింది. గత క్యూ3లో రూ.495 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.620 కోట్లకు పెరిగిందని భారతీ ఇన్ఫ్రాటెల్ తెలిపింది. గత క్యూ3లో రూ.3,105 కోట్లుగా ఉన్న మొత్తం రాబడి ఈ క్యూ3లో 10 శాతం పెరిగి రూ.3,400 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ క్యూ3లో స్టాండోలోన్ ప్రాతిపదికన 791 మొబైల్ టవర్లను కొత్తగా ఏర్పాటు చేశామని, దీంతో గత ఏడాది డిసెంబర్ 31 నాటికి మొత్తం టవర్ల సంఖ్య 38,997కు పెరిగిందని తెలిపింది. ఇక కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన(ఇండస్ టవర్స్‌లో ఉన్నవి కూడా కలుపుకుంటే) చూస్తే మొత్తం టవర్ల సంఖ్య 90,255కు పెరిగాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో భారతీ ఇన్ఫ్రాటెల్ షేర్ 2 శాతం తగ్గి రూ.348 వద్ద ముగిసింది. -
స్టాక్స్ వ్యూ
భారతీ ఇన్ఫ్రాటెల్ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.396 టార్గెట్ ధర: రూ.450 ఎందుకంటే: వెర్లైస్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు అవసరమైన టెలికాం టవర్ల ఏర్పాటు, నిర్వహణ, ఇతర టెలికాం మౌలిక సదుపాయాలను అందజేస్తోంది. ఈ తరహా సేవలను అందిస్తున్న అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటి. వివిధ మొబైల్ ఆపరేటర్లకు(ఆదాయం పరంగా టాప్ త్రీ పొజిషన్లలో ఉన్న భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులర్లకు) కమ్యూనికేషన్ స్ట్రక్చర్స్‌ను, టెలికాం టవర్లమౌలిక సదుపాయాలను దేశవ్యాప్తంగా అందిస్తోంది. కంపెనీ 87వేలకు పైగా టెలికాం టవర్లను నిర్వహిస్తోంది. వీటిల్లో ఈ కంపెనీ సొంతానివి 37వేలకు పైగా ఉండగా, మిగతావి ఈ కంపెనీకి 42 శాతం వాటా ఉన్న ఇంటస్ టవర్స్ కంపెనీవి. తన కార్యకలాపాల్లో అధిక భాగం పర్యావరణ అనుకూల విధానాలనే పాటిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. గత క్యూ2లో రూ. 2,930 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ2లో 4 శాతం వృద్ధితో రూ.3,037 కోట్లకు పెరిగింది. ఇబిటా రూ.1,328 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.1,516 కోట్లకు ఎగసింది. నికర లాభం రూ.465 కోట్ల నుంచి 25 శాతం వృద్ధితో రూ.579 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో రూ.5,773 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో రూ.6,053 కోట్లకు పెరిగాయి. కంపెనీ ఇదే జోరును రానున్న క్వార్టర్లలో కూడా కొనసాగించవచ్చు. ప్రస్తుత ధరకు, పుస్తక ధరకు మధ్య ఉన్న నిష్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.83కు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3.43కు తగ్గుతుందని అంచనా. రెండేళ్లలో నికర అమ్మకాలు 7 శాతం, నికర లాభం 26 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. మధ్య నుంచి దీర్ఘకాలానికి రూ.450 టార్గెట్ ధరగా ప్రస్తుత ధరలో ఈ షేర్‌ను కొనుగోలు చేయవచ్చు. బ్రిటానియా ఇండస్ట్రీస్ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: షేర్‌ఖాన్ ప్రస్తుత ధర: రూ.2,936 టార్గెట్ ధర: రూ.3,650 ఎందుకంటే: ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి.ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 4 శాతం పెరిగి 15 శాతానికి చేరింది. ఇదే జోరు ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన ఆర్నెళ్లలో కూడా కొనసాగించగలమని కంపెనీ ధీమాగా ఉంది. ఈ ఆర్నెళ్లలో అమ్మకాలు 8-10 శాతం వృద్ధి చెందుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. ముడి పదార్ధాల ధరలు తక్కువ స్థాయిల్లో ఉండడం, వివిధ వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా మార్జిన్లు 14 శాతం రేంజ్లో ఉండొచ్చని భావిస్తోంది. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందితే ఈ కంపెనీకి భారీగా ప్రయోజనం కలుగనున్నది. గత ఒక నెల కాలంలో ఈ షేర్ ధర 11 శాతం వరకూ తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ధరలో ఈ షేర్ కొనుగోళ్లకు ఆకర్షణీయంగా ఉందని భావిస్తున్నాం. మంచి వృద్ధి అవకాశాలున్న ఈ షేర్‌ను రూ.3,650 టార్గెట్ ధరగా కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నాం. టైగర్ బ్రాండ్‌ను మళ్లీ మార్కెట్లోకి తేనున్నది. రస్క్, కేకుల వంటి స్నాక్‌ల మార్కెట్లోకి మరింతగా విస్తరించనున్నది. 75 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ కంపెనీకి వస్తోన్న అంతర్జాతీయ ఆదాయం మొత్తం ఆదాయంలో 6 శాతంగానే ఉంది. కొత్త ఉత్పత్తులతో, నెట్వర్క్ ఇస్తరణతో దీనిని నాలుగేళ్లలో 20 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. బిస్కెట్ల కంటే మార్జిన్లు అధికంగా ఉండే కేక్‌లు, రస్క్‌ల అమ్మకాలను పెంచుకోవాలని యోచిస్తోంది. వినూత్నమైన, విభిన్నమైన రుచులు గల ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి రూ.65 కోట్లతో రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,858 కోట్లుగా ఉన్న కంపెనీ నికర అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8,836 కోట్లకు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.10,312 కోట్లకు పెరుగుతాయని అంచనా. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
భారతీ ఇన్ఫ్రాటెల్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: టెలికం టవర్ల సంస్థ భారతీ ఇన్ఫ్రాటెల్ జనవరి-మార్చి(క్యూ4) కాలానికి ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. నికర లాభం 64% జంప్‌చేసి రూ. 472 కోట్లను తాకింది. గతేడాది ఇదే కాలానికి రూ. 287 కోట్లను మాత్రమే ఆర్జించింది. కంపెనీలో మొబైల్ టెలికం సేవల దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు 80% వాటా ఉంది. ఇదే కాలానికి ఆదాయం 4% పెరిగి రూ. 2,790 కోట్లకు చేరింది. గతంలో రూ. 2,674 కోట్ల ఆదాయం నమోదైంది. ఈ కాలంలో 5% అధికంగా రూ. 144.5 కోట్ల ఇతర ఆదాయం లభించింది. పూర్తి ఏడాదికి...: పూర్తి ఏడాదికి(2013-14) భారతీ ఇన్ఫ్రాటెల్ నికర లాభం రూ. 1,003 కోట్ల నుంచి రూ. 1,518 కోట్లకు ఎగసింది. ఆదాయం 5% పుంజుకుని రూ. 10,827 కోట్లయ్యింది. గతంలో రూ. 10,272 కోట్ల ఆదాయం నమోదైంది. టెలికం ఆపరేటర్ కంపెనీలు భారీ పెట్టుబడులను పెడుతున్నాయని, ప్రధానంగా డేటా నెట్‌వర్క్‌లపై దృష్టి పెడుతున్నాయని భారతీ ఇన్ఫ్రాటెల్ చైర్మన్ అఖిల్ గుప్తా చెప్పారు. దీంతో టవర్ కంపెనీల ఆదాయాలు భారీగా మెరుగుపడే అవకాశమున్నదని తెలిపారు. ఇండియాలో డేటా విభాగం వేగంగా వృద్ధి చెందుతున్నదని, టెలికం కంపెనీలు స్పెక్ట్రమ్‌పై ఇప్పటికే రూ. 1,80,000 కోట్లను ఇన్వెస్ట్చేశాయని చెప్పారు. రిలయన్స్ జియోతో ఇన్ఫ్రాస్ట్రక్చర్పై కుదుర్చుకున్న ఒప్పం దంలో భాగంగా తొలి దశ ఆర్డర్లు లభిస్తున్నాయని తెలిపారు. 2013-14లో రూ. 1,527 కోట్ల పెట్టుబడులను వెచ్చించామని, ఈ ఏడాది(2014-15) ఆర్డర్ల స్థాయిని బట్టి రూ. 2,000 కోట్ల వరకూ వ్యయాలుండవచ్చునని వెల్లడించారు.