భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ లాభం 25 శాతం అప్‌ | Bharti Infratel Q3 net up by 25% at Rs 620 cr | Sakshi

భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ లాభం 25 శాతం అప్‌

Jan 24 2017 1:56 AM | Updated on Sep 5 2017 1:55 AM

భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ లాభం 25 శాతం అప్‌

భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ లాభం 25 శాతం అప్‌

భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 25 శాతం వృద్ధి చెందింది.

10 శాతం పెరిగిన రాబడి
న్యూఢిల్లీ: భారతీ ఇన్‌ఫ్రాటెల్‌  నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 25 శాతం వృద్ధి చెందింది. గత క్యూ3లో రూ.495 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.620 కోట్లకు పెరిగిందని భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ తెలిపింది. గత క్యూ3లో రూ.3,105 కోట్లుగా ఉన్న మొత్తం రాబడి ఈ క్యూ3లో 10 శాతం పెరిగి రూ.3,400 కోట్లకు పెరిగిందని పేర్కొంది.

ఈ క్యూ3లో స్టాండోలోన్‌ ప్రాతిపదికన 791 మొబైల్‌ టవర్లను కొత్తగా ఏర్పాటు చేశామని, దీంతో గత ఏడాది డిసెంబర్‌ 31 నాటికి మొత్తం టవర్ల సంఖ్య 38,997కు పెరిగిందని తెలిపింది. ఇక కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన(ఇండస్‌ టవర్స్‌లో ఉన్నవి కూడా కలుపుకుంటే) చూస్తే మొత్తం టవర్ల సంఖ్య 90,255కు పెరిగాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ షేర్‌ 2 శాతం తగ్గి రూ.348 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement