న్యూఢిల్లీ: మొబైల్ టవర్ల కంపెనీ భారతీ ఇన్‌ఫ్రాటెల్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.606 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం(రూ.597 కోట్లు)తో పోల్చితే 2 శాతం వృద్ధి సాధించామని భారతీ ఇన్‌ఫ్రాటెల్ తెలిపింది. ఆదాయం 4 శాతం వృద్ధితో రూ.3,662 కోట్లకు పెరిగిందని కంపెనీ చైర్మన్ అఖిల్ గుప్తా తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.14 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 9 శాతం తగ్గి రూ.2,494 కోట్లకు, ఆదాయం 8 శాతం పెరిగి రూ.14,490 కోట్లకు పెరిగాయని గుప్తా వివరించారు. ఇబిటా 8 శాతం పెరిగి రూ.6,427 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో భారతీ ఇన్‌ఫ్రాటెల్ షేర్ 1 శాతం నష్టంతో రూ.328 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment