
న్యూఢిల్లీ: మొబైల్ టవర్ కంపెనీ భారతీ ఇన్‌ఫ్రాటెల్ నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి త్రైమాసిక (క్యూ1, ఏప్రిల్–జూన్) కాలానికి నికర లాభం రూ.638 కోట్లుగా నమోదయింది. 2017–18 ఏడాది ఇదేకాలానికి రూ.664 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన కంపెనీ.. టెలికం రంగంలో కొనసాగుతున్న కన్సాలిడేషన్ నేపథ్యంలో 4 శాతం తగ్గుదలను చూపింది. అయితే, కన్సాలిడేట్ ప్రాతిపదికన ఆదాయం 4 శాతం వృద్ధిని నమోదుచేసింది.
రూ.3,674 కోట్లుగా నిలిచింది. (ఇండస్ టవర్స్ వాటాను కలుపుకుని ఈ మొత్తం నమోదు కాగా, సంస్థలో 42 శాతం వాటాను భారతీ ఇన్‌ఫ్రాటెల్ కలిగిఉంది.) అంతకుముందు ఇదేకాలానికి ఆదాయం రూ.3,524 కోట్లుగా నమోదయింది. ‘ప్రస్తుతం టెలికం రంగం అనుసంధాన దశలో ఉంది. భవిష్యత్ అవకాశాల అందిపుచ్చుకోవడం కోసం ఆపరేటర్లు తమ నెట్‌వర్కులను, స్పెక్ట్రమ్‌ను ఏకీకృతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.‘ అని చైర్మన్ అఖిల్ గుప్తా వివరించారు.