సోషల్ మీడియాలో ఒక వ్యక్తి షేర్ చేసిన ఫొటో ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. కిశోర్ స్వామి అనే అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో తన తల్లి 70 ఏళ్ల వయసులోనూ తన బెడ్ నీట్‌గా సద్దుతుందని, దీనిని చూస్తే ఆమె ఒక శక్తివంతమైన గృహిణి అనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు పలు విధాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు ఈ ఫొటోను షేర్ చేసిన కిశోర్ తీరుకు మండిపడుతున్నారు. అతని దృష్టికోణం మారాలని, అతను ఆలోచనా తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.
ఆ వ్యక్తి ఫొటోకు క్యాప్షన్‌గా..‘70 ఏళ్లు దాటిన మా అమ్మ నేను ఇంటికి వచ్చేసరికి నా కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. నా పక్కను పరిశుభ్రంగా ఉంచుతుంది. దీనిని చూస్తే ఆమె అత్యుత్తమ గృహిణి అని అనిపిస్తుందని రాశారు. ఆమెకు ఇటువంటి పనులు చేయాల్సిన అవసరం లేదని, అయినా ప్రేమతో ఈ పనులను చేస్తుందని’ పేర్కొన్నారు.
ఈ పోస్టుకు ట్విట్టర్‌లో వెంటనే ప్రతిస్పందనలు వచ్చాయి. ఒక యూజర్ ‘మీకు సిగ్గులేదు. మీరు ఉదయాన్నే మీ పక్క సద్దుకోకుండా, మీ 70 ఏళ్ల అమ్మ చేత ఈ పని చేయిస్తున్నారు. మీరంటున్నట్లు ఇది గృహధర్మం కాదు.. పెద్దలను పీడించడం. వారికి గౌరవం ఇవ్వకపోవడం’ అని పేర్కొన్నారు. మరో యూజర్.. ఈ వ్యక్తి ఇటువంటి పోస్టుతో అపనమ్మకాన్ని పోషించే పనిచేస్తున్నారు’ అని ఆరోపించారు. ఇంకొక యూజర్ ‘మీ అమ్మ అంత పెద్ద వయసులోనూ పనులు చేస్తుంటే మీరు దానిని గొప్పగా చెప్పడం వింతగా ఉందని కామెంట్ చేశారు.
Though 70+ my mom ensures that when I reach home , my bed is comfortable. The power of a home maker. There is no compulsion for her to do it. Yet she does it out of love. The value system that our dharma has inculcated protects this society. pic.twitter.com/t58Fir5IrT
— kishore k swamy 🇮🇳 (@sansbarrier) July 7, 2023
దీనికి భిన్నంగానూ కొందరు యూజర్లు కామెంట్ చేశారు. ‘ఈ ఫొటోపై వస్తున్న కామెంట్లు చూస్తే, ఆశ్చర్యం కలుగుతున్నదని, మనం తల్లి మాతృత్వంలోని గొప్పదనాన్ని అర్థం చేసుకోలేమని, ఇటువంటి పనులు చేయడంలో ఆమెకు ఆనందం కలుగుతుందని’ ఒక యూజర్ పేర్కొన్నారు. మరో యూజర్ ‘అతని తల్లి ఈ పనులను బలవంతం మీద చేయడంలేదని, ప్రేమతోనే చేస్తున్నదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: వైద్యునికి షాకిచ్చిన సమోసాలు.. రూ.1.40 లక్షలకు టోకరా!
Comments
Please login to add a commentAdd a comment