జీడీపీలో మొబైల్ రంగం వాటా 8.2 శాతం | Mobile industry to contribute 8.2% to GDP by 2020: Govt report | Sakshi
Sakshi News home page

జీడీపీలో మొబైల్ రంగం వాటా 8.2 శాతం

Published Fri, Nov 25 2016 1:39 AM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM

జీడీపీలో మొబైల్ రంగం వాటా 8.2 శాతం

జీడీపీలో మొబైల్ రంగం వాటా 8.2 శాతం

2020 నాటికి సాధ్యమన్న ప్రభుత్వ నివేదిక
న్యూఢిల్లీ: దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో మొబైల్ రంగం వాటా 2020 నాటికి 8.2 శాతానికి చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక విభాగం, టెలికం శాఖలు సంయుక్తంగా ఓ నివేదికలో తెలిపారుు. ప్రస్తుతం జీడీపీలో ఈ రంగం తోడ్పాటు 6.5 శాతం (140 బిలియన్ డాలర్లు/రూ.9.38 లక్షల కోట్లు)గా ఉందని... 40 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందని పేర్కొన్నారుు.  ‘‘2020 నాటికి మొబైల్ ఫోన్ చందాదారుల సంఖ్య 100 కోట్లను దాటుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. 2014 ఏప్రిల్-2016 మార్చి కాలానికి టెలికం రంగంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 4.19 బిలియన్ డాలర్లు (రూ.28,000 కోట్లు)గా ఉన్నట్టు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement