న్యూఢిల్లీ: నగదు నిర్వహణ, చెల్లింపుల కంపెనీ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్‌లో ప్రమోటర్ సంస్థ దాదాపు 14 శాతం వాటాను విక్రయించింది. ప్రమోటర్ కంపెనీ సియాన్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ 13.7 శాతం వాటాకు సమానమైన 2.12 కోట్ల షేర్లను విక్రయించింది. ఎన్‌ఎస్‌ఈ బల్క్ డీల్ వివరాల ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి 300.23 సగటు ధరలో వాటాను దాదాపు రూ. 638 కోట్లకు అమ్మివేసింది.
వేల్యూక్వెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వయిజర్స్, ఎస్‌బీఐ ఎంఎఫ్, ఐఐఎఫ్‌ఎల్ ఎంఎఫ్, 306 వన్ ఎంఎఫ్, నార్జెస్ బ్యాంక్, అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ సీఎంఎస్ షేర్లను కొనుగోలు చేశాయి. ఈ లావాదేవీల తదుపరి సీఎంఎస్ ఇన్ఫోలో సియాన్ ఇన్వెస్ట్‌మెంట్ వాటా 60.24 శాతం నుంచి 46.54 శాతానికి తగ్గింది.
వాటా విక్రయ వార్తలతో సీఎంఎస్ ఇన్ఫో షేరు ఎన్‌ఎస్‌ఈలో 6 శాతం పతనమై రూ. 307 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment