CMS
-
సీఎంఎస్ ఇన్ఫోలో తగ్గిన వాటా
న్యూఢిల్లీ: నగదు నిర్వహణ, చెల్లింపుల కంపెనీ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్‌లో ప్రమోటర్ సంస్థ దాదాపు 14 శాతం వాటాను విక్రయించింది. ప్రమోటర్ కంపెనీ సియాన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ 13.7 శాతం వాటాకు సమానమైన 2.12 కోట్ల షేర్లను విక్రయించింది. ఎన్ఎస్ఈ బల్క్ డీల్ వివరాల ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి 300.23 సగటు ధరలో వాటాను దాదాపు రూ. 638 కోట్లకు అమ్మివేసింది. వేల్యూక్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్స్, ఎస్బీఐ ఎంఎఫ్, ఐఐఎఫ్ఎల్ ఎంఎఫ్, 306 వన్ ఎంఎఫ్, నార్జెస్ బ్యాంక్, అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ సీఎంఎస్ షేర్లను కొనుగోలు చేశాయి. ఈ లావాదేవీల తదుపరి సీఎంఎస్ ఇన్ఫోలో సియాన్ ఇన్వెస్ట్మెంట్ వాటా 60.24 శాతం నుంచి 46.54 శాతానికి తగ్గింది. వాటా విక్రయ వార్తలతో సీఎంఎస్ ఇన్ఫో షేరు ఎన్ఎస్ఈలో 6 శాతం పతనమై రూ. 307 వద్ద ముగిసింది. -
మావోయిస్టులతో లింకులపై... ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్: నిషేధిత మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తిజేస్తూ యువత మావోయిస్టుల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారన్న అభియో గంపై చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) నాయకులు డొంగరి దేవేంద్ర, దుబాసి స్వప్న, చుక్కా శిల్పను జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) గురువారం అరెస్టు చేసింది. వారిలో శిల్ప హైకోర్టు న్యాయవాది. ఏపీలోని విశాఖపట్నంలో 2017 డిసెంబర్లో అదృశ్యమైన రాధ అనే నర్సింగ్ విద్యార్థిని కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ బృం దాలు సికింద్రాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఉన్న నిందితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశాయి. దాదాపు 4 గంటలపాటు సోదాలు చేపట్టి కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నాయి. అనంతరం వారిని అరెస్టు చేశాయి. ఇదీ కేసు... పోలీసుల కథనం ప్రకారం కాప్రాలోని సాయిబాబా కాలనీకి చెందిన పల్లెపాటి పోచమ్మ చిన్న కుమార్తె రాధ నర్సింగ్ విద్యార్థిని. మావోయిస్టు పార్టీకి అనుబంధంగా పని చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) నాయకులు డొంగరి దేవేంద్ర, దుబాసి స్వప్న, చుక్క శిల్ప తదితరులు తరచూ రాధను కలిసేవారు. 2017 డిసెంబర్లో రాధను కలిసిన దేవేంద్ర... కొందరికి వైద్యం చేయాల్సి ఉందంటూ బలవంతంగా ఆమెను తీసుకుకెళ్లాడు. అప్పటి నుంచి రాధ తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆమె కోసం పోచమ్మ అనేక ప్రాంతాల్లో గాలించి చివరకు తన కుమార్తె మావోయిస్టు పార్టీలో చేరిందని... విశాఖపట్నం జిల్లా పెద్దబయలు అటవీ ప్రాంతంలో అగ్రనేతలు ఉదయ్, అరుణలతో కలసి పనిచేస్తున్నట్లు తెలుసుకుంది. రాధ అదృశ్యంపై ఈ ఏడాది జనవరిలో విశాఖ జిల్లాలోని పెద్దబయలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యమైన సమయంలో రాధ మైనర్ కావడంతో దీన్ని కిడ్నాప్ కేసుగా పోలీసులు నమోదు చేసుకున్నారు. బలహీన వర్గాల కేసులు వాదిస్తున్న శిల్ప... హైకోర్టు అడ్వొకేట్‌గా పని చేస్తున్న శిల్ప 6 నెలలుగా బోడుప్పల్‌లోని హేమానగర్లో భర్త కిరణ్, అత్త హేమతో కలసి అద్దెకు ఉంటోంది. పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన పలు కోర్టు కేసులను శిల్ప వాదిస్తోంది. కాగా, తన భార్యను ఎన్ఐఏ అక్రమంగా అరెస్టు చేసిందని శిల్ప భర్త కిరణ్ ఆరోపించారు. రంగంలోకి ఎన్ఐఏ... కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ అయింది. దీంతో ఈ నెల 3న ఈ కేసును రీ–రిజిస్టర్ చేసిన ఎన్ఐఏ... సీఎంఎస్ నాయకులే కుట్రపూరితంగా రాధను మావోయిస్టు పార్టీలో చేర్చారని, అడవిలో ఆమెను నిర్బంధించి ఉంచారని ఆరోపించింది. మావోయిస్టు పార్టీ ఆంధ్రా–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్, అరుణ, దేవేంద్ర, స్వప్న, శిల్ప తదితరులను నిందితులుగా చేర్చింది. -
సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం
-
సీఎంఎస్ ఇన్ఫోలో మహిళా డైరెక్టర్లు
న్యూఢిల్లీ: క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ తాజాగా ఇద్దరు మహిళా డైరెక్టర్లను నియమించుకుంది. కార్పొరేట్ పాలన నిబంధనలకు అనుగుణంగా స్వతంత్ర డైరెక్టర్ల హోదాలో మంజు అగర్వాల్, ఎస్.వసంత్ కారన్‌జ్‌కర్‌లను ఎంపిక చేసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, ఫిన్‌టెక్ విభాగాలలో వీరికి సీనియారిటీ ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో బోర్డులో మహిళా డైరెక్టర్ల సంఖ్య మూడుకు చేరినట్లు తెలియజేసింది. ఆరుగురు సభ్యుల బోర్డుకు చైర్‌పర్శన్, నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామలా గోపీనాథ్ అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్ సుపరిపాలన విషయంలో కంపెనీ పాటిస్తున్న అత్యుత్తమ ప్రమాణాలకు తాజా ఎంపికలు నిదర్శనాలని సీఎంఎస్ ఇన్ఫో పేర్కొంది. తద్వారా ముగ్గురు లేదా అంతకుమించి మహిళా డైరెక్టర్లు కలిగిన ఎన్ఎస్ఈ టాప్–10 శాతం లిస్టెడ్ కంపెనీలలో ఒకటిగా ఆవిర్భవించినట్లు వివరించింది. బ్యాక్‌గ్రౌండ్..: అగర్వాల్ ఎస్బీఐలో 34ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. దేశ, విదేశాలలో రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్, కస్టమర్ సర్వీసులు, వ్యూహాలు, నిర్వహణ తదితర విభాగాలలో విధులు చేపట్టారు. ఇక వసంత్ కారన్‌జ్‌కర్ కన్జూమర్ లెండింగ్ సంస్థ పేసెన్స్‌కు సహవ్యవస్థాపకురాలిగా వ్యవహరించారు. బిజినెస్, వృద్ధి, నిర్వహణ విభాగాలకు అధికారిణిగా బాధ్యతలు నిర్వహించారు. పేయూ క్రెడిట్ ఇండియాకు చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. పేసెన్స్ పురోగతి సాధించాక పేయూ ఇండియాకు చెందిన నాస్పెర్స్‌కు విక్రయించారు. -
3 ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు తాజాగా మూడు కంపెనీలను అనుమతించింది. జాబితాలో క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్, మహిళా దుస్తుల బ్రాండ్ గో కలర్స్ సంస్థ గో ఫ్యాషన్, మైనింగ్ ప్రొడక్టుల కంపెనీ టెగా ఇండస్ట్రీస్ చేరాయి. ఆగస్టులో ఈ కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. కాగా.. డైవర్సిఫైడ్ సంస్థ పీకేహెచ్ వెంచర్స్ ఐపీవో ప్రయత్నాలు విరమించుకుంటూ ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంది. వివరాలిలా.. ఐపీవో ద్వారా సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ రూ. 2,000 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ప్రమోటర్ సంస్థ సియాన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ ఈక్విటీని విక్రయించనుంది. బేరింగ్ పీఈ ఏషియాకు చెందిన ఈ సంస్థ 2015లో సీఎంఎస్‌లో 100 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇక ఐపీవోలో భాగంగా గో ఫ్యాషన్ ఇండియా లిమిటెడ్ రూ. 125 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.28 కోట్ల షేర్లను సైతం విక్రయించనుంది. నిధులను 120 కొత్త ప్రత్యేకించిన బ్రాండ్ ఔట్లెట్ల ఏర్పాటుకు వినియోగించనుంది. టెగా ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ ద్వారా 1.36 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. క్యాపిటల్ స్మాల్ బ్యాంక్ కూడా.... షెడ్యూల్డ్ హోదా గల క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు మరో 38.40 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. పీఐ వెంచర్స్ ఎల్ఎల్పీ 3.37 లక్షల షేర్లు, ఎమికస్ క్యాపిటల్ పీఈ1 ఎల్ఎల్పీ 6.04 లక్షల షేర్లు, ఒమన్ ఇండియా సంయుక్త ఇన్వెస్ట్మెంట్ ఫండ్2– 8.37 లక్షల షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. ఇతర వాటాదారులు సైతం 19.91 లక్షల షేర్లను విక్రయించనున్నారు. నైకా ఐపీవోకు భారీ డిమాండ్ 82 రెట్లు అధిక స్పందన ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్ కంపెనీ నైకా వెంచర్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి భారీ స్పందన లభించింది. ఇష్యూ చివరి రోజు సోమవారానికల్లా దాదాపు 82 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. షేరుకి రూ. 1,085–1,125 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూలో భాగంగా దాదాపు 2.65 కోట్ల షేర్లను ఆఫర్ చేసింది. అయితే 216 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. తద్వారా కంపెనీ రూ. 5,352 కోట్లు సమకూర్చుకుంది. బ్యూటీ, వెల్నెస్ ప్రొడక్టుల కంపెనీ నైకా ఐపీవోకు అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లు(క్విబ్) 91.2 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలు చేయగా.. సంస్థాగతేతర ఇన్వెస్టర్లు 112 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. ఇక రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలోనూ 12.25 రెట్లు అధికంగా స్పందన కనిపించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 630 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 4.19 కోట్లకుపైగా షేర్లను విక్రయించింది. ఐపీవోలో భాగంగా గత బుధవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 2,396 కోట్లు సమీకరించిన విషయం విదితమే. -
10 రాష్ట్రాల్లో కట్టడి అవసరం: మోదీ
న్యూఢిల్లీ: కలసికట్టుగా కరోనాపై పోరాటం చేద్దామని ప్రధాని మోదీ ముఖ్యమంత్రులకు పిలుపు నిచ్చారు. కోవిడ్ కేసులు అత్యధికంగా ఉన్న 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో సమీక్షిం చారు. మొత్తం కేసుల్లో 80 శాతంపైగా నమోదవుతున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్, గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కరోనాని కట్టడి చేస్తే, భారత్ ఈ మహమ్మా రిపై విజయం సాధి స్తుందని అన్నారు. సమావేశంలో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఎవరికైనా వైరస్ సోకిందని నిర్ధారణ అయ్యాక ఆ వ్యక్తిని కలుసుకున్న వారందరినీ 72 గంట ల్లోగా గుర్తించి పరీక్షలు చేస్తే కేసుల్ని గణనీ యంగా అడ్డుకోవచ్చునన్నారు. తెలంగాణ, బిహార్, గుజరాత్, యూపీ, బెంగాల్‌లలో కరోనా పరీక్షల్ని విస్తృతంగా చేపట్టాలన్నారు. -
కలకలం రేపిన పోస్టర్లు
సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు : జిల్లాలోని పలు మహిళా కళాశాలల్లో, హాస్టళ్ళ వద్ద రాత్రికి రాత్రి హెచ్చరిక పోస్టర్లు ఏర్పాటుకావడం కలకలం రేపింది. తస్మాత్ జాగ్రత్త అంటూ విద్యార్థిని చైతన్య వేదిక పేరుతో ఈపోస్టర్లు వెలిశాయి. రాత్రికి రాత్రే ఈ పోస్టర్లు ఎవరు అంటించారని విద్యార్థినులు, కళాశాల యాజమాన్యాలు చర్చించుకుంటున్నాయి. గతంలో కూడా ఏలూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి మహిళా కళాశాలల వద్ద ఇదే రకమైన పోస్టర్లు వెలిశాయి. ఇప్పుడు తాజాగా ఈ పోస్టర్ల పట్ల కలకలం రేగింది. చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్)ను వ్యతిరేకిస్తూ ఈ పోస్టర్లు ఉన్నాయి. సీఎంఎస్ మావోయిస్టు ముసుగు సంఘం అని, మావోయిస్టులతో సంబంధం కలిగి ఉన్న సంస్థ అని పోస్టర్లలో ఉంది. వీరంతా సీఎంఎస్ పేరుతో కళాశాలల్లో చొరబడి నూతన విద్యార్థినిలకు స్వాగతం పలుకుతూ వారికి దగ్గరై మావోయిజం వైపు ఆకర్షితులను చేస్తారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పోస్టర్లు ఏర్పాటు కావడంతో చర్చనీయాంశం అయ్యింది. విద్యార్థినులకు మాయమాటలతో మావోయిస్టు భావజాలం బోధిస్తారని, మావోయిజం వైపు ఆకర్షితులను చేసి విద్యార్థినులను మావోయిస్టు దళాల్లో చేర్చడం సీఎంఎస్ బృందం మహిళల, యువతుల లక్ష్యమని అందువల్ల వీరిని నమ్మవద్దని, కళాశాలల్లో అనుమతించవద్దని పోస్టర్లలో పేర్కొన్నారు. పోస్టర్లలో మావోయిస్టు, మావోయిస్టు సానుభూతిపరుల చిత్రాలను ముద్రించారు. మావోయిస్టుల్లో పనిచేసిన అన్నపూర్ణ, సిఫోరా, ఆమె కుమార్తెలు ఇందు, మంజు, మావోయిస్టు సానుభూతిపరురాలు సంధ్య ఫొటోలు పోస్టర్లలో ముద్రించారు. వీరు కళాశాల ప్రారంభం సమయంలో ఆయా కళాశాలల వద్దకు వచ్చి నూతనంగా చేరే విద్యార్థినులను మావోయిస్టు భావజాలం వైపు ఆకర్షించేలా పాటలు, మావోయిస్టుకు సంబంధించిన కథనాలను వివరిస్తూ ఆకర్షితులను చేస్తారని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రత్యేకంగా సీఎంఎస్ సభ్యులు మావోయిస్టు రిక్రూట్మెంట్ ఏజెన్సీగా పనిచేస్తుందని పోలీసుల వద్ద కచ్చితమైన సమాచారం ఉంది. దీంతో సీఎంఎస్ సభ్యులకు ఆకర్షితులు కావద్దని విద్యార్థిని చైతన్య వేదిక పేరుతో పోస్టర్లు వెలవడం చర్చనీయాంశం అయ్యింది. ఏలూరు, తాడేపల్లిగూడెం మహిళా కళాశాలల వద్ద, హాస్టళ్ళ వద్ద ఈ పోస్టర్లను అతికించారు. సీఎంఎస్ సభ్యులు పట్టుదలతో కొంతమందినైనా ఆకర్షితులు చేయకపోతారా అని మావోయిస్టు సంఘం ఆయా కళాశాలల వద్దకు చైతన్య మహిళా సంఘం పేరుతో పంపుతున్నట్లు తెలుస్తోంది. -
ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం..
న్యూఢిల్లీః ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఛైర్మన్ గా ఉండే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ జూలై 16న ముఖ్యమంత్రులతో సమావేశం కానునుంది. పాఠశాల విద్య, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ స్కీమ్, ఆధార్ కార్డ్, ఆర్థిక, సామాజిక అంశాల ప్రణాళికలపై ఈ ప్రత్యేక సమావేశంలో చర్చించనున్నారు. మోదీ ప్రభుత్వంపై ఇప్పటికే ఎన్నో విమర్శలు కురిపిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈ వేదికపై సమస్యలను చర్చించే అవకాశం ఉంది. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ 11 వ సమావేశం జూలై 16వ తేదీన నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రాల్లో సమస్యలు, సంబంధాలు, భద్రత, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వంటి అంశాలతోపాటు, పాఠశాల విద్య, ఆధార్ సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పదేళ్ళ తర్వాత ఈ 11వ ముఖ్యమంత్రుల సమావేశం జరగడం విశేషం. కౌన్సిల్ కు ఛైర్మన్ గా ఉన్న ప్రధానమంత్రి మోదీ.. కేబినెట్ లోని ఆరుగురు మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కారీ, మనోహర్ పారికర్ ల ను కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నారు. అంతేకాక మరో 11 మంది శాశ్వత ఆహ్వానితులుగా ఉన్న మంత్రులు సైతం ఈ సమావేశంలో పాల్గొంటారు. కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు ఇతర అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో పాల్గొని ఆయా రాష్ట్రాల్లోని సమస్యలతోపాటు, దేశవ్యాప్తంగా ప్రధాన సమస్యలను చర్చిస్తారు. పదేళ్ళ క్రితం 2006 లో ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశం జరిగింది. యూపీఏ ప్రభుత్వ పదేళ్ళ హయాంలో కేవలం రెండుసార్లు మాత్రమే కౌన్సిల్ మీటింగ్ జరిగింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 అనంతరం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ రూపాన్ని కొంతవరకూ మార్చింది. జూలై 16 నిర్వహించే 11వ సమావేశంలో అనేక సమస్యలపై ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. -
ప్రైవేట్ ఉద్యోగుల చేతివాటం...అరెస్ట్
కాకినాడ: ప్రైవేట్ ఉద్యోగుల ఘరానా మోసం కాకినాడలో కలకలం రేపింది. సీఎంఎస్ సంస్థ స్థానిక ఏటీఎంలలో నగదు పెట్టే కాంట్రాక్టును నిర్వహిస్తుంది. ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు మోసానికి పాల్పడ్డాడు. కాకినాడ టెంపుల్ వీధిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎంలో డబ్బులు నింపే క్రమంలో సీఎంఎస్ ఉద్యోగి భరణీకుమార్ రూ. 10 లక్షలను అందులో పెట్టకుండా సొంతంగా ఖర్చుపెట్టుకున్నాడు. దీంతో సీఎంఎస్ సంస్థ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనికి మరో ఇద్దరు ఉద్యోగులు సహకరించినట్లు తెలుస్తోంది. భరణీకుమార్‌ను అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. -
ఇద్దరు సీఎంలు దోషులే..
గుండాల : రెండు తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న ముఖ్యమంత్రులిద్దరూ దోషులేనని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. శనివారం స్థానిక గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పదవులు కాపాడుకోవడానికి ముఖ్యమంత్రులు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజలను పక్కతోవ పట్టించడానికి ఓటుకు కోట్లు పేరుతో ఒకరు, ఎమ్మెల్యేలు అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారని మరొకరు కపట నాటకాలు ఆడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత హామీలు నెరవేర్చడాన్ని మరిచి ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. వేల కోట్లతో ప్రారంభించిన చెరువుల పూడికతీత పనులు ఎక్కడ పూర్తయ్యాయో బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మిషన్ కాకతీయలో అక్రమంగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. మాయమాటలు చెప్పి పార్టీలు మార్చేందుకు ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదని, తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదని హితవు పలికారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు మందడి రామకృష్ణారెడ్డి, డీసీసీబీ డెరైక్టర్ దుంపల శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ మాదరబోయిన సునీత, తదితరులు పాల్గొన్నారు. -
‘ఓటుకు నోటు’లో ఇద్దరు సీఎంలు దోషులే
వరంగల్ అర్బన్/హన్మకొండ : ఓటుకు నోటు వ్యవహరంలో ఏపీ, తెలంగాణ సీఎంలు ఇద్దరూ దోషులేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. హన్మకొండ నయూంనగర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు విషయంలో చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోలేకపోతున్నారన్నారు. రాజ్యాం గాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. రాష్ట్రంలో దేవాలయాల వద్దకు విస్తృత పర్యటనలు చేస్తున్న కేసీఆర్ మసీదులు, చర్చిల వద్దకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. అండర్‌డ్రైనేజీ కోసం ఉద్యమిస్తాం వరంగల్ నగరంలో అండర్‌డ్రైనేజీ కోసం ప్రజ లతో కలిసి ఉద్యమం చేస్తామని మంద కృష్ణ మాదిగ తెలిపారు. స్టేషన్ రోడ్డులోని మహేశ్వరీ గార్డెన్లో శుక్రవారం ఎమ్మార్పీఎస్ జిల్లా స్థాయి సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎన్నికల పర్యటనలో హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరమని, తమ పార్టీకి అధికారం ఇస్తే వంద రోజుల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడ్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఏడాది గడిచినా అండర్ డ్రైనేజీ ఊసెత్తడం లేదని విమర్శించారు. ప్రత్యేకంగా దళితమంత్రిని నియమించి దళిత సంక్షేమ శాఖను అప్పగించాలని సూచించారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ రమేష్ మాదిగ, సభ అధ్యక్షుడు కొయ్యడ మల్లేష్ మాదిగ, జాతీయ నాయకులు తిప్పారపు లక్ష్మణ్‌మాదిగ, నాయకులు వేల్పుల వీరన్న, నకిరకంటి యాకయ్య, పుట్ట రవి, వరంగల్ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ ఈర్ల కుమార్, మహిళ నేతలు సింగిరెడ్డి కృష్ణ, దామెర కరుణ, తూర్పు నాయకులు సింగారపు చిరంజీవి, ప్రమోద్ పాల్గొన్నారు. -
కోటి రూపాయలకుపైగా నొక్కేసిన సీఎంఎస్ సిబ్బంది
హైదరాబాద్: సీఎంఎస్(క్యాస్ మేనేజ్మెంట్ సర్వీస్) కస్టోడియన్ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించి కోటి రూపాయలకుపైగా స్వాహా చేశారు. ఏటీఎంలలో నగదును పెట్టే బాధ్యతను సీఎంఎస్ సంస్థలు నిర్వహిస్తుంటాయి. ఏటీఎంలలో నగదు పెట్టవలసిన సిబ్బంది పెట్టకుండా వాళ్లే కొట్టేశారు. కొంతమంది సిబ్బంది కలసి కోటి రూపాయలకు పైగా నొక్కేశారు. సీఎంఎస్ సంస్థ ఫిర్యాదు మేరకు నాచారం పోలీసులు ఏడుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. -
కాంగ్రెస్ మేధోమథనానికి సీఎం కిరణ్