ప్రైవేట్ ఉద్యోగుల చేతివాటం...అరెస్ట్ | private employees arrest due to fraud in kakinada | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ ఉద్యోగుల చేతివాటం...అరెస్ట్

Published Sun, Nov 1 2015 10:50 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

private employees arrest due to fraud in kakinada

కాకినాడ: ప్రైవేట్ ఉద్యోగుల ఘరానా మోసం కాకినాడలో కలకలం రేపింది. సీఎంఎస్ సంస్థ స్థానిక ఏటీఎంలలో నగదు పెట్టే కాంట్రాక్టును నిర్వహిస్తుంది. ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు మోసానికి పాల్పడ్డాడు.

కాకినాడ టెంపుల్ వీధిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎంలో డబ్బులు నింపే క్రమంలో సీఎంఎస్ ఉద్యోగి భరణీకుమార్ రూ. 10 లక్షలను అందులో పెట్టకుండా సొంతంగా ఖర్చుపెట్టుకున్నాడు. దీంతో సీఎంఎస్ సంస్థ  సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనికి మరో ఇద్దరు ఉద్యోగులు సహకరించినట్లు తెలుస్తోంది. భరణీకుమార్‌ను అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement