holdings
-
ఏఐఎన్‌యూలో ఏషియన్ హెల్త్‌కేర్ హోల్డింగ్స్ మెజారిటీ వాటా
హైదరాబాద్: సింగిల్ స్పెషాలిటీ హెల్త్‌కేర్ డెలివరీ ప్లాట్‌ఫాం అయిన ఏషియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్ (ఏహెచ్‌హెచ్) సంస్థ.. యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలకు గాను దేశంలోనే అతిపెద్ద సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రి అయిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ)లో మెజారిటీ వాటాను తీసుకుంది. ఏఐఎన్‌యూకు దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఆస్పత్రులు ఉండటంతో పాటు రోబోటిక్ యూరాలజీ సర్జరీలలో ముందంజలో ఉన్న ఘనత ఉంది. ప్రైమరీ, సెకండరీ ఇన్‌ప్యూజన్ల ద్వారా ఏహెచ్‌హెచ్ ఈ సంస్థలో రూ.600 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఏహెచ్‌హెచ్ ఇప్పుడు యూరాలజీ, నెఫ్రాలజీ విభాగంలోకి ఈ పెట్టుబడి ద్వారా అడుగుపెట్టడంతో నాలుగో స్పెషాలిటీలోకి కూడా వచ్చినట్లయింది. తద్వారా, భారతదేశంతో పాటు ఆసియా ఉపఖండంలోనే ఏకైక అతిపెద్ద సింగిల్ స్పెషాలిటీ హెల్త్‌కేర్ డెలివరీ ప్లాట్‌ఫాం అవుతుంది. ఏహెచ్‌హెచ్ 2017లో ప్రారంభమైంది. అప్పటినుంచి ఆంకాలజీ (సీటీఎస్ఐ), మహిళలు, పిల్లలు (మదర్‌హుడ్ హాస్పిటల్స్), ఐవీఎఫ్, సంతాన సాఫల్యం (నోవా ఐవీఎఫ్) ఆస్పత్రులలో వాటాలు తీసుకుంది. ఇవన్నీ ఆయా రంగాల్లో నాయకత్వ స్థానాల్లో ఉన్నవే. డాక్టర్ సి.మల్లికార్జున, డాక్టర్ పి.సి. రెడ్డిల నేతృత్వంలోని ప్రముఖ యూరాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు కలిసి 2013లో ఏఐఎన్యూను స్థాపించారు. అప్పటినుంచి దేశంలో యూరాలజీ, నెఫ్రాలజీ క్లినికల్ స్పెషాలిటీలో ప్రముఖ ఆస్పత్రిగా ఎదిగింది. ఈ కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, సిలిగురి, చెన్నై నగరాల్లో ఏడు ఆస్పత్రులు నడుపుతోంది. వీటన్నింటిలో కలిపి 500కు పైగా పడకలున్నాయి, 4 లక్షల మందికి పైగా రోగులకు చికిత్స చేసి, 50వేల ప్రొసీజర్లు పూర్తిచేసింది. రోబోటిక్ యూరాలజీ శస్త్రచికిత్సలలో ఏఐఎన్‌యూ నాయకత్వస్థానం సంపాదించింది. ఇప్పటికి ఈ టెక్నాలజీతో వెయ్యికి పైగా ఆపరేషన్లు పూర్తిచేసింది. ఇక నెఫ్రాలజీ విభాగం విషయానికొస్తే, 2 లక్షలకు పైగా డయాలసిస్‌లు, 300 మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు ఇక్కడ చేశారు. “యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో ఏఐఎన్‌యూ ఒక విభిన్నమైన సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్. ఆయా విభాగాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న వైద్యులు.. క్లినికల్ నైపుణ్యం అనే పునాదిపై దీన్ని నిర్మించారు. ఏహెచ్‌హెచ్ ప్లాట్‌ఫాంలో ఏఐఎన్‌యూ కేవలం ఒక కొత్త స్పెషాలిటీని కలపడమే కాక, దేశంలో సింగిల్ స్పెషాలిటీ వైద్యవ్యవస్థను మరింత పెంచాలన్న మా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది. యూరలాజికల్ సమస్యలు అత్యంత ఎక్కువగా ఉన్న టాప్-3 దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఇక్కడ మధుమేహం, రక్తపోటు అధికంగా ఉండటంతో పాటు దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి (సీకేడీ) కూడా ఎక్కువగా ఉంటోంది. దేశంలో యూరాలజీ, నెఫ్రాలజీ వైద్యసేవలకు ఉన్న డిమాండుకు, సరఫరాకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు ఏఐఎన్‌యూ మాతో కలవడం మాకెంతో సంతోషంగా ఉంది” అని ఏషియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ విశాల్ బాలి తెలిపారు. ఏఐఎన్‌యూ తన ఆస్పత్రులన్నింటిలో యూరాలజీ సమస్యలకు అత్యాధునిక చికిత్సను అందిస్తుంది. దీని సమగ్ర సేవలలో మూత్రపిండాల్లో రాళ్లు, యూరాలజీ క్యాన్సర్లు, ప్రోస్టేట్ వ్యాధులు, పునర్నిర్మాణ యూరాలజీ శస్త్రచికిత్స, లాపరోస్కోపిక్ యూరాలజీ, ఆండ్రాలజీకి రోగనిర్ధారణ, చికిత్స ఉన్నాయి. నెఫ్రాలజీ విభాగంలో తీవ్రమైన, దీర్ఘకాలిక, తుది దశ మూత్రపిండ వ్యాధులకు (ఇఎస్ఆర్డీ) చికిత్సను అందిస్తారు. అలాగే మెరుగైన క్లినికల్ ఫలితాలను అందించడానికి హై-ఎండ్ హిమోడయాఫిల్టరేషన్ (హెచ్డీఎఫ్) యంత్రాలతో కూడిన అత్యాధునిక డయాలసిస్ యూనిట్ ఉంది. “భారతీయులకు మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు, కేన్సర్ రహిత ప్రోస్టేట్ ఎన్‌లార్జిమెంట్ సమస్యలు ఎక్కువ. గత దశాబ్ద కాలంలో యూరలాజికల్ కేన్సర్లు కూడా ఎక్కువ కావడాన్ని మేం గమనించాం. ప్రోస్టేట్, బ్లాడర్ కేన్సర్లు ఎక్కువవుతున్నాయి. మా బృందం యూరలాజికల్ కేన్సర్లకే వెయ్యి రోబోటిక్ సర్జరీలు చేసింది. కేవలం భారతీయ నగరాల్లోనే కాక, 2టైర్ పట్టణాల్లోనూ రోబోటిక్ యూరాలజీ సర్జరీలను అందుబాటులోకి తెస్తున్నాం. రాబోయే సంవత్సరాల్లో యూరో-ఆంకాలజీ, యూరో-గైనకాలజీ, పీడియాట్రిక్ యూరాలజీ కేసులు పెరిగే అవకాశాలున్నాయి. ఏహెచ్‌హెచ్ రాబోయే కాలంలో మా తదుపరి దశ వృద్ధికి సరైన భాగస్వామి అవుతుందని నమ్ముతున్నాం” అని ఏఐఎన్‌యూ చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్టు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సి. మల్లికార్జున చెప్పారు. “భారతదేశ జనాభాలో సుమారు 10 శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం లక్షకు పైగా మూత్రపిండాల వైఫల్యం కేసులు నమోదవుతున్నాయి. ఇది భారతదేశంలోని రోగులకు నెఫ్రాలజీ చికిత్సలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని పెంచుతోంది. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు పెరుగుతున్నందున, క్లినికల్ ఫలితాలను మెరుగుపరచడానికి, మెరుగైన రోగి సంరక్షణ కోసం డయాలసిస్, మూత్రపిండాల మార్పిడిలో సాంకేతిక పురోగతి చాలా అవసరం” అని ఏఐఎన్‌యూ సీనియర్ యూరాలజిస్ట్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పిసి రెడ్డి అన్నారు. 2022లో భారతదేశం సుమారు 1.89 కోట్ల నెఫ్రాలజీ, యూరాలజీ విధానాలను నమోదు చేసింది. వచ్చే ఐదేళ్లలో సిఎజిఆర్ 8-9% పెరుగుతుందని అంచనా. భారత్ లో 6,000 మంది యూరాలజిస్టులు, 3,500 మంది నెఫ్రాలజిస్టులు ఉన్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 350 మంది యూరాలజిస్టులు, 250 మంది నెఫ్రాలజిస్టులు గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తున్నారు. లాపరోస్కోపిక్, ఎండోస్కోపిక్, రోబోటిక్ శస్త్రచికిత్సా ఎంపికల పెరుగుదల దేశంలోని మెట్రోలు, ద్వితీయ శ్రేణి నగరాలలో ఎఐఎన్యుకు బలమైన వృద్ధి అవకాశాన్ని ఇస్తుంది. ఏషియా హెల్త్ కేర్ హోల్డింగ్స్ గురించి 2017లో ప్రారంభమైన ఏషియా హెల్త్ కేర్ హోల్డింగ్స్ (ఏహెచ్‌హెచ్) అనేది సింగపూర్‌కు చెందిన సావరిన్ హెల్త్ ఫండ్ అయిన టిపిజి గ్రోత్, జిఐసి నిధులతో ఏర్పడిన సింగిల్ స్పెషాలిటీ ఇన్వెస్ట్మెంట్, ఆపరేటింగ్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫాం. భారతదేశంలోని 11 నగరాల్లో 23 చోట్ల మహిళలు, పిల్లల ఆసుపత్రుల సమగ్ర నెట్వర్క్ అయిన మదర్‌హుడ్ హాస్పిటల్స్ దీని పరిధిలో ఉన్నాయి. దాంతోపాటు భారతదేశం, దక్షిణాసియాలోని 44 నగరాల్లో 68 ఐవిఎఫ్ సెంటర్లున్న నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీని కూడా ఏహెచ్‌హెచ్ కలిగి ఉంది. ఏహెచ్‌హెచ్ భారతదేశంలోని రెండో అతిపెద్ద ఆంకాలజీ ఆసుపత్రుల చైన్ అయిన సీటీఎస్ఐని ఏర్పాటుచేసి, 2019 లో కంపెనీ నుంచి నిష్క్రమించింది. ఏఐఎన్‌యూ గురించి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) అనేది యూరాలజీ, నెఫ్రాలజీ చికిత్సలకు భారతదేశంలో అతి పెద్ద సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రి. దేశంలోని నాలుగు నగరాల్లో ఏడు ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులతో కూడిన బృందాలు ఉన్నాయి. యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో క్లినికల్ నైపుణ్యాలకు ఇది పెట్టింది పేరు. దాంతోపాటు యూరో-ఆంకాలజీ, రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ, పీడియాట్రిక్ యూరాలజీ, ఫిమేల్ యూరాలజీ, ఆండ్రాలజీ, మూత్రపిండాల మార్పిడి, డయాలసిస్ లాంటి సేవలూ అందిస్తుంది. రోబోటిక్ యూరాలజీ శస్త్రచికిత్సలకు దేశంలోనే ఇది ఆదర్శప్రాయం. దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఆస్పత్రి నెట్‌వర్క్‌లో 500 పడకలు ఉన్నాయి, ఇప్పటివరకు లక్ష మందికిపైగా రోగులకు చికిత్సలు చేసింది. ఏఐఎన్‌యూకు ఎన్ఏబీహెచ్, డీఎన్బీ (యూరాలజీ, నెఫ్రాలజీ), ఎఫ్ఎన్బీ (మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ)ల గుర్తింపు ఉంది. -
ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం!
అమెరికా స్పేస్ రాకెట్ల తయారీ సంస్థ స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2021 నుంచి 2022 మధ్య కాలంలో బిట్ కాయిన్లలో పెట్టిన పెట్టుబడుల మొత్తాన్ని అమ్మినట్లు తెలుస్తోంది. ఆ మొత్తం విలువ 373 మిలియన్ డాలర్లుగా ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మస్క్ తీసుకున్న తాజా నిర్ణయంతో బిట్‌కాయిన్ మార్కెట్ భారీగా కుప్పకూలింది. స్పేస్ఎక్స్ బిట్‌కాయిన్ పెట్టుబడుల్ని అమ్మిన కేవలం అరగంట వ్యవధిలో బిట్‌కాయిన్ మార్కెట్ క్రాష్ అయ్యింది. 800 మిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. స్పేస్ఎక్స్ తన బిట్‌కాయిన్‌లోని ఇన్వెస్ట్మెంట్లను అమ్మడం బిట్ కాయిన్ మార్కెట్లో అలజడి సృష్టించింది. అయినప్పటికీ, స్పేస్ ఎక్స్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. టప్ మని పేలిన బిట్‌కాయిన్ బుడగ పలు నివేదికల ప్రకారం, బిట్‌కాయిన్ బుడగ పేలింది. కేవలం రెండు నెలల్లో తొలిసారి $26,000 కంటే తక్కువకు పడిపోయింది. మొదటి త్రైమాసికంలో 72 శాతం పెరుగుదల తర్వాత మార్చి నెల చివరి నుండి బిట్‌కాయిన్ 9 శాతం క్షీణించింది. చదవండి👉 : ‘X.COM’లో డబ్బు సంపాదించేయండి.. మీకు కావాల్సిన అర్హతలివే! -
సీఎంఎస్ ఇన్ఫోలో తగ్గిన వాటా
న్యూఢిల్లీ: నగదు నిర్వహణ, చెల్లింపుల కంపెనీ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్‌లో ప్రమోటర్ సంస్థ దాదాపు 14 శాతం వాటాను విక్రయించింది. ప్రమోటర్ కంపెనీ సియాన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ 13.7 శాతం వాటాకు సమానమైన 2.12 కోట్ల షేర్లను విక్రయించింది. ఎన్ఎస్ఈ బల్క్ డీల్ వివరాల ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి 300.23 సగటు ధరలో వాటాను దాదాపు రూ. 638 కోట్లకు అమ్మివేసింది. వేల్యూక్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్స్, ఎస్బీఐ ఎంఎఫ్, ఐఐఎఫ్ఎల్ ఎంఎఫ్, 306 వన్ ఎంఎఫ్, నార్జెస్ బ్యాంక్, అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ సీఎంఎస్ షేర్లను కొనుగోలు చేశాయి. ఈ లావాదేవీల తదుపరి సీఎంఎస్ ఇన్ఫోలో సియాన్ ఇన్వెస్ట్మెంట్ వాటా 60.24 శాతం నుంచి 46.54 శాతానికి తగ్గింది. వాటా విక్రయ వార్తలతో సీఎంఎస్ ఇన్ఫో షేరు ఎన్ఎస్ఈలో 6 శాతం పతనమై రూ. 307 వద్ద ముగిసింది. -
అదానీ బిడ్‌పై సెబీకి ఎన్డీటీవీ.. స్పష్టత కోరిన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్
న్యూఢిల్లీ: బలవంతపు టేకోవర్ సవాళ్లు ఎదుర్కొంటున్న మీడియా సంస్థ ఎన్డీటీవీ తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని ఆశ్రయించింది. వీసీపీఎల్‌కు జారీ చేసిన వారంట్లను ఈక్విటీగా మార్పుచేసే అంశంపై స్పష్టత కోసం ప్రమోటర్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ లిమిటెడ్ సెబీని అభ్యర్థించింది. అదానీ గ్రూప్ సంస్థ వీసీపీఎల్ వారంట్లను ఈక్విటీగా మార్పు చేసుకునేందుకు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆర్ఆర్పీఆర్ తాజా చర్యకు ప్రాధాన్యత ఏర్పడింది. వారంట్ల ద్వారా ఆర్ఆర్పీఆర్లో 99.5 శాతం వాటాను వీసీపీఎల్ పొందనుంది. తద్వారా ఎన్డీటీవీలో ఆర్‌ఆర్‌పీఆర్‌కుగల 29.18 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. దీంతో సెబీ నిబంధనల ప్రకారం ఎన్డీటీవీ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి షేరుకి రూ. 294 ధరలో ఇప్పటికే అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌ను సైతం ప్రకటించింది. కాగా.. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లను 2020 నవంబర్ 27న సెబీ రెండేళ్లపాటు సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధించింది. ఈ నిషేధం ఇంకా కొనసాగుతున్నందున వారంట్లను ఈక్విటీగా మార్పు చేసేందుకు ఆర్ఆర్పీఆర్ సెబీ నుంచి స్పష్టతను కోరుతోంది. షేరు జూమ్ వాటాదారులకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ నేపథ్యంలో ఎన్డీటీవీ కౌంటర్‌కు కొద్ది రోజులుగా డిమాండ్ పెరిగింది. దీంతో మరోసారి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఎన్ఎస్ఈలో రూ. 21 బలపడి రూ. 449 వద్ద ముగిసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత నాలుగు వారాల్లో ఈ షేరు రూ. 263 నుంచి 70 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 186 లాభపడింది. -
రిస్క్ తక్కువతో రాబడులు
ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అంటేనే రిస్క్ అధికం. కాకపోతే ఈక్విటీల్లో లార్జ్‌క్యాప్ స్టాక్స్.. మార్కెట్ పతనాల్లో ఇతర స్టాక్స్‌తో పోలిస్తే కాస్త బలంగా నిలబడతాయి. అందుకే ఇతర స్టాక్స్‌తో పోలిస్తే లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో రిస్క్ కాస్త తక్కువ. అదే సమయంలో డెట్ ఫండ్స్‌లోనూ (క్రెడిట్‌రిస్క్ ఫండ్స్ మినహా) రిస్క్ కొంచెం తక్కువగానే ఉంటుంది. ఈ రెండింటిలోనూ పెట్టుబడులు పెట్టేవే హైబ్రిడ్ ఫండ్స్. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ కూ డా ఒకటి. ఈ రెండు విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టే అవకాశం ఈ పథకం రూపంలో లభిస్తుంది. పెట్టుబడుల విధానం హైబ్రిడ్ ఫండ్స్ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ, డెట్ విభాగాల్లోనూ పెట్టుబడుల సమతూకాన్ని మారుస్తుంటాయి. కంపెనీల వ్యాల్యూషన్లు, మార్కెట్లలో అస్థిరతలకు తగినట్టు అవసరమైతే ఈక్విటీ పెట్టుబడులు పెంచుకోవడం, తగ్గించుకోవడం చేస్తుంటాయి. కానీ, ఇన్వెస్టర్లు నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ వెసులుబాటు అంతగా ఉండదు. ఈ పథకం అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఈక్విటీ విభాగం కిందకు వస్తుంది. అంటే పెట్టుబడి అవకాశాల లభ్యతకు అనుగుణంగా 65 నుంచి 80 శాతం వరకు ఈక్విటీలకు కేటాయించే స్వేచ్ఛను కలిగి ఉంటుంది. అదే విధంగా 20–35 శాతం వరకు డెట్‌కు కేటాయిస్తుంది. కొంత రిస్క్ భరించే సామర్థ్యం ఉన్నవారు, దీర్ఘకాలం పాటు (ఐదేళ్లకు మించి) ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. పెట్టుబడుల విషయంలో ఈ ఫండ్.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 26.42 శాతం పెట్టుబడులు ఈ రంగ కంపెనీలకు కేటాయించింది. ఆ తర్వాత ఇంధన రంగ కంపెనీల్లో 13 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 10 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. రాబడులు: ఈ పథకం 2015 జూలైలో ప్రారంభమైంది. పోటీ పథకాలతో పోలిస్తే ఇప్పటి వరకు మంచి పనితీరే చూపించింది. ఈ ఫండ్ గడిచిన ఏడాది కాలంలో 10.2 శాతం రాబడులను అందించింది. కానీ ఇదే కాలంలో ఈ విభాగం సగటు రాబడులు 8.5 శాతంగానే ఉన్నాయి. ఇక గడిచిన మూడేళ్ల కాలంలో ఈ పథకం 9.8 శాతం, ఐదేళ్లలో 9.5 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలాన్ని తెచ్చి పెట్టింది. పథకం ఆరంభం నుంచి చూస్తే రాబడులు వార్షికంగా 10.67 శాతం చొప్పున ఉన్నాయి. అన్ని కాలాల్లోనూ అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ విభాగం రాబడులతో పోలిస్తే ఈ పథకం పనితీరు ముందంజలో ఉంది. ముఖ్యంగా ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో అధిక నాణ్యత కలిగిన (ఏఏఏ) డెట్ పెట్టుబడులు ఉండడాన్ని గమనించాలి. అలాగే, ఈక్విటీ పెట్టుబడుల్లోనూ ఎక్కువ భాగాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయించింది. ఈ పథకం దాదాపు ఎక్కువ సందర్భాల్లో ఈక్విటీలకు 70 నుంచి 75 శాతం వరకే కేటాయిస్తూ వస్తోంది. ప్రస్తుతానికి ఈక్విటీ కేటాయింపులు 78 శాతంగా ఉండగా, డెట్‌లో 13.4 శాతం పెట్టుబడులు, నగదు సమానాల్లో 8 శాతం వరకు కలిగి ఉంది. ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో 56 స్టాక్స్ ఉన్నాయి. -మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ - 7.49 శాతం హెచ్డీఎఫ్సీ బ్యాంకు - 6.79 శాతం ఇన్ఫోసిస్ - 4.99 శాతం ఐసీఐసీఐ బ్యాంకు 4.68 శాతం టీసీఎస్ 4.29శాతం యాక్సిస్ బ్యాంకు 3.38 శాతం ఎస్బీఐ 2.53 శాతం ఐటీసీ 2.30 శాతం హెచ్‌యూఎల్ 2.15 ఎల్అండ్టీ 2.14 -
గాజులతో బ్రాస్లెట్
కావల్సినవి : పలచగా ఉండే 4 పాత బ్యాంగిల్స్, 2 చిన్న క్లాంప్స్(షూ లేసుల చివర్లలో ఉండేలాటివి), పట్టుకార, లెదర్ లేస్ తగినంత. తయారీ : ∙4 గాజులను సమానంగా పట్టుకోవాలి. ∙లెదర్ లేస్‌ని చిత్రంలో చూపిన విధంగా ఒక గాజు కిందనుంచి, మరో గాజు మీద నుంచి తీసుకురావాలి. ∙అల్లిక అంతా పూర్తి అయ్యాక చివర్లో మిగిలిన లెదర్‌ని కత్తింరించేయాలి. ∙చివరలను గాజులకు సెట్ చేసి, క్రింప్స్ను పెట్టి, పట్టుకారతో దగ్గరగాకు ఒత్తాలి. మెడ్రన్ డ్రెస్ మీదకు ధరించడానికి బ్రాస్లెట్ రెడీ. -
ఐఎస్ ఐఎస్ డబ్బును ధ్వంసం చేసిన అమెరికా దళాలు
ఉగ్రవాదాన్ని అణచి వేసేందుకు ఆమెరికా నిర్విరామంగా కృషి చేస్తోంది. ఐఎస్ ఐఎస్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా ఇరాక్ సెంట్రల్ మోసుల్ లోని ఓ భవనంపై రక్షణ దళాలు బాంబుల వర్షం కురిపించాయి. ఐఎస్ ఐఎస్ భవిష్యత్ కార్యాచరణకోసం డబ్బు దాచిపెట్టిన భవనాన్ని యూఎస్ దళాలు ధ్వంసం చేశాయి. అయితే భవనంలో ఎంత మొత్తం డబ్బు, ఏ దేశానికి చెందిన కరెన్సీ ఉంది అన్న విషయాలను మాత్రం రక్షణ అధికారులు వెల్లడించలేదు. కాగా ఆ డబ్బు మిలియన్లలోనే ఉందని వివరాలను బట్టి తెలుస్తోంది. రెండువేల పౌండ్ల బరువున్న రెండు బాంబులు... డబ్బు దాచిపెట్టిన భవనాన్నిక్షణాల్లో ధ్వంసం చేశాయి. ఐఎస్ ఐఎస్ సామర్థ్యాన్ని తగ్గించేందుకు వారి ఆర్థిక స్థావరాలను నాశనం చేయడమే అమెరికా అక్ష్యంగా చేసుకుందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్నాళ్లక్రితం యూఎస్ యుద్ధ విమానాలు ఐఎస్ ఐఎస్ చమురు ట్రక్కులను కూడ టార్గెట్ చేశాయని అంటున్నారు. అయితే ప్రస్తుత మోసుల్ దాడుల్లో సాధారణ ప్రజలు కూడా మరణించే ప్రమాదం ఉండటంతో ఈ విధ్వంసాన్ని అమెరికా సున్నితంగా భావించింది. అందుకే చాలాకాలంపాటు డబ్బు సేకరణ, పంపిణీ స్థావరంపై డ్రోన్లు, విమానాలతో నిఘా పెట్టింది. చివరికి అక్కడ జన సంచారం లేని సమయాన్ని కనిపెట్టి దాడులు నిర్వహించింది. అయితే ఆ స్థావరాన్ని అమెరికా ఎలా కనిపెట్టింది అన్న విషయం బహిర్గతం కాలేదు. బాంబు దాడుల ప్రాంతానికి సమీపంలో సాధారణ పౌరులు పగటి సమయంలో మాత్రమే ఉండటం, రాత్రిళ్ళు ఐఎస్ ఐఎస్ సిబ్బంది పనిచేస్తుండటం గమనించిన నిఘా అధికారులు ఆదివారం తెల్లవారుజామున దాడులు జరిపేందుకు నిర్ణయించారు. అయితే తమ లక్ష్యాన్ని సాధించేందుకు సుమారు 50మంది వరకు సాధారణ పౌరులు బలికాక తప్పదని తాము యోచించినట్లు కమాండర్లు ఒప్పుకుంటున్నారు. కాగా దాడిలో ఐదు నుంచి ఏడుగురు మాత్రమే మరణించినట్లు చెప్తున్నారు. ఇదిలా ఉంటే అమెరికా తన లక్ష్యాలను అమలుపరిచే నేపథ్యంలో మరింత మంది సాధారణ ప్రజలు బలయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.