జేఎస్డబ్ల్యూ స్టీల్ ఖాతాలో జేఎస్డబ్ల్యూ ప్రక్సైర్ ఆక్సిజన్ | JSW Steel to acquire JSW Praxair Oxygen for Rs 240 cr | Sakshi
Sakshi News home page

జేఎస్డబ్ల్యూ స్టీల్ ఖాతాలో జేఎస్డబ్ల్యూ ప్రక్సైర్ ఆక్సిజన్

Published Wed, Aug 17 2016 12:42 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

జేఎస్డబ్ల్యూ స్టీల్ ఖాతాలో జేఎస్డబ్ల్యూ ప్రక్సైర్ ఆక్సిజన్

జేఎస్డబ్ల్యూ స్టీల్ ఖాతాలో జేఎస్డబ్ల్యూ ప్రక్సైర్ ఆక్సిజన్

సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ తాజాగా జేఎస్‌డబ్ల్యూ ప్రక్సైర్‌లో అధిక వాటాను కైవసం చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

న్యూఢిల్లీ: సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ తాజాగా జేఎస్‌డబ్ల్యూ ప్రక్సైర్‌లో అధిక వాటాను కైవసం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. దాదాపు రూ.240 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ ప్రక్సైర్ ఆక్సిజన్‌లో 74% వాటాను కొనుగోలు చేస్తున్నట్లు జేఎస్‌డబ్ల్యూ స్టీల్ బీఎస్‌ఈకి నివేదించింది. జేఎస్‌డబ్ల్యూ ప్రక్సైర్ ఆక్సిజన్ కంపెనీ ప్రధానంగా ఇండస్ట్రియల్ వాయువులైన ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్ వంటి వాటిని ఉత్పత్తి చేస్తుంది. దీనికి కర్ణాటకలోని బళ్లారిలో రెండు ఎయిర్ సెపరేషన్ ప్లాంట్లు ఉన్నాయి. ప్రస్తుతం జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ప్రక్సైర్ ఆక్సిజన్‌లో 26% ఈక్విటీ వాటా ఉంది. వాటాల కొనుగోలు తర్వాత జేఎస్‌డబ్ల్యూ ప్రక్సైర్ ఆక్సిజన్ కంపెనీ జేఎస్‌డ బ్ల్యూ స్టీల్‌కు పూర్తి అనుబంధ కంపెనీగా మారుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement