సాక్షి,ముంబై: ఐటీ సేవల దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కౌంటర్ భారీ లాభాలతో ట్రేడ్‌అవుతోంది. ఈ నెల15న సొంత షేర్ల కొనుగోలు(బైబ్యాక్) ప్రతిపాదనను పరిశీలించనుందన్నవార్తలతో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. భారీ కొనుగోళ్లతో టీసీఎస్ షేరు దాదాపు 3 శాతం పుంజుకుంది.
బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 15న సమావేశం నిర్వహిస్తున్నట్లు టీసీఎస్ మంగళవారం తెలియజేసింది. కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వలలో కొంతమేర వాటాదారులకు ప్రయోజనం చేకూర్చే షేర్ల బైబ్యాక్‌కు వెచ్చించాలని కంపెనీ ప్రణాళికలు వేసింది. కాగా గత ఏడాది రూ .16,000 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ను నిర్వహించింది టీసీఎస్. మొత్తం ఈక్విటీలో 3 శాతం లేదా 5.61 కోట్ల షేర్లను ఈక్విటీ వాటాకి 2,850 రూపాయల ధర వద్ద కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment