అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటల చొప్పున పనిచేయాల్సిన అవసరం ఉందన్న ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణమూర్తి వ్యాఖ్యలపై కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. సంస్థలు ఎట్టిపరిస్థితుల్లో అదనపు గంటలు పనిచేసేలా ఉద్యోగుల్ని ఒత్తిడికి గురి చేయొద్దన్నారు.
ఈ సందర్భంగా ఐటీ రంగంలో నారాయణమూర్తి కృషిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఒక వ్యక్తి ఎన్ని గంటలు పనిచేశారో నిర్దేశించే బదులు, కంపెనీలు తమ వృత్తిపరమైన నియామకాలలో ఎంత ఉత్పాదకంగా ఉన్నాయో చూడాలని అన్నారు.
అయితే, నారాయణమూర్తి అభిప్రాయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. తాజాగా, ఖర్గే సైతం స్పందించారు. ‘ఈ అంశంపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఐటీ మంత్రిగా నేను ప్రొడక్టివిటీపై దృష్టి పెడతాను. మీరు ఏడు గంటలు ప్రొడక్టీవ్‌గా పని చేస్తే నేను పట్టించుకోను.ఉత్పాదకత పెరిగేలా సంస్థకు పనికొస్తుందనుకుంటే ఎక్కువ గంటలు పని చేయొచ్చు. అందులో తప్పేం లేదు. కానీ ఇలా (70 గంటలు) చేయమని మనం ఎవరినీ బలవంతం చేయలేం. స్వీటు షాపుల్ని నిర్వహిచడం లేదు కదా’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment