
నడచి వచ్చే స్లిప్పర్స్
సాక్షి, న్యూఢిల్లీ : సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వస్తున్న విషయం తెల్సిందే. వాటికంటే ముందుగా సెల్ఫ్ డ్రైవింగ్ పాద రక్షకులు వచ్చినట్లున్నాయి. జపాన్‌లోని టోక్యో నగరానికి వెళితే ‘ప్రో పైలట్ పార్క్ ర్యోకన్’ అనే క్లాసికల్ హోటల్ కనిపిస్తోంది. అందులోకి వెల్లిన వినియోగదారులకు పాదరక్షలు వాటింతట అవే నడిచి వచ్చి స్వాగతం చెబుతాయి. వారు ఆ హోటల్లో ఎక్కడికెళ్లాలంటే అక్కడికి తీసుకెళతాయి. వారు ఆ పాదరక్షలను ఎక్కడ వదిలేసినా మళ్లీ గుమ్మం వద్దకు వచ్చి ఒకదాని పక్కన ఒకటి వరుసలో ఒదిగిపోతాయి.
పాతాళభైరవి తెలుగు సినిమాలోలాగా ఆ పాదరక్షలు మహత్తు కలిగిన మాయా పాదరక్షలేమీ కావు. సాధారణ పాదరక్షలే. అయితే, వాటికి అడుగున రెండు చిన్నటి చక్రాలు, సెన్సర్లు, ఓ మోటారు ఉంటుంది. అందుకనే అవి వాటంతట అవి నడుచుకుంటూ లేదా నడుపుకుంటూ పోగలవు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్నే ఈ పాదరక్షల్లో ఉపయోగించారు. ఆ హోటల్లో ఒక్క పాదరక్షలే కాదు. వినియోగదారులు కూర్చునే కుషన్లు, కుర్చీలు, టెలివిజన్ రిమోట్లు అన్నీ వాటంతట అవే నడిచి వస్తాయి. వెళతాయి. ప్రముఖ కార్ల కంపెనీ ‘నిస్సాన్’ తన కంపెనీ కార్ల ప్రచారం కోసం టోక్యో హోటల్లో వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇలా ఉపయోగించింది.
Comments
Please login to add a commentAdd a comment