
యోకోహామా : జపనీస్ కారు దిగ్గజం నిస్సాన్ సీఈవో అనూహ్యం నిర్ణయం తీసుకున్నారు. వాహనాలను సరిగ్గా తనిఖీ చేయకుండా డీలర్లకు సరఫరా చేసిన కుంభకోణానికి బాధ్యతగా.. వచ్చే మార్చి వరకు తన వేతనంలో సగం వెనక్కి ఇచ్చేయనున్నట్టు పేర్కొన్నారు. అక్టోబర్‌లో ఈ మోసాన్ని ఒప్పుకున్న నిస్సాన్ 1.2 మిలియన్ వాహనాల్లో కొన్నింటిని రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. తమ స్టాఫ్ సరియైన అధికారం లేకుండా కొన్ని వాహనాలకు తుది తనిఖీలు చేపట్టారు. అనంతరం వాటిని డీలర్స్‌కు రవాణా చేశారని నిస్సాన్ పేర్కొంది. ''ఈ తప్పిదంలో భాగంగా అక్టోబర్ నుంచి నేను వేతనంలో సగ భాగాన్ని వెనక్కి ఇచ్చేస్తాను'' అని నిస్సాన్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హిరోటో సైకవా తెలిపారు.
ఈ ఏడాది ప్రారంభంలోనే సైకవా కంపెనీ సీఈవోగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తన వేతనాన్ని స్వచ్ఛదంగానే వెనక్కి ఇచ్చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇతర ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఇదే మాదిరి చేస్తారని తాను అర్థం చేసుకుంటున్నానని చెప్పారు. అయితే ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలు ఏ మేర ఉన్నాయో ఇంకా స్పష్టంగా తెలియదు. ఈ స్కాండల్ విచారణ ఫలితాలను నిస్సాన్ రహదారి మంత్రిత్వ శాఖకు కూడా సమర్పించనుంది. ఒక ప్లాట్‌లో 1979 నుంచి ఇలా తప్పుడు తనిఖీలు చేపడుతున్నారని రిపోర్టుల ద్వారా తెలిసింది. కాగ, ఉద్యోగులకు ఈ తనిఖీకి సంబంధించిన ప్రాముఖ్యత తెలియదని విచారణ వెల్లడించింది. దీన్ని నిర్మూలించడానికి తుది తనిఖీలు చేపట్టేందుకు అర్హత ఉన్న స్టాఫ్‌నే ప్లాట్స్‌లోకి ప్రవేశించడానికి ఓ స్పెషల్ సెక్యురిటీ గేట్‌ను ఇన్‌స్టాల్ చేయాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment