సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వస్తున్న విషయం తెల్సిందే. వాటికంటే ముందుగా సెల్ఫ్ డ్రైవింగ్ పాద రక్షకులు వచ్చినట్లున్నాయి. జపాన్‌లోని టోక్యో నగరానికి వెళితే ‘ప్రో పైలట్ పార్క్ ర్యోకన్’ అనే క్లాసికల్ హోటల్ కనిపిస్తోంది. అందులోకి వెల్లిన వినియోగదారులకు పాదరక్షలు వాటింతట అవే నడిచి వచ్చి స్వాగతం చెబుతాయి. వారు ఆ హోటల్లో ఎక్కడికెళ్లాలంటే అక్కడికి తీసుకెళతాయి. వారు ఆ పాదరక్షలను ఎక్కడ వదిలేసినా మళ్లీ గుమ్మం వద్దకు వచ్చి ఒకదాని పక్కన ఒకటి వరుసలో ఒదిగిపోతాయి.