
తిరువనంతపురం: జపాన్‌కు చెందిన వాహన తయారీ కంపెనీ ‘నిస్సాన్ మోటార్ కార్పొరేషన్’ తాజాగా డిజిటల్ కార్యకలాపాల కోసం తన తొలి గ్లోబల్ సెంటర్‌ను భారత్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని కేరళలోని తిరువనంతపురంలో నిర్మిస్తామని తెలిపింది. ఇందుకోసం కేరళ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నామని తెలియజేసింది.
కేరళ ముఖ్యమంత్రి పి. విజయన్ సమక్షంలో నిస్సాన్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ టోనీ థామస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్ ఆంటోనీ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ‘‘ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనుకున్న సాఫ్ట్‌వేర్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్లలో ఇది మొదటిది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దాదాపు 500 మందిని నియమించుకుంటాం.
యూజర్ ఎక్స్‌పీరియన్స్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, సెక్యూరిటీ పెంపు సహా కనెక్టెడ్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ నేపథ్యంలో కనెక్టివిటీ వంటి కొత్త డిజిటల్ సామర్థ్యాల నిర్మాణంపై కేరళ సెంటర్ దృష్టి కేంద్రీకరిస్తుంది. దీని కోసం బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. టెక్నాలజీ, టాలెంట్ కోణాల్లో చూస్తే భారత్ మాకు గొప్ప మార్కెట్ అవుతుంది’ అని టోనీ థామస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment