2023 ఆటో ఎక్స్‌పోలో ఎంతోమంది వాహన ప్రేమికుల మనసు దోచిన 5-డోర్స్ 'మారుతి సుజుకి జిమ్నీ' ప్రారంభం నుంచి భారత్‌లో మంచి బుకింగ్స్ పొందుతోంది. ఇప్పటికి ఈ ఆఫ్-రోడర్ 16,500 కంటే ఎక్కువ బుకింగ్స్ కైవసం చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే ప్రతి రోజూ 700 మందికంటే ఎక్కువ కస్టమర్లు ఈ ఎస్‌యువీ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
మహీంద్రా తన 5 డోర్స్ జిమ్ని ఆవిష్కరించిన రోజు నుంచి రూ. 11,000 మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభమైన రెండు రోజులకే 3,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందిన జిమ్ని బుకింగ్ ప్రైస్ రూ. 25,000 కు పెరిగింది. బుకింగ్ ప్రైస్ పెరిగినప్పటికీ బుక్ చేసుకునే వారి సంఖ్య ఏ మాత్రం తగ్గకపోవడం గమనార్హం.
మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్‌లోని K15B పెట్రోల్ ఇంజన్ 104 బిహెచ్‌పి పవర్, 135 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. సుజుకి యొక్క లెజెండరీ ఆల్ గ్రిప్ ప్రో ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.
కొత్త మారుతి జిమ్నీ కైనెటిక్ ఎల్లో, సిజ్లింగ్ రెడ్, గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, బ్లూయిష్ బ్లాక్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ కలర్ ఆప్సన్లలో లభిస్తుంది. ఈ ఎస్‌యువీ లాడెర్ ఫ్రేమ్ ఛాసిస్ కలిగి ఉండటం వల్ల నాలుగు మూలల్లో కాయిల్ స్ప్రింగ్‌లతో 3-లింక్ రిజిడ్ యాక్సిల్ టైప్ సస్పెన్షన్ కలిగి ఉంది.
ఆఫ్ రోడర్ బాద్షా జిమ్నీ డిజైన్, ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేసే 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంటుంది. సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి మరిన్ని ఫీచర్స్ పొందుతుంది
Comments
Please login to add a commentAdd a comment