అద్దెకు నిస్సాన్, డాట్సన్‌ కార్లు  | Nissan Offers Showroom Cars On Rent Basis | Sakshi
Sakshi News home page

అద్దెకు నిస్సాన్, డాట్సన్‌ కార్లు 

Published Tue, Jun 8 2021 8:09 AM | Last Updated on Tue, Jun 8 2021 8:13 AM

Nissan Offers Showroom Cars On Rent Basis - Sakshi

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ దిగ్గజం నిస్సాన్‌ మోటార్‌ ఇండియా తాజాగా తమ నిస్సాన్, డాట్సన్‌ బ్రాండ్ల కార్ల సబ్‌స్క్రిప్షన్‌ పథకం ప్రారంభించింది. తొలుత హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ నగరాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. తర్వాత దశలో బెంగళూరు, పూణే, ముంబై నగరాల్లో అందుబాటులోకి వస్తాయని కంపెనీ ఎండీ రాకేశ్‌ శ్రీవాస్తవ తెలిపారు. సబ్ర్‌స్కిప్షన్‌ ప్లాన్‌ ప్రకారం కారును కొనుగోలు చేయనక్కర్లేకుండా నిర్దిష్ట కాల వ్యవధికి నిర్ణీత నెలవారీ ఫీజు కట్టి ఉపయోగించుకోవచ్చని తెలిపారు. నామమాత్రపు రిఫండబుల్‌ సెక్యురిటీ డిపాజిట్‌ కట్టి కస్టమర్లు.. సరికొత్త కారును ఎంచుకోవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్లపైనే ఆఫర్‌
నిస్సాన్‌ మాగ్నైట్, కిక్స్‌ ఎస్‌యూవీలకు నెలవారీ సబ్ర్‌స్కిప్షన్‌ ఫీజు రూ. 17,999 నుంచి రూ. 30,499 దాకా ఉంటుంది. డాట్సన్‌ రెడీ–గో హ్యాచ్‌బ్యాక్‌కు సంబంధించి ఇది రూ. 8,999 నుంచి రూ. 10,999 దాకా ఉంటుంది. సబ్‌స్క్రిప్షన్‌ సరీ్వసుల సంస్థ ఒరిక్స్‌ ఇండియాతో కలిసి ప్లాన్లు అందిస్తున్నట్లు శ్రీవాస్తవ వివరించారు. డౌన్‌ పేమెంట్, సర్వీస్‌ వ్యయా లు, బీమా వ్యయాల బాదరబందీ ఉండదని తెలిపారు. సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లోనే వాహన బీమా, రిజిస్ట్రేషన్‌ ఫీజు, రోడ్‌ ట్యాక్స్, ఆర్‌టీవో వ్యయాలు, మరమ్మతులు సహా నిర్వహణ వ్య యాలు, టైర్లు.. బ్యాటరీలను మార్చడం వంటివన్నీ భాగంగా ఉంటాయని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement