rent cars
-
అద్దెకు నిస్సాన్, డాట్సన్ కార్లు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటార్ ఇండియా తాజాగా తమ నిస్సాన్, డాట్సన్ బ్రాండ్ల కార్ల సబ్స్క్రిప్షన్ పథకం ప్రారంభించింది. తొలుత హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ నగరాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. తర్వాత దశలో బెంగళూరు, పూణే, ముంబై నగరాల్లో అందుబాటులోకి వస్తాయని కంపెనీ ఎండీ రాకేశ్ శ్రీవాస్తవ తెలిపారు. సబ్ర్స్కిప్షన్ ప్లాన్ ప్రకారం కారును కొనుగోలు చేయనక్కర్లేకుండా నిర్దిష్ట కాల వ్యవధికి నిర్ణీత నెలవారీ ఫీజు కట్టి ఉపయోగించుకోవచ్చని తెలిపారు. నామమాత్రపు రిఫండబుల్ సెక్యురిటీ డిపాజిట్ కట్టి కస్టమర్లు.. సరికొత్త కారును ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్లపైనే ఆఫర్ నిస్సాన్ మాగ్నైట్, కిక్స్ ఎస్‌యూవీలకు నెలవారీ సబ్ర్స్కిప్షన్ ఫీజు రూ. 17,999 నుంచి రూ. 30,499 దాకా ఉంటుంది. డాట్సన్ రెడీ–గో హ్యాచ్‌బ్యాక్‌కు సంబంధించి ఇది రూ. 8,999 నుంచి రూ. 10,999 దాకా ఉంటుంది. సబ్స్క్రిప్షన్ సరీ్వసుల సంస్థ ఒరిక్స్ ఇండియాతో కలిసి ప్లాన్లు అందిస్తున్నట్లు శ్రీవాస్తవ వివరించారు. డౌన్ పేమెంట్, సర్వీస్ వ్యయా లు, బీమా వ్యయాల బాదరబందీ ఉండదని తెలిపారు. సబ్స్క్రిప్షన్ ప్లాన్‌లోనే వాహన బీమా, రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్, ఆర్టీవో వ్యయాలు, మరమ్మతులు సహా నిర్వహణ వ్య యాలు, టైర్లు.. బ్యాటరీలను మార్చడం వంటివన్నీ భాగంగా ఉంటాయని పేర్కొన్నారు. -
ఇదీ నిజామాబాద్‌లో అధి‘కార్ల’ దందా
జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌కు గతంలో అద్దె కారు ఉండేది. అయితే, గతంలో పని చేసిన ఓ అధికారిణి అద్దె కారును పక్కన పెట్టి.. తన సొంత వాహనాన్ని ‘అద్దె’కు వినియోగించుకున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి తెల్ల నెంబరు ప్లేటు గల వాహనాన్ని కొన్ని నెలల పాటు నడిపించి నెలనెలా అద్దె డబ్బులను పర్సులో వేసుకున్నారు. సాక్షి, ఇందూరు(నిజామాబాద్): జిల్లాలో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. అద్దె వాహనాల పేరుతో వేల రూపాయలు వెనుకేసుకుంటున్నారు. సొంత వాహనాలనే వినియోగిస్తూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. చాలా ప్రభుత్వ శాఖల్లో పని చేసే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఓనర్ కమ్ డ్రైవర్ పథకానికి అధికారులే తూట్లు పొడుస్తున్నారు. దీంతో నిరుద్యోగులకు ఉపాధి దొరక్కుండా పోతోంది. ప్రభుత్వ శాఖ ల్లో అధి‘కార్ల’ దందా కొనసాగుతున్నా అడిగే వారు లేరు. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. సర్కారు కార్యాలయాల్లో సంబంధిత శాఖకు సొంత కార్లు లేకపోతే అధికారుల పర్యటనలకు అద్దెకు తీసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అద్దె వాహనం తీసుకోవాలంటే చాలా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఓనర్ కమ్ డ్రైవర్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో సీనియారిటీ కలిగిన వారికి అవకాశం కల్పించాలి. పసుపు రంగు (ట్యాక్సీ) నెంబరు ప్లేట్ కలిగి ఉండడంతో పాటు వాహనం పూర్తి కండిషన్‌తో ఉండాలి. అగ్రిమెంట్ సమయంలో ఆయా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. నెలకు 2,500 కిలో మీటర్లు తిరిగితే ఇంధనం (పెట్రోల్/డీజిల్), కారు అద్దె, డ్రైవర్ బత్తా అన్నీ కలిపి గతంలో రూ.24 వేలు ఇచ్చే వారు. అయితే, ప్రభుత్వం దీనిని రూ.33 వేలకు పెంచింది. దీంతో అధికారుల కన్ను ‘అద్దె’పై పడింది. తెల్ల నెంబరు ప్లేటు ఉన్న తమ సొంత వాహనాలను అద్దెకు పెట్టి ‘ఆన్ గోవ్ట్ డ్యూటీ’ అని రాయించుకుని మరీ యథేచ్ఛగా తిప్పుతున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు కలిపి సుమారు 40 మంది అధికారులు తమ సొంత వాహనాలను వినియోగిస్తూ నెలకు రూ.13 లక్షల వరకూ ‘అద్దె’ వసూలు చేస్తున్నారు! తిరగకున్నా.. సొంత వాహనం లేదా బినామీ పేర్లతో బంధువుల వాహనాలను ప్రభుత్వ శాఖల్లో అద్దెకు వినియోగిస్తున్న అధికారులు.. ఇతర వాహనాల విషయంలో మాత్రం నిబంధనల పేరుతో కొర్రీలు పెడుతున్నారు. నిరుద్యోగులు తమ వాహనాన్ని అద్దెకు పెడితే నిబంధనల పేరుతో మెలికలు పెడుతూ సతాయిస్తున్నారు. బిల్లులు ఆలస్యంగా ఇస్తున్నారు. అయితే, వేతనానికి కారు అద్దె తోడవుతుందనే ఆశతో అధికారులు సొంత వాహనాలు, బంధువుల పేరిట కలిగినవి ఉపయోగిస్తున్నారు. నెలకు 2,500 కిలో మీటర్లు తిరగకున్నా, తిరిగినట్లు రీడింగ్ చూపి నెలనెలా అద్దెను కాజేస్తున్నారు. ⇔ పై చిత్రంలో కనిపిస్తున్న స్విఫ్ట్ కారు జిల్లా ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖలో అద్దెకు నడుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అద్దె వాహనం జిల్లా/రాష్ట్ర పరిధిలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అలాగే, తెల్ల నెంబరు ప్లేటు కాకుండా పసుపు రంగు (ట్యాక్సీ) ప్లేటు ఉండాలి. కానీ ఈ నిబంధనలకు విరుద్ధంగా వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయిన తెల్ల నెంబరు ప్లేటుతో ఏడు నెలలుగా ఆ శాఖ అధికారులు ఈ వాహనాన్ని వినియోగిస్తున్నారు. ఢిల్లీ నెంబరు ప్లేటు ఉండడంతో అద్దె బిల్లులు చేయడానికి వీలు కావడం లేదు. అయితే, పాత కారు పేరిట బిల్లులు కూడా లేపేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ‘కామారెడ్డి’లో కూడా.. అధికారులు తమ సొంత వాహనాలను వినియోగిస్తున్నారని తెలుసుకున్న కామారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు నిబంధనలు కఠినతరం చేశారు. సొంత వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో వినియోగించవద్దని గత కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఓనర్ కమ్ డ్రైవర్ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, అందుకు ప్రభుత్వ శాఖల్లో ట్యాక్సీ ప్లేటు గల వాహనాలను వినియోగించాలని సూచించారు. కానీ చాలా మంది అధికారులు సొంత వాహనాలే వినియోగిస్తున్నారు. -
ఘరానా మోసగాడి అరెస్టు
సాక్షి, పశ్చిమ గోదావరి: అద్దె వాహానాలను విక్రయిస్తూ ఘరానా మోసాలకు పాల్పడిన మెడపాటి మురళీ అనే వ్యక్తిని పెనుమంట్ర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులు మీడియా ముందు హజరుపరిచారు. నిందితుడు అద్దె పేరుతో వాహనాలు తీసుకుని వాటిని విక్రయించినట్లు చెప్పారు. ఇవాళ నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి కోటి రూపాయల విలువ చేసే 13 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు నిందితుడు 13 కార్లను అద్దెకు తీసుకుని వాటిని అక్రమంగా విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపామన్నారు. ఈ క్రమంలో నిందితుడు మొరళీని ఇవాళ అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈజీ మని జల్సాలకు అలవాటు పడిన నిందితుడు ఈ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
హడలెత్తిస్తున్న మైనర్లు
సాక్షి, సిటీబ్యూరో: అది అద్దె కారు.. వారంతా మైనర్లు. పైగా రాత్రి పదకొండున్నర గంటల సమయం. తమకు ఇక ఎదురే లేదనుకున్నారు. రోడ్డుపై అతివేగంతో దూసకుపోయారు. ఓ బైక్‌ను ఢీకొట్టారు. ఇద్దరి మృతికి కారణమయ్యారు. ఇటీవల సుచిత్ర వద్ద చోటుచేసుకున్న ఉదంతం ఇది. బైక్‌పై వెళ్తున్న ఐదేళ్ల అయాన్, చిన్నారి మేనత్త ప్రియదర్శిని అక్కడిక్కడే మృతిచెందారు. బైక్ నడిపిన సునీల్‌రాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికంగా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలచి వేసిన సంఘటన ఇది. మరో సంఘటనలో నగర శివార్లలోని ఓ కళాశాలలో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు డ్రైవేజ్ ఇండియా ట్రావెల్స్ నుంచి బైక్‌ను అద్దెకు తీసుకొని అతివేగంతో దూసుకుపోయారు. ఈ క్రమంలో బండి అదుపు తప్పింది. ముగ్గురు కింద పడిపోయారు. కానీ బైక్‌ను నడుపుతున్న రణధీర్‌రెడ్డి తలకు హెల్మెట్ లేకపోవడం, అదే సమయంలో బస్సు చక్రాలు తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఇలా అడ్డూఅదుపు లేకుండా డ్రైవింగ్ చేస్తున్న మైనర్లు హడలెత్తిస్తున్నారు. డ్రైవింగ్‌పై సరైన అవగాహన, నైపుణ్యం లేకపోవడం, ట్రాఫిక్ నిబంధనలపై కనీస పరిజ్ఞానం లేకపోవడంతో తరచూ ప్రమాదాలకు పాల్పడుతున్నారు. అపరిమితమైన వేగంతో దూసుకెళ్తూ చివరకు వాహనాన్ని అదుపు చేయలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారుల ప్రాణాలు తీయడమే కాకుండా వారూ మృత్యువాత పడుతున్నారు. ఎక్కడికక్కడ లభిస్తున్న అద్దె వాహనాలు ఒకవైపు, ఎలాంటి పటిష్టమైన తనిఖీ వ్యవస్థ లేకుండా దళారుల సహాయంతో మైనర్లకు లభిస్తున్న డ్రైవింగ్ లైసెన్సులు మరోవైపు నగరంలో తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. లైసెన్సు ఉంటే చాలు... రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనను పరీక్షించే లెర్నింగ్ లైసెన్సు తీసుకున్న నెల రోజుల తరువాత శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు ఇస్తారు. గేర్‌తో కూడిన బైక్‌లు, కార్లు నడిపేందుకు మైనర్లు అనర్హులు. వారు కేవలంగేర్లు లేని వాహనాలు నడపాలి. లైసెన్సు తీసుకునే సమయంలో రవాణా అధికారులు అభ్యర్థుల నివాసాన్ని, వయసును ధ్రువీకరిస్తారు. ఇటీవల కాలంలో డిగ్రీ కూడా పూర్తి చేయని చాలామంది పిల్లలు తేలిగ్గా డ్రైవింగ్ లైసెన్సులు కొట్టేస్తున్నారు. దళారుల సహాయంతో వయసును ఎక్కువ చేసే నకిలీ పుట్టిన తేదీ సర్టిఫికెట్లను సమర్పించి డ్రైవింగ్ లైసెన్సులకు అర్హత సంపాదిస్తున్నారు. నగరంలోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ఈ తరహా దందాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఎక్కడికక్కడ వ్యవస్థీకృతంగా వేళ్లూనుకొనిపోయిన ఏజెంట్లు, దళారులు రవాణాశాఖ పౌరసేవలను తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. దీంతో ఒక్క వయసు నిర్ధారణ పత్రాల్లోనే కాకుండా అడ్రస్ ధ్రువీకరణ, వాహనాల డాక్యుమెంట్లు వంటి అనేక అంశాల్లో నకిలీ రాజ్యమేలుతోంది. గ్రేటర్‌లోని 10 ఆర్టీఏ కేంద్రాల పరిధిలో ప్రతిరోజు సుమారు 1200 నుంచి 1500 లెర్నింగ్ లైసెన్సులు. అంతే సంఖ్యలో శాశ్వత డ్రైవింగ్ లైసెన్సులు అందజేస్తారు. లెర్నింగ్ లైసెన్సుల కోసం నిర్వహించే పరీక్షల్లో గానీ, శాశ్వత లైసెన్సు కోసం డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో జరిపే పరీక్షల్లోనూ ఎలాంటి పర్యవేక్షణ ఉండదు. చాలా వరకు ఏజెంట్ల ప్రమేయంతోనే లైసెన్సులు ఇచ్చేస్తారు. దీంతో మైనర్లను గుర్తించడంలో ఆర్టీఏ అధికారులు విఫలమవుతున్నారు. ఇలా రోజుకు 25శాతం వరకు డ్రైవింగ్ లైసెన్సులు మైనర్ల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఇలా డ్రైవింగ్ లైసెన్సు తీసుకున్న వారు అద్దె వాహనాల్లో దూరిపోయి రోడ్లపై తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. తేలిగ్గా బైక్‌లు, కార్లు... గ్రేటర్లో అద్దె వాహనాల వ్యాపారం జోరుగా సాగుతోంది. అనేక సంస్థలు లగ్జరీ వాహనాలు, స్పోర్ట్స్ బైక్స్ నుంచి సాధారణ వాహనాల వరకు, హోండా యాక్టివా వంటి స్కూటర్ల వరకు అద్దెకి ఇస్తున్నాయి. నగరంలో ఇలాంటి ట్రావెల్స్ సంస్థలు చాలాచోట్ల అందుబాటులోకి వచ్చాయి. రవాణాశాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 7,190 బైక్‌లు, 69,660 కార్లు అద్దె ప్రాతిపదికన లభిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వీటి సంఖ్య 1.12 లక్షలకు పైగా ఉంది. ట్రావెల్స్ సంస్థలే ఈ తరహా సెల్ఫ్ డ్రైవింగ్‌కు వాహనాలు అద్దెకు ఇస్తున్నాయి. వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సును మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. వాహనాలు అద్దెకు ఇచ్చే సమయంలో వారి నైపుణ్యాన్ని గుర్తించడం లేదు. హోండా యాక్టివా వంటి వాహనాలను కిలోమీటర్‌కు రూ.20 చొప్పున, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లను కిలోమీటర్‌కు రూ.48 నుంచి రూ.50 చొప్పున ట్రావెల్స్ సంస్థలు అద్దెకు ఇస్తున్నాయి. పైగా ఒక రోజుకు, వారం రోజులకు, 30 రోజుల గడువుకు వాహనాలు అద్దెకు లభిస్తున్నాయి. కొన్ని సంస్థలు హోండా యాక్టివాకు రోజుకు రూ.288 నుంచి రూ.300 చొప్పున, నెలకు రూ.4,538 చొప్పున అద్దె విధిస్తున్నాయి. కేటీఎం డ్యూక్ రోజుకు రూ.1,299 వరకు ఉంది. నెల రోజులకు అయితే రూ.14,000 వరకు అద్దె ఉంటుంది. ఇక జూమ్ క్యాబ్స్ వంటి సంస్థలు మారుతీ స్విఫ్ట్‌ను 150 కిలోమీటర్లకు రూ.3,600 వరకు, 300 కిలోమీటర్లయితే రూ.5,000 వరకు అద్దె విధిస్తున్నాయి. వీకెండ్స్‌లో సిటీకి దూరంగా వెళ్లి పార్టీలు చేసుకోవాలనుకొనే కుర్రకారుకు, లాంగ్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలనుకొనే వాళ్లకు ఈ అద్దెలు పెద్దగా భారం కాకపోవడం గమనార్హం. పైగా తల్లిదండ్రులకు తెలియకుం డా ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ చేసేందుకు అవకా శం లభిస్తుంది. వారి పర్యవేక్షణ, నిఘాకు దూరంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేయవచ్చు. యువత అభిరుచికి అనుగుణం గానే పలు సంస్థలు అద్దెలపై రాయితీలు ప్రక టిస్తున్నాయి. ఆన్లైన్లో తమ వద్ద లభించే వాహనాల సమాచాన్ని అందుబాటులో ఉం చుతున్నాయి. మొబైల్ యాప్‌ల ద్వారా కూడా రెంటల్ సేవలు అందజేస్తున్నాయి. రెంటల్ వాహనాల్లో స్పీడ్‌తో దూసుకెళ్తున్న మైనర్లు చివరకు ప్రమాదాలకు కారణమవుతున్నారు. -
అద్దెకు ఇస్తే అమ్మేశాడు
బంజారాహిల్స్: బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు పత్రాలు సృష్టించి ఓఎల్ఎక్స్లో కారును అమ్మకానికి పెట్టి మోసగించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎన్బీటీ నగర్‌కు చెందిన నుకుం శ్రీలత అనే మహిళ ఓఎల్ఎక్స్లో హుందాయ్ ఐ–20(టీఎస్ 08 ఎఫ్‌టి 6402) కారు అమ్మకానికి ఉన్నట్లు తెలుసుకుని అందులో ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా జూలై 20న కేపీహెచ్‌బీకి చెందిన పొట్లూరి శ్రీబాల వంశీకృష్ణను సంప్రదించింది. తన అన్న సురేష్‌జాదవ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని అతడికి చెందిన కారును విక్రయిస్తున్నట్లు అతను పత్రాలు చూపడంతో అతడి మాటలు నమ్మిన శ్రీలత రూ. 4.75 లక్షలకు కారును కొనుగోలు చేసింది. అయితే సదరు కారుపై బేగంపేట ఎస్.బ్యాంకులో లోన్ ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లి విచారిచగా సదరు సురేష్ జాదవ్ బతికే ఉన్నట్లు బ్యాంకు అధికారి తెలిపాడు. దీంతో సురేష్ జాదవ్‌కు ఫోన్ చేయగా కారును బాల వంశీకృష్ణ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చినట్లు తెలిపాడు. బతికున్న వ్యక్తిని చనిపోయినట్లుగా చిత్రీకరించి ఓఎల్ఎక్స్లో అద్దెకు తీసుకున్న కారును విక్రయానికి పెట్టి తమను మోసం చేశాడంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కరెంటోళ్ల కక్కుర్తి
సాక్షి, సిటీబ్యూరో: నెలకు లక్షన్నరకుపైగా వేతనం పొందే ఇంజనీర్లు సొంతంగా ఓ కారు కొనుక్కోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ అదే అధికారి సొంతకారులో ఆఫీసుకు వస్తూ ఏజెన్సీ నుంచి అద్దెకు తీసుకున్న టాక్సీప్లేట్‌లో వచ్చినట్లు తప్పుడు బిల్లులు చూపించి డిస్కం ఖజానాకు గండికొడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నత హోదాలో ఉన్న అధికారులకు సీఎండీ, సహా డైరెక్టర్లకు ఇన్నోవా వాహనాలు సమకూర్చింది. చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం), సూపరింటిండెంట్ ఇంజనీర్(ఎస్ఈ), డివిజనల్ ఇంజనీర్(డీఈ), ఇతర అధికారులకు ఏజెన్సీల ద్వారా అద్దె వాహనాలను సమకూర్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పలు నిబంధనలు రూపొందించింది. ఏడాదికి ఒక్కో వాహనానికి రూ.3.80లక్షలు చెల్లిస్తుంది. అయితే కొంతమంది ఇంజనీర్లు ఇక్కడే కక్కుర్తిని ప్రదర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉపయోగపడాల్సిన వాహనాలు ఇంజనీర్ల వారంతపు విహారయాత్రలకు, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. అంతేకాదు సంబంధిత అధికారులే స్వయంగా వా హనాలు నడుపుతుండటం వల్ల డ్రైవర్లకు ఉపాధి లభించకుండా పోతోంది. నిరుద్యోగుల పొట్టకొడుతున్నడిస్కం ఇంజనీర్లు: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో పని చేస్తున్న కొంత మంది సీజీఎంలు, ఎస్ఈలు, డీఈలు సొంత వాహనాలను అద్దె వాహనాల జాబితాలో చేర్చి డిస్కం నుంచి బిల్లులు తీసుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యవసర సమయంలో అందరికీ ఉపయోగపడాల్సిన ఈ వాహనాలు ఉన్నతాధికారుల ఇళ్లకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఏఈల అవసరాలు తీర్చలేకపోతున్నాయి. అత్యవసర సమయంలో వారే స్వయంగా ఆటోలను అద్దెకు తీసుకుని ఘటనా స్థలాలకు చేరుకోవాల్సి వస్తుం ది. ఉన్నతాధికారి సొంతవాహనం కావడంతో క్షేత్రస్థాయి పర్యటనల సమయంలో వినియోగానికి కిందిస్థాయి అధికారులు వెనుకాడుతున్నారు. అదే లీజుకు తీసుకున్నదైతే అందరికీ అందుబాటులో ఉండేది. కార్మికుల పొట్టకొడుతున్నారు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఏజెన్సీ నుంచి తీసుకున్న అద్దెకార్లు కాకుండా సొంత వాహనాలను టాక్సీ ప్లేట్‌గా చూపించి డిస్కం నుంచి నెలనెలా అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. పరోక్షంగా నిరుద్యోగుల పొట్టగొడుతూ తమ జేబులు నింపుకుంటున్నారు. ఇంజనీర్లు తాము వాడుతున్న వాహనాలకు టాక్సీప్లేట్ పెట్టకపోవడమే కాకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సిన రవాణా పన్నులు కూడా ఎగవేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటి ఫిర్యాదు కూడా చేశాం. –నాగరాజు, అధ్యక్షుడు,తెలంగాణ కాంట్రాక్ట్‌విద్యుత్ కార్మికుల సంఘం జేఏసీ -
ఎస్ఎస్ఏలో అద్దెకార్ల మాయ!
→ నిబంధనలకు విరుద్ధంగా వైట్ బోర్డ్ వాహనాలు → అయినా పట్టించుకోని ఉన్నతాధికారులు → సొంతకార్లలో అద్దె దర్జా అనంతపురం ఎడ్యుకేషన్ : ఈ ఫొటోలో ఉన్న కారు ఎస్ఎస్ఏ ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్న ఓ డిప్యూటీ ఇంజనీర్ది. ఆయన తన కారునే అద్దె వాహనంగా చూపించి ప్రతి నెలా రూ.24 వేలు తీసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెకు తీసుకునే వాహనం కచ్చితంగా ఎల్లో బోర్డు (ట్యాక్సీప్లేట్) అయి ఉండాలి. కానీ ఈ అధికారి వైట్ బోర్డు (ఓన్ప్లేట్) వాహనంలో దర్జాగా తిరుగుతున్నారు. పదిలో నాలుగు వైట్ బోర్డు వాహనాలు సర్వశిక్ష అభియాన్‌లో మొత్తం పది వాహనాలు ఉన్నాయి. పీఓ, సెక్టోరియల్ ఆఫీసర్లు, డీఈలతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా ఎస్ఎస్ఏ నిధుల నుంచి వాహనం ఏర్పాటు చేశారు. వీటిలో పీఓ, సెక్టోరియల్ ఆఫీసర్లకు మాత్రం ఎల్లో బోర్డు వాహనాలు ఏర్పాటు చేశారు. ఇక డీఈలతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారికి ఏర్పాటు చేసిన కారు కూడా వైట్ బోర్డు కల్గినవే ఉన్నాయిl. వైట్ బోర్డు వాహనాలను అద్దెకు వినియోగించకూడదనే నిబంధన ఈ అధికారులకు అందరికీ తెలిసినా అడిగే వారు లేక నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఇలా ట్యాక్సీ ప్లేట్ స్థానంలో సొంతకార్లు వాడుతున్న వారిలో కొందరు తామే సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకోగా, మరికొందరు తమకు అనుకూలంగా ఉన్నవారి పేరిట వాహనాలు కొనుగోలు చేసి ఏర్పాటు చేసుకున్నారు. కొత్త వాహనాలకు నెలనెలా చెల్లించాల్సిన కొనుగోలు కంతు ఈ అద్దెలో సరి చేస్తున్నారు. కిలోమీటర్లు మించి తిరిగితే ఒట్టు నెలకు రూ. 24 వేలు ప్రభుత్వం వాహనానికి అద్దె చెల్లిస్తుంది. సదరు వాహనం నెలలో 2,500 కిలోమీటర్లు తిరగాలి. అయితే ఎల్లో బోర్డు వాహనాలు మాత్రం కిలోమీటర్లు పూర్తిగా తిరుగుతున్నా...వైట్ బోర్డు వాహనాలు ఆ మేర తిరగడం లేదు. పైగా సొంత కార్లపై ఉన్న మమకారంతో వాటిని ఎక్కువగా తిప్పేందుకు ఇష్టపడడం లేదని ఆశాఖ సిబ్బందే చెబుతున్నారు. ఎల్లో బోర్డు కల్గిన వాహనాలను సెక్టోరియల్ ఆఫీసర్లు అవసరాన్ని బట్టి అందుబాటులో ఉన్న వాహనాలను క్యాంపులకు తీసుకెళ్తుంటారు. అయితే వైట్ బోర్డు కల్గిన వాహనాలు కార్యాలయం వద్ద ఖాళీగా ఉన్నా, వాటిని పంపడం లేదని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. వైట్‌బోర్డు కల్గిన వాహనాలన్నీ అధికారులవే కావడంతో సిబ్బంది వాటిని అడిగే సాహసం కూడా చేయడం లేదు. ప్రభుత్వ ఆదాయానికి గండి ఎల్లో బోర్డు కల్గిన వాహనాలు ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ కచ్చితంగా తీసుకోవాలి. ఇందుకు రూ. 18–23 వేలు దాకా ఖర్చవుతుంది. వైట్‌బోర్డు వాహనాలకు ప్రతి ఏడాది ఇన్సూరెన్స్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా రూ. 6–10 వేలు మాత్రమే. అంటే వైట్‌బోర్డు కల్గిన వాహనాలను వినియోగిస్తూ మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కొడుతున్నారు. కొసమెరుపు ఏమిటంటే... ఎస్ఎస్ఏలో ప్రతినెలా వాహనాలకు సంబంధించినlఅద్దె బిల్లులను పరిశీలించే బాధ్యతను వైట్‌బోర్డు వాహనాన్ని వినియోగిస్తున్న డీఈకే అప్పగించడం.