ఘరానా మోసగాడి అరెస్టు | Police Arrested A Man Who Commits Rent Cars Sold In West Godavari | Sakshi
Sakshi News home page

అద్దె కార్ల విక్రయానికి పాల్పడిన వ్యక్తి అరెస్టు

Published Tue, Sep 8 2020 1:36 PM | Last Updated on Tue, Sep 8 2020 2:26 PM

Police Arrested A Man Who Commits Rent Cars Sold In West Godavari - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: అద్దె వాహానాలను విక్రయిస్తూ ఘరానా మోసాలకు పాల్పడిన మెడపాటి మురళీ అనే వ్యక్తిని పెనుమంట్ర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులు మీడియా ముందు హజరుపరిచారు. నిందితుడు అద్దె పేరుతో వాహనాలు తీసుకుని వాటిని విక్రయించినట్లు చెప్పారు.  ఇవాళ నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి కోటి రూపాయల విలువ చేసే 13 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు నిందితుడు 13 కార్లను అద్దెకు తీసుకుని వాటిని అక్రమంగా విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపామన్నారు. ఈ క్రమంలో నిందితుడు మొరళీని ఇవాళ అరెస్టు చేసినట్లు చెప్పారు.  ఈజీ మని జల్సాలకు అలవాటు పడిన నిందితుడు ఈ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement