Nissan Compact SUV Kicks: అమెరికా కంపెనీలు ఇండియా మార్కెట్ నుంచి వైదొలుగుతుండటంతో ఇతర కార్ల తయారీ కంపెనీలు ఇండియాలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా జపాన్ కార్ మేకర్స్ కంపెనీ నిస్సాన్ సరికొత్త బెనిఫిట్ ఆఫర్స్‌తో ముందుకు వచ్చింది.
కాంపాక్ట్ ఎస్‌యూవీ
స్టో అండ్ స్టడీ అండ్ విన్ ది రేస్ అనే నానుడి నిజం చేస్తోంది నిస్సాన్ ఆటో. అమ్మకాల పరంగా మెరుపులు లేకపోయినా నిస్సాన్ కంపెనీ ఇండియన్ మార్కెట్‌లో నిలదొక్కుకుంటోంది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో ఆకర్షణీయమై మోడళ్లను రిలీజ్ చేస్తోంది. ఆ ఒరవడిలో కాంపాక్ట్ ఎస్‌యూవీ కేటగిరీలో కిక్స్‌ను రిలీజ్ చేసింది. తాజాగా ఈ మోడల్ ప్రమోషన్‌లో భాగంగా పలు బెనిఫిట్ ఆఫర్స్ ప్రకటించింది. సెప్టెంబరు 30 వరకు కొనుగోలు చేసే కార్లపై ఈ బెనిఫిట్ ఆఫర్ వర్తిస్తుంది.
కిక్స్ ఫీచర్స్
నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పెట్రెల్ ఇంజన్‌తో రెండు వెర్షన్లలో లభిస్తోంది. ఇందులో ఒకటి 1.3 లీటర్ టర్బో వేరియంట్ 154 బీహెచ్‌పీతో 254 ఎన్‌ఎమ్ టార్క్‌ని రిలీజ్ చేస్తుంది. రెండో వేరియంట్ అయిన 1.5 లీటర్ వేరియంట్ 105 బీహెచ్‌పీతో 142 ఎన్‌ఎం టార్క్‌ని ఇస్తుంది. ఇక రెండు వేరియంట్లలో 5 స్పీడ్, 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్‌లో లభిస్తున్నాయి. కిక్స్ ధర ప్రస్తుతం ఇండియాలో ప్రారంభం రూ. 9.5 లక్షల నుంచి గరిష్టంగా 14.65 లక్షల రేంజ్లో లభిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, డీలర్లను బట్టి ఆఫర్‌లో కొంత తేడాలు ఉండవచ్చని నిస్సాన్ తెలిపింది.
బెనిఫిట్ ఆఫర్స్ ఇలా
1.3 లీటర్ టర్బో వేరియంట్‌పై
- క్యాష్ బెనిఫిట్ రూ. 15,000
- ఆన్‌లైన్ బుకింగ్ బోనస్ రూ. 5,000
- ఎక్సేంజీ బోనస్ రూ.70,000
- సెలక్ట్ కార్పోరేట్ బెనిఫిట్స్ రూ. 10,000
- స్పెషల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.99 శాతం
1.5 లీటర్ వేరియంట్‌పై
- క్యాష్ బెనిఫిట్ రూ. 10,000
- ఆన్‌లైన్ బుకింగ్ బోనస్ రూ. 5,000
- ఎక్సేంజీ బోనస్ రూ.20,000
- సెలక్ట్ కార్పోరేట్ బెనిఫిట్స్ రూ. 10,000
- స్పెషల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.99 శాతం
Comments
Please login to add a commentAdd a comment