జిల్లావ్యాప్తంగా 614 ఎంపీటీసీలు,33 జెడ్పీటీసీలకు ఎన్నికలు
శివార్లలోని 35 పంచాయతీలపై సస్పెన్స్!
వీటి పరిధిలోని ఎంపీటీసీల ఎన్నికలపై ప్రభుత్వానికి కలెక్టర్ లేఖ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: స్థానిక సంస్థల సమరానికి ముహూర్తం ఖ రారైంది. మండల, జిల్లా ప్రాదేశిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 614 ఎంపీటీసీలు, 33 జెడ్పీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6న పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17న కలెక్టర్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు.
స్వీకరణపర్వం మొదలుకానుంది. కాగా, నగర శివార్లలోని 35 పంచాయతీల్లో ఎంపీటీసీ ఎన్నికలపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. వీటిని కొత్తగా ఏర్పాటుచేసే మున్సిపాలిటీల పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. పురపాలికలుగా మార్చే ఆలోచన ఉన్నందున అప్పట్లో ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. ఇప్పటివరకు ఇవి డీనోటిఫై కాకపోవడంతో పంచాయతీరాజ్‌శాఖ వీటికి కూడా రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ ఈ గ్రామాల ఎంపీటీసీలకూ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఎస్‌ఈసీ ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వానికి లేఖ రాయాలని జిల్లా కలెక్టర్ బీ.శ్రీధర్ నిర్ణయించారు. నగర పంచాయతీ/మున్సిపాలిటీలుగా ప్రతిపాదనలు ఉన్న గ్రామాలకు ఎన్నికలు నిర్వహించాలా? లేదా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరనున్నట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. నోటిఫికేషన్ వెలువరించేలోపు దీనిపై ప్రభుత్వం నుంచి వచ్చే ఉత్తర్వుల ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
రెండు జడ్పీటీసీలకు ఎసరు!
35 పంచాయతీల పరిధిలోని ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించని పక్షంలో సరూర్‌నగర్, రాజేంద్రనగర్ మండలాల జెడ్పీటీసీలకు కూడా ఎన్నికలు జరిగే అవకాశంలే దు. ఇప్పటికే సరూర్‌నగర్ మండలంలోని సమీప గ్రామాలతో కలుపుకొని బడంగ్‌పేట నగర పంచాయతీగా మారింది. అలాగే మిగతా గ్రామాలను కూడా కొత్తగా ఏర్పాటుచేసే మున్సిపాలిటీల్లో చేర్చాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. రాజేంద్రనగర్ మండలంలో మణికొండ మినహా మిగతా గ్రామాలన్నింటినీ కొత్త పురపాలక సంఘాల పరిధిలోకి తేవాలనే సర్కారు యోచిస్తోంది. వీటన్నింటికి ఎన్నికలు నిర్వహించకూడదని నిర్ణయిస్తే ఈ రెండు మండలాలు ‘పట్టణ’ మండలాలుగా మారిపోతాయి. ఇదిలా ఉండగా.. విలీనంచేయని ఐదు పంచాయతీల అంశంపై హైకోర్టు ఓ సందర్భంలో స్పందిస్తూ వీటికి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఈ తరుణంలో వీటికి ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోలేదు.
ప్రాదేశిక సమరం
Published Tue, Mar 11 2014 2:28 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement