సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఓపెన్ చెస్ స్కూల్ టీమ్ చెస్ టోర్నమెంట్‌లో డీఏవీ పబ్లిక్ స్కూల్ కుర్రాడు జేసీ కార్తీక్ చాంపియన్‌గా నిలిచాడు. ఎల్బీ స్టేడియంలో జరిగిన అండర్-19 కేటగిరీ వ్యక్తిగత విభాగంలో అతను అగ్రస్థానం పొందగా... నాగ శశాంక్ (శ్రీకృష్ణ టీమ్), శ్రీసంతోష్ (జీనియస్ చెస్ అకాడమీ) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
జై హింద్ (వేలమ్మాళ్ న్యూ జెన్ పార్క్)కు నాలుగో స్థానం దక్కింది. టీమ్ ఈవెంట్‌లో శ్రీకృష్ణ జట్టు 9 పాయింట్లతో విజేతగా నిలిచింది. మొత్తం 44 జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఒలింపిక్ సంఘం కార్యదర్శి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రోఫీలు అందజేశారు.
తుది స్థానాలు: అండర్-14 టీమ్ ఈవెంట్: 1. నైట్‌రైడర్స్ (10 పాయింట్లు), 2. టాక్టికా చెస్ వారియర్స్ (8), 3. చెస్ టైటాన్స్-మహారాష్ట్ర (8), 4. కింగ్స్ చెస్ అకాడమీ (7), 5. వేలమ్మాళ్ న్యూ జెన్ పార్క్- తమిళనాడు (7).
చెస్ చాంప్ కార్తీక్
Published Fri, Jan 24 2014 12:07 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement