సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ జీఎం టోర్నీలో భాగంగా నిర్వహిస్తున్న ‘బి’ కేటగిరీ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు తులసీ రామ్ కుమార్ శుభారంభం చేశాడు. కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీ తొలి గేమ్‌లో తులసీరామ్, మన రాష్ట్రానికే చెందిన ఆరో సీడ్ క్రాంతికుమార్‌పై సంచలన విజయం సాధించాడు.
రూ. 5 లక్షల ప్రైజ్‌మనీ ఉన్న ఈ టోర్నీలో 2100కంటే తక్కువ రేటింగ్ ఉన్న 221 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. రాష్ట్రానికి చెందిన మరో చిన్నారి రాజా రిత్విక్ తన తొలి రౌండ్‌ను డ్రా చేసుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన రెండో సీడ్ కేతన్ ఖైరేను రిత్విక్ నిలువరించాడు. మరో మ్యాచ్‌లో తమిళనాడుకు చెందిన ఆదిత్య నాలుగో సీడ్ అనురాగ్ జైస్వాల్ (బెంగాల్)ను ఓడించాడు.
ఇతర ఫలితాలు
వరుణ్ (1)... హర్షిత్ (0)పై, పర్‌దీప్ అరోరా (1)... కుల్‌దీప్ (0)పై, కిరణ్ (1)... ప్రత్యూష్ (0)పై, రమణబాబు (1)... తయ్యబ్ (0)పై, వేదాద్రి (1)... అక్షయ్ (0)పై, రాకేశ్ కుమార్ (1)... గజానన్ (0)పై, అగ్ని జీవితేశ్ (1)... షేక్ ఫయాజ్ (0)పై, మాజీద్ (1)... కంది రవి (0)పై, గౌరవ్ (1)... శశాంక్ (0)పై, గ్రాహేశ్ (1)... రవి (0)పై, కృష్ణ థాపా (1)... అనిల్ పాటిల్ (0)పై, కాంతిలాల్ (1)... విఘ్నేశ్ (0)పై, రూపాంకర్ (1)... మురుగేశన్ (0)పై, లాజర్ (1)... శివాజీ (0)పై, కళ్యాణ్ (1)... కైవల్య (0)పై, సందీప్ నాయుడు (1)... ఆశ్లిష్ (0)పై, ముకేశ్ (1)... సోనూమన్ (0)పై, ఆదిత్య (1)... గోవింద్ కుమార్ (0)పై, సుబ్రహ్మణ్యం (1)...అతుల్ శరణ్ (0)పై విజయం సాధించగా, సునీల్ వైద్య (0.5)... శ్రీనివాసరావు (0.5) మధ్య గేమ్ డ్రాగా ముగిసింది.
తులసీరామ్ శుభారంభం
Published Thu, Nov 28 2013 11:59 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement