హరికృష్ణకు ఏడో స్థానం | Pentala Harikrishna 7th place | Sakshi

హరికృష్ణకు ఏడో స్థానం

Jan 27 2014 1:53 AM | Updated on Sep 2 2017 3:02 AM

ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు.

విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
 
 ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో చివరిదైన 11వ రౌండ్‌లో హరికృష్ణ 37 ఎత్తుల్లో బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్) చేతిలో ఓడిపోయాడు. మొత్తం 12 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరిగిన ఈ రౌండ్ రాబిన్ లీగ్ టోర్నమెంట్‌లో హరికృష్ణ మూడు విజయాలు, మూడు పరాజయాలు, ఐదు ‘డ్రా’లతో ఐదున్నర పాయింట్లు సంపాదించాడు. ఎనిమిది పాయింట్లతో లెవాన్ అరోనియన్ (అర్మేనియా) విజేతగా నిలిచాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement