pentala Harikrishna
-
ప్రాగ్ మాస్టర్స్ చెస్ టోర్నీ విజేత హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్: భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెంటేల హరికృష్ణ చెక్ రిపబ్లిక్లో జరిగిన ప్రాగ్ ఓపెన్ మాస్టర్స్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. 10 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో 36 ఏళ్ల హరికృష్ణ 6.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. డేవిడ్ ఆంటోన్ గిజారో (స్పెయిన్)తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 57 ఎత్తుల్లో గెలిచి టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు. ఈ టోర్నీలో హరికృష్ణ నాలుగు గేముల్లో గెలిచి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. విజేతగా నిలిచిన హరికృష్ణకు 25 వేల చెక్ కొరూనాలు (రూ. 82 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
హరికృష్ణ సంచలనం
సాక్షి, హైదరాబాద్: ముఖాముఖి అయినా... ఆన్లైన్లో అయినా... క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో ప్రస్తుతం ప్రపంచ చెస్ చాంపియన్‌గా ఉన్న మాగ్నస్ కార్ల్‌సన్‌పై ఓ గేమ్‌లో గెలవడమంటే విశేషమే. సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ ఆన్లైన్ అంతర్జాతీయ చెస్ టోర్నీ సందర్భంగా భారత రెండో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఈ అద్భుతం చేసి చూపించాడు. బ్లిట్జ్ విభాగంలో భాగంగా ప్రపంచ నంబర్‌వన్ కార్ల్సన్తో జరిగిన గేమ్‌లో హరికృష్ణ తెల్ల పావులతో ఆడుతూ 63 ఎత్తుల్లో గెలుపొంది సంచలనం సృష్టించాడు. 15 ఏళ్ల తర్వాత.... అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం తన కెరీర్లో కార్ల్సన్తో 18 సార్లు తలపడిన హరికృష్ణ కేవలం రెండోసారి మాత్రమే గెలిచాడు. ఈ గేమ్కంటే ముందు ఏకైకసారి 2005లో జూనియర్ స్థాయిలో ఉన్నపుడు లుసానే యంగ్ మాస్టర్స్ టోర్నీలో కార్ల్‌సన్‌పై హరికృష్ణ 56 ఎత్తుల్లో గెలిచాడు. వీరిద్దరి ముఖాముఖి గేముల్లో కార్ల్సన్ 10 గేముల్లో... హరికృష్ణ 2 గేముల్లో నెగ్గారు. మిగతా ఆరు గేమ్‌లు ‘డ్రా’ అయ్యాయి. ఆరో స్థానంలో... సెయింట్ లూయిస్ ఓపెన్ టోర్నీలో భాగంగా బ్లిట్జ్ విభాగంలో తొమ్మిది గేమ్‌లు ముగిశాక హరికృష్ణ 12.5 పాయింట్లతో ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో సంయుక్తంగా ఆరో స్థానంలో ఉన్నాడు. బ్లిట్జ్‌లో తొమ్మిది గేమ్‌లు ఆడిన హరికృష్ణ రెండు గేముల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, నాలుగు గేముల్లో ఓడాడు. కార్ల్సన్ (నార్వే), జియోంగ్ (అమెరికా) లపై నెగ్గిన హరికృష్ణ... డొమింగెజ్, సో వెస్లీ (అమెరికా), గ్రిస్చుక్ (రష్యా), అలీరెజా (ఇరా న్) చేతిలో ఓటమి చవిచూశాడు. నకముర (అమె రికా), అరోనియన్ (అర్మేనియా), నెపోమ్నియాచి (రష్యా)లతో గేమ్‌లను‘డ్రా’గా ముగించాడు. -
నాలుగో స్థానంలో హరికృష్ణ
చెన్నై: సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్ విభాగంలో భారత రెండో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ నాలుగో స్థానంలో నిలిచాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో హరికృష్ణ నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత తొమ్మిది పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. ఏడో గేమ్‌లో హరికృష్ణ 66 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్ (అమెరికా)పై గెలుపొందాడు. హికారు నకముర (అమెరికా)తో జరిగిన ఎనిమిదో గేమ్‌ను 56 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ తొమ్మిదో గేమ్‌లో 69 ఎత్తుల్లో సో వెస్లీ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీలో బ్లిట్జ్ విభాగం గేమ్‌లు జరగాల్సి ఉన్నాయి. బ్లిట్జ్ గేమ్‌లు ముగిశాక ఓవరాల్ పాయింట్ల ఆధారంగా విజేతలను ప్రకటిస్తారు. ప్రస్తుతం ర్యాపిడ్ విభాగంలో సో వెస్లీ 13 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో... మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. -
హరికృష్ణకు రెండో స్థానం
సాక్షి, హైదరాబాద్: బీల్ చెస్ ఫెస్టివల్లో భాగంగా జరిగిన ర్యాపిడ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, భారత స్టార్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ రెండో స్థానాన్ని సంపాదించాడు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో హరికృష్ణ ఐదు పాయింట్లు స్కోరు చేశాడు. ఆరు పాయింట్లతో వొజ్తాసెక్ (పోలాండ్) విజేతగా నిలిచాడు. ర్యాపిడ్ విభాగంలో హరికృష్ణ మూడు గేముల్లో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. నేటి నుంచి క్లాసికల్ విభాగంలో మరో టోర్నీ మొదలుకానుంది. -
చాంపియన్ హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక బీల్ చెస్ ఫెస్టివల్లో భాగంగా నిర్వహించిన చెస్960 టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కరోనా మహమ్మారి సమయంలో దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత అంతర్జాతీయంగా ముఖాముఖి పద్ధతిలో జరుగుతున్న తొలి చెస్ టోర్నీ ఇదే కావడం విశేషం. స్విట్జర్లాండ్‌లోని బీల్ నగరంలో ఏడు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 34 ఏళ్ల హరికృష్ణ అజేయంగా నిలిచాడు. హరికృష్ణ మొత్తం 5.5 పాయింట్లు స్కోరు చేశాడు. మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్), విన్సెంట్ కీమెర్ (జర్మనీ), వొజ్తాసెక్ (పోలాండ్)లతో ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ... అలెగ్జాండర్ డోన్‌చెంకో (రష్యా), నోయల్ స్టుడెర్ (స్విట్జర్లాండ్), రొమైన్ ఎడువార్డో (ఫ్రాన్స్), డేవిడ్ గుజారో (స్పెయిన్)లపై విజయం సాధించాడు. జర్మనీకి చెందిన 15 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమెర్ ఐదు పాయింట్లతో రన్నరప్‌గా నిలువగా... 4.5 పాయింట్లతో వొజ్తాసెక్ మూడో స్థానాన్ని పొందాడు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా నిర్వాహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ముఖాముఖి టోర్నీని నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు ఎత్తులు వేసే బోర్డు మధ్యలో ప్రత్యేకంగా అద్దాన్ని అమర్చారు. గేమ్‌లు కాగానే వేదికను, గేమ్ బోర్డులను శానిటైజ్ చేస్తున్నారు. బీల్ చెస్ ఫెస్టివల్లో భాగంగా ర్యాపిడ్, క్లాసికల్ విభాగాల్లో మరో రెండు టోర్నీలు జరగనున్నాయి. -
హరికృష్ణకు నిరాశ
చెన్నై: చెసేబుల్ మాస్టర్స్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణకు నిరాశ ఎదురైంది. గ్రూప్ ‘ఎ’ లీగ్ దశ గేమ్‌లు ముగిశాక హరికృష్ణ మొత్తం మూడు పాయింట్లతో తన గ్రూప్‌లో చివరిదైన ఆరో స్థానంలో నిలిచి నిష్క్రమించాడు. ఆరో రౌండ్లో హరికృష్ణ 47 ఎత్తుల్లో వ్లాదిస్లావ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. ఏడో రౌండ్లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో గేమ్‌ను 67 ఎత్తుల్లో; ఎనిమిదో రౌండ్లో డానిల్ దుబోవ్ (రష్యా)తో గేమ్‌ను 36 ఎత్తుల్లో; తొమ్మిదో రౌండ్లో హికారు నకముర (అమెరికా)తో గేమ్‌ను 43 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ చివరిదైన పదో రౌండ్లో 30 ఎత్తుల్లో అలెగ్జాండర్ గ్రిషుక్ (రష్యా) చేతిలో ఓటమి పాలయ్యాడు. గ్రూప్ ‘ఎ’లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన కార్ల్సన్, వ్లాదిస్లావ్, నకముర, గ్రిషుక్... గ్రూప్ ‘బి’లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన మాక్సిమి లాగ్రేవ్ (ఫ్రాన్స్), అనీశ్ గిరి (నెదర్లాండ్స్), కరువానా (అమెరికా), లిరెన్ డింగ్ (చైనా) నాకౌట్ దశకు అర్హత సాధించారు. -
హరికృష్ణకు మిశ్రమ ఫలితాలు
న్యూఢిల్లీ: చెసేబుల్ మాస్టర్స్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణకు మిశ్రమ ఫలితాలు లభించాయి. టోర్నీ రెండో రోజు ఆదివారం హరికృష్ణ ఒక గేమ్‌ను ‘డ్రా’గా ముగించి, మరో గేమ్‌లో గెలిచాడు. తొలి రోజు ఆడిన మూడు గేముల్లోనూ ఓడిపోయిన హరికృష్ణ నాలుగో రౌండ్ గేమ్‌లో హికారు నకముర (అమెరికా)తో 60 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. అలెగ్జాండర్ గ్రిషుక్ (రష్యా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 28 ఎత్తుల్లో విజయం సాధించాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్లు ఉన్న గ్రూప్ ‘ఎ’లో హరికృష్ణ ఒకటిన్నర పాయింట్లతో చివరిస్థానంలో ఉన్నాడు. గ్రూప్ ‘బి’లో మరో ఆరుగురు గ్రాండ్‌మాస్టర్లు ఉన్నారు. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ గేమ్‌లు పూర్తయ్యాక రెండు గ్రూపుల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన వారు క్వార్టర్ ఫైనల్ నాకౌట్ దశకు అర్హత సాధిస్తారు. రెండో విడత గేమ్‌లు మిగిలి ఉండటంతో హరికృష్ణకు నాకౌట్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. -
హరికృష్ణ ముందంజ
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): వరుసగా రెండో గేమ్‌లోనూ విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ 19వ ర్యాంకర్ పెంటేల హరికృష్ణ ప్రతిష్టాత్మక ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. విడాల్ యురీ గొంజాలెజ్ (క్యూబా)తో బుధవారం జరిగిన తొలి రౌండ్ రెండో గేమ్‌లో హరికృష్ణ 42 ఎత్తుల్లో గెలిచాడు. ఓవరాల్‌గా 2–0తో నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. భారత్‌కే చెందిన ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లు నిహాల్ సరీన్, ఆధిబన్, విదిత్ కూడా రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. నిహాల్ 2–0తో జార్జి కోరి (పెరూ)పై, ఆధిబన్ 1.5–0.5తో బొనెల్లి (వెనిజులా)పై, విదిత్ సంతోష్ గుజరాతి 1.5–0.5తో అలన్ పిచోట్ (అర్జెంటీనా)పై విజయం సాధించారు. భారత్‌కే చెందిన సూర్యశేఖర గంగూలీ, సేతురామన్, సునీల్‌దత్ నారాయణన్, మురళీ కార్తికేయన్, అరవింద్ చిదంబరం, అభిజిత్ గుప్తా నేడు టైబ్రేక్ గేమ్‌లు ఆడనున్నారు. -
రన్నరప్ హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్: కెరీర్లో తొలి మాస్టర్స్ టోర్నమెంట్ టైటిల్ గెలిచే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ చేజార్చుకున్నాడు. చైనాలో శనివారం ముగిసిన షెన్జాన్ మాస్టర్స్ అంతర్జాతీయ టోర్నమెంట్లో హరికృష్ణ రన్నరప్‌గా నిలిచాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో హరికృష్ణ ఆరు పాయింట్లతో రెండో స్థానంతో సంతృప్తి పడ్డాడు. నెదర్లాండ్స్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ అనీశ్ గిరి 6.5 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు. చివరిదైన పదో రౌండ్లో హరికృష్ణ 72 ఎత్తుల్లో లిరెన్ డింగ్ (చైనా) చేతిలో ఓడిపోగా... అనీశ్ గిరి 97 ఎత్తుల్లో జకోవెంకో (రష్యా)పై గెలుపొంది టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు. లిరెన్ డింగ్ (5.5 పాయింట్లు) మూడో స్థానంలో... రాపోర్ట్ (హంగేరి–5 పాయింట్లు) నాలుగో స్థానంలో... జకోవెంకో, యాంగి యు (చైనా– -
ప్రపంచ నాలుగో ర్యాంకర్ అనీశ్ గిరితో హరికృష్ణ గేమ్ ‘డ్రా’
షెన్జెన్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో ‘డ్రా’ నమోదు చేశాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్ అనీశ్ గిరి (నెదర్లాండ్స్)తో చైనాలో బుధవారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను ప్రపంచ 29వ ర్యాంకర్ హరికృష్ణ 66 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో ఏడో రౌండ్ తర్వాత హరికృష్ణ ఐదు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. 4.5 పాయింట్లతో అనీశ్ గిరి రెండో స్థానంలో... 3.5 పాయింట్లతో లిరెన్ డింగ్ (చైనా) మూడో స్థానంలో ఉన్నారు. -
హరికృష్ణ ఖాతాలో వరుసగా నాలుగో విజయం
షెన్జెన్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తన విజయపరంపర కొనసాగిస్తున్నాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో మంగళవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 43 ఎత్తుల్లో దిమిత్రీ జకొవెంకో (రష్యా)పై గెలుపొందాడు. ఆరుగురు మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఈ టోర్నీ జరుగుతోంది. ఆరో రౌండ్ తర్వాత హరికృష్ణ 4.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో ఉన్నాడు. నాలుగు పాయింట్లతో అనీశ్ గిరి (నెదర్లాండ్స్) రెండో స్థానంలో... మూడు పాయింట్లతో లిరెన్ డింగ్ (చైనా) మూడో స్థానంలో ఉన్నారు. -
హరికృష్ణకు రెండో విజయం
న్యూఢిల్లీ: షెన్జెన్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో విజయం సాధించాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం లిరెన్ డింగ్ (చైనా)తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 79 ఎత్తుల్లో గెలుపొందాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. నాలుగో రౌండ్ తర్వాత హరికృష్ణ 2.5 పాయింట్లతో అనీశ్ గిరి (నెదర్లాండ్స్)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. -
హరికృష్ణకు తొలి గెలుపు
న్యూఢిల్లీ: షెన్జెన్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తొలి విజయం నమోదు చేశాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో హరికృష్ణ 55 ఎత్తుల్లో రిచర్డ్ రాపోర్ట్ (హంగేరి)పై గెలిచాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. దిమిత్రీ జకోవెంకో (రష్యా)తో జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... రెండో రౌండ్ గేమ్‌లో 40 ఎత్తుల్లో అనీశ్ గిరి (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడ -
హరికృష్ణ వివాహం
-
హరికృష్ణ ‘డ్రా’ల పరంపర...
‘ఫిడే’ గ్రాండ్‌ప్రి అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ వరుసగా నాలుగో ‘డ్రా’ను నమోదు చేశాడు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం ఇయాన్ నెపోమ్నియాచిచి (రష్యా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 51 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఐదో రౌండ్ తర్వాత హరికృష్ణ ఖాతాలో మూడు పాయింట్లున్నాయి. -
హరికృష్ణకు ఐదో స్థానం
న్యూఢిల్లీ: షెన్జెన్ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో చైనాలో జరిగిన ఈ టోర్నీ ఆదివారం ముగిసింది. హరికృష్ణ 4.5 పాయింట్లతో యు యాంగి (చైనా)తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా యు యాంగికి నాలుగో స్థానం, హరికృష్ణకు ఐదో స్థానం లభించాయి. చివరిదైన పదో రౌండ్లో హరికృష్ణ 53 ఎత్తుల్లో లిరెన్ డింగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 6.5 పాయింట్లతో లిరెన్ డింగ్ విజేతగా నిలువగా... అనీశ్ గిరి (నెదర్లాండ్స్–5.5) రెండో స్థానంలో, స్విద్లెర్ (రష్యా–5.5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు. -
గెలిచే అవకాశాల్ని చేజార్చుకున్నాం
చెన్నై: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత క్రీడాకారులు గెలిచే అవకాశాల్ని చేజార్చుకున్నారని గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ అన్నాడు. అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగిన ఈ టోర్నీలో బాలుర బృందం నాలుగో స్థానంలో, బాలికల జట్టు ఐదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. స్వదేశానికి చేరుకున్న అతను టోర్నీ ఫలితాల్ని విశ్లేషించాడు. ఈ ఈవెంట్లో భారత జట్లు ఓవరాల్‌గా చక్కని ఆటతీరునే కనబర్చాయని చెప్పిన అతను పతకం దక్కకపోవడానికి కొన్ని గేముల ఫలితాలే కారణమన్నాడు. ‘కొందరు ఆటగాళ్లు మంచి ఎత్తులతో ప్రత్యర్థులపై ఆధిక్యాన్ని కనబరిచారు. గెలవాల్సిన ఆ మ్యాచ్‌ల్ని డ్రాతో ముగించడం వల్లే పతకాన్ని మూల్యంగా చెల్లించుకున్నాం’ అని హరి వివరించాడు. ప్రపంచ 15వ ర్యాంకర్ హరికృష్ణ ఈ టోర్నీలో చక్కని పోరాటంతో ఆకట్టుకున్నాడు. ప్రపంచ 9వ ర్యాంకర్ సెర్గెయ్ కర్జాకిన్ (రష్యా), మమెద్యరోవ్ (అజర్బైజాన్)లను కంగుతినిపించిన ఈ ఆంధ్రప్రదేశ్ సంచలనం ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో గేమును డ్రా చేసుకున్నాడు. -
హరికృష్ణకు ఏడో స్థానం
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో చివరిదైన 11వ రౌండ్లో హరికృష్ణ 37 ఎత్తుల్లో బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్) చేతిలో ఓడిపోయాడు. మొత్తం 12 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరిగిన ఈ రౌండ్ రాబిన్ లీగ్ టోర్నమెంట్లో హరికృష్ణ మూడు విజయాలు, మూడు పరాజయాలు, ఐదు ‘డ్రా’లతో ఐదున్నర పాయింట్లు సంపాదించాడు. ఎనిమిది పాయింట్లతో లెవాన్ అరోనియన్ (అర్మేనియా) విజేతగా నిలిచాడు. -
హరికృష్ణ సంచలనం
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ సంచలనం సృష్టించాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ హికారు నకముర (అమెరికా)తో మంగళవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 33 ఎత్తుల్లో గెలుపొందాడు. 12 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో హరికృష్ణకిది రెండో విజయం. ప్రస్తుతం హరికృష్ణ నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. బుధవారం విశ్రాంతి దినం. గురువారం జరిగే తొమ్మిదో రౌండ్లో నైదిశ్ (జర్మనీ)తో హరికృష్ణ తలపడతాడు. -
హరికృష్ణ గేమ్ డ్రా
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): ప్రతిష్టాత్మక టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఆడిన తొలి రెండు గేమ్‌లను ‘డ్రా’గా ముగించాడు. లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో శనివారం జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ... సెర్గీ కర్యాకిన్ (రష్యా)తో ఆదివారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. మొత్తం 12 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నమెంట్ జరుగుతోంది. భారత్ నుంచి మాస్టర్స్ విభాగంలో కేవలం హరికృష్ణ మాత్రమే పోటీపడుతున్నాడు. సోమవారం జరిగే మూడో రౌండ్లో క్యూబా గ్రాండ్‌మాస్టర్ లీనియర్ డొమింగెజ్‌తో హరికృష్ణ తలపడతాడు. -
ఓపెనింగ్‌ను మార్చాలి
పెంటేల హరికృష్ణ చెస్ చాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు 8 గేమ్‌లు ముగిసినా.. ఆనంద్‌కు కీలకమైన విజయం మాత్రం లభించలేదు. రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్న కార్ల్సెన్ టోర్నీలో మెరుగైన స్థితిలో ఉన్నాడు. అయితే 5, 6 గేమ్‌ల్లో ఓటమి తర్వాత చివరి రెండు గేమ్‌లు డ్రా చేసుకోవడం ఆనంద్‌కు కాస్త ఉపశమనం కలిగించే అంశం. ఇక మిగిలింది 4 గేమ్‌లే. కాబట్టి 9వ గేమ్‌లో తెల్లపావులతో ఆడే ఆనంద్ చాలా రిస్క్ తీసుకోవాలి. బెర్లిన్ డిఫెన్స్‌లోకి వెళ్లకుండా ఓపెనింగ్ వ్యూహాన్ని పూర్తిగా మారుస్తాడని నా నమ్మకం. గత గేమ్‌ల్లో కార్ల్సెన్... బెర్లిన్ డిఫెన్స్‌ను పునరావృతం చేసినా మంచి ఫలితాల్నిచ్చింది. 7, 8 గేమ్‌లు చాలా బోరింగ్‌గా డ్రా అయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆనంద్ మరో డ్రా చేసుకోవడం సరైంది కాదు. 9వ గేమ్‌లో అతను కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఓపెనింగ్ దశ ముగిసిన తర్వాత ఆనంద్ అంత నమ్మకంగా కనిపించలేదు. ఇది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. 9వ గేమ్‌లో పుంజుకోవాలంటే తనపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి.