
సాక్షి, హైదరాబాద్: బీల్ చెస్ ఫెస్టివల్‌లో భాగంగా జరిగిన ర్యాపిడ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, భారత స్టార్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ రెండో స్థానాన్ని సంపాదించాడు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో హరికృష్ణ ఐదు పాయింట్లు స్కోరు చేశాడు. ఆరు పాయింట్లతో వొజ్తాసెక్ (పోలాండ్) విజేతగా నిలిచాడు. ర్యాపిడ్ విభాగంలో హరికృష్ణ మూడు గేముల్లో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. నేటి నుంచి క్లాసికల్ విభాగంలో మరో టోర్నీ మొదలుకానుంది.
Comments
Please login to add a commentAdd a comment