
షెన్‌జెన్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తన విజయపరంపర కొనసాగిస్తున్నాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో మంగళవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 43 ఎత్తుల్లో దిమిత్రీ జకొవెంకో (రష్యా)పై గెలుపొందాడు.
ఆరుగురు మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఈ టోర్నీ జరుగుతోంది. ఆరో రౌండ్ తర్వాత హరికృష్ణ 4.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో ఉన్నాడు. నాలుగు పాయింట్లతో అనీశ్ గిరి (నెదర్లాండ్స్) రెండో స్థానంలో... మూడు పాయింట్లతో లిరెన్ డింగ్ (చైనా) మూడో స్థానంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment