ఆనంద్‌కు మూడో విజయం | viswanathan anand third victory | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు మూడో విజయం

Published Mon, Mar 24 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM

ఆనంద్‌కు మూడో విజయం

ఆనంద్‌కు మూడో విజయం

ఖాంటీ మాన్‌సిస్క్ (రష్యా): భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తన ‘డ్రా’ల పరంపరకు తెరదించాడు. క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో మూడో విజయాన్ని నమోదు చేశాడు. వరుసగా ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఈ ప్రపంచ మాజీ చాంపియన్ ఆదివారం జరిగిన తొమ్మిదో రౌండ్‌లో వాసెలిన్ తొపలోవ్ (బల్గేరియా)పై 57 ఎత్తుల్లో గెలిచాడు.
 
  ఇతర తొమ్మిదో రౌండ్ గేముల్లో కర్జాకిన్ (రష్యా) 64 ఎత్తుల్లో క్రామ్నిక్ (రష్యా)పై, మమెదైరోవ్ (అజర్‌బైజాన్) 44 ఎత్తుల్లో అరోనియన్ (అర్మేనియా)పై గెలుపొందగా... ఆంద్రికిన్ (రష్యా), స్విద్లెర్ (రష్యా)ల మధ్య గేమ్ 30 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. తొమ్మిదో రౌండ్ తర్వాత ఆనంద్ ఆరు పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement