చాంప్స్‌ హిమాన్షు, జ్ఞానిత | Himanshu, Gnanita won Chess Titles | Sakshi
Sakshi News home page

చాంప్స్‌ హిమాన్షు, జ్ఞానిత

Published Mon, Jun 18 2018 10:05 AM | Last Updated on Mon, Jun 18 2018 10:05 AM

Himanshu, Gnanita won Chess Titles - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో హిమాన్షు అగర్వాల్, జ్ఞానిత నేత చాంపియన్‌లుగా నిలిచారు. ఎల్బీ స్టేడియం లో జరిగిన ఈ టోర్నీ అండర్‌–15 బాలుర విభాగంలో నిర్ణీత 5 రౌండ్లు ముగిసేసరికి 4.5 పాయింట్లతో హిమాన్షు, సూర్య సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా హిమాన్షు విజేతగా నిలవగా, సూర్య రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. బాలికల విభాగంలో 3 పాయింట్లతో జ్ఞానిత తొలిస్థానాన్ని దక్కించుకుంది. పి. శ్రేయ రన్నరప్‌గా నిలిచింది.  

ఇతర వయో విభాగాల విజేతల వివరాలు
అండర్‌–13 బాలురు: 1. ఓజస్, 2. కె. పవన్, 3. అజితేశ్‌; బాలికలు: 1. సాయిచరిత వరేణ్య, 2. అమృత వర్షిణి. అండర్‌–11 బాలురు: 1. సంకేత్, 2. అర్జున్, 3. వి. ఆరుశ్‌; బాలికలు: 1. ఊర్జ, 2. ఇషాన్వి, 3. ఆస్మా బేగం. అండర్‌–9 బాలురు: 1. శ్రీకృష్ణ ప్రణీత్, 2. కె. నితిక్, 3. సాయి శ్రీతేశ్‌; బాలికలు: 1. ఆర్‌. లక్ష్మి సమీరాజ, 2. హర్షిత, 3. నాగ కార్తీక. అండర్‌–7 బాలురు: 1. శ్రవణ్, 2. అయాన్, 3. సాయి సిద్ధాంత్‌; బాలికలు: 1. కీర్తిక, 2. అక్షయ, 3. ఫణిశ్రీ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement