ఆనంద్‌కు రెండో గెలుపు | Viswanathan Anand crushes Mamedyarov for second win in three games | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు రెండో గెలుపు

Published Sun, Mar 16 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 AM

ఆనంద్‌కు రెండో గెలుపు

ఆనంద్‌కు రెండో గెలుపు

క్యాండిడేట్స్ చెస్ టోర్నీ
 ఖాంటీ మన్‌సిస్క్(రష్యా): ప్రపంచ మాజీ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో రెండో విజయాన్ని నమోదు చేశాడు. శనివారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో ఈ భారత ఆటగాడు... షకిర్యార్ మమెద్యరోవ్ (అజర్‌బైజాన్)పై విజయం సాధించాడు. రెండున్నర పాయింట్లతో ఆనంద్ ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.
 
  మమెద్యరోవ్‌తో జరిగిన పోరులో నల్లపావులతో ఆడిన ఆనంద్ ఆరంభం నుంచి ఆటపై పట్టు సాధించాడు. దీంతో ముందడుగు వేయడానికి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం లభించలేదు. 24వ ఎత్తుతో దాదాపు విజయం ఖాయంచేసుకున్న భారత గ్రాండ్‌మాస్టర్ 31 ఎత్తుల్లోనే ఆట ముగించాడు. మిగతా పోటీల్లో వాసెలిన్ తొపలోవ్ (బల్గేరియా)తో టాప్ సీడ్ లెవొన్ అరోనియన్ (అర్మేనియా), దిమిత్రి అండ్రెకిన్ (రష్యా)తో సెర్గెయ్ కర్జాకిన్ (రష్యా) గేమ్‌లను డ్రా చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement