india grand master
-
గుప్తాకు గ్రాండ్‌మాస్టర్ హోదా
న్యూఢిల్లీ: భారత 64వ గ్రాండ్‌మాస్టర్(జీఎం)గా ఢిల్లీకి చెందిన ప్రీతు గుప్తా అవతరించాడు. పోర్చుగల్‌లో జరుగుతున్న పోర్చుగీస్ లీగ్–2019 చెస్ టోర్న మెంట్ ఐదో రౌండ్లో అంతర్జాతీయ మాస్టర్ లెవ్ యంకెలెవిచ్‌ను ఓడించిన ప్రీతు.. జీఎం హోదాకు అవసరమైన 2500 ఎలో రేటింగ్‌ను సంపాదించాడు. తొమ్మిదేళ్ల వయసులోనే చదరంగంలో ప్రవేశించిన గుప్తా 15 ఏళ్లకే జీఎం హోదా పొంది ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుల్లో ఒకడిగా నిలిచాడు. జీఎం హోదాకు కావాల్సిన మూడు నార్మ్‌ల్లో మొదటిది జిబ్రా ల్టర్ మాస్టర్స్‌లో, రెండోది బైయిల్ మాస్టర్స్‌లో గతేడాది సాధించిన గుప్తా.. మూడోది, చివరిదైన నార్మ్‌ను ఈ ఏదాది ఫిబ్రవరిలో పోర్టికో ఓపెన్‌లో అందుకున్నాడు. జీఎం హోదా సాధించిన గుప్తాను భారత దిగ్గజ చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ ట్విట్టర్ వేదికగా అభినందించాడు. -
ఆనంద్ రెండో గేమ్ డ్రా
బాడెన్-బాడెన్ (జర్మనీ): వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్... గ్రీంకి చెస్ క్లాసిక్ టోర్నీలో వరుసగా రెండో డ్రాతో సరిపెట్టుకున్నాడు. అర్కాడిజ్ నైడిశ్చ్ (జర్మనీ)తో జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను భారత గ్రాండ్ మాస్టర్ 53 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. ఈ రౌండ్ అనంతరం ఆనంద్ ఒక్క పాయింట్‌తో మరో నలుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో గేమ్‌లో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే-1.5)... మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్-0.5)పై నెగ్గాడు. ప్రస్తుతం కార్ల్సన్ ఒకటిన్నర పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. -
ఆనంద్‌కు రెండో గెలుపు
క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఖాంటీ మన్‌సిస్క్(రష్యా): ప్రపంచ మాజీ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో రెండో విజయాన్ని నమోదు చేశాడు. శనివారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో ఈ భారత ఆటగాడు... షకిర్యార్ మమెద్యరోవ్ (అజర్బైజాన్)పై విజయం సాధించాడు. రెండున్నర పాయింట్లతో ఆనంద్ ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. మమెద్యరోవ్తో జరిగిన పోరులో నల్లపావులతో ఆడిన ఆనంద్ ఆరంభం నుంచి ఆటపై పట్టు సాధించాడు. దీంతో ముందడుగు వేయడానికి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం లభించలేదు. 24వ ఎత్తుతో దాదాపు విజయం ఖాయంచేసుకున్న భారత గ్రాండ్‌మాస్టర్ 31 ఎత్తుల్లోనే ఆట ముగించాడు. మిగతా పోటీల్లో వాసెలిన్ తొపలోవ్ (బల్గేరియా)తో టాప్ సీడ్ లెవొన్ అరోనియన్ (అర్మేనియా), దిమిత్రి అండ్రెకిన్ (రష్యా)తో సెర్గెయ్ కర్జాకిన్ (రష్యా) గేమ్‌లను డ్రా చేసుకున్నారు.