ఆనంద్ రెండో గేమ్ డ్రా | Viswanathan Anand draws with Arkadij Naiditsch in Grenke chess Round 2 | Sakshi
Sakshi News home page

ఆనంద్ రెండో గేమ్ డ్రా

Feb 5 2015 1:13 AM | Updated on Sep 2 2017 8:47 PM

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్... గ్రీంకి చెస్ క్లాసిక్ టోర్నీలో వరుసగా రెండో డ్రాతో సరిపెట్టుకున్నాడు.

బాడెన్-బాడెన్ (జర్మనీ): వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్... గ్రీంకి చెస్ క్లాసిక్ టోర్నీలో వరుసగా రెండో డ్రాతో సరిపెట్టుకున్నాడు.
 
 అర్కాడిజ్ నైడిశ్చ్ (జర్మనీ)తో జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను భారత గ్రాండ్ మాస్టర్ 53 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. ఈ రౌండ్ అనంతరం ఆనంద్ ఒక్క పాయింట్‌తో మరో నలుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో గేమ్‌లో మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే-1.5)... మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్-0.5)పై నెగ్గాడు. ప్రస్తుతం కార్ల్‌సన్ ఒకటిన్నర పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement