
అంబేద్కర్ స్టడీ సర్కిల్ అడ్‌హక్ కమిటీని రద్దు చేయాలి
బి.ఆర్.అంబేద్కర్ స్టడీ సర్కిల్ అడ్‌హక్ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపకులాలను విస్మరించడం అన్యాయమని దళిత బహుజన
మెదక్ మున్సిపాలిటీ: బి.ఆర్.అంబేద్కర్ స్టడీ సర్కిల్ అడ్‌హక్ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపకులాలను విస్మరించడం అన్యాయమని దళిత బహుజన ఐక్య వేదిక నాయకులు ఆగ్రహంవ్యక్తంచేశారు. దళిత ఐక్య వేదిక సమావేశం మంగళవారం మెదక్‌పట్టణలలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని, ఓ వర్గం వారు అంబేద్కర్ తమ సొంతం అన్నట్లు అడ్‌హక్ కమిటీ ఏర్పాటు చేయడం దారుణమన్నారు. అంబేద్కర్ సమాజంలోని అన్ని కులాల ఆరాధ్యుడన్నారు. అడహక్ కమిటీని రద్దు చేసి, తిరిగి అన్ని కులాలను కలుపుకొని కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో రామస్వామి, అనంతరావు, దేవయ్య, శంకర్, శేఖర్, భాస్కర్, డానియల్, వినయ్‌సాగర్, అభి, ప్రసాద్, యేసు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.