- నగదు చెల్లించని రైల్వే అధికారులు
- పెద్ద ప్రక్రియ అనంతరం బ్యాంకు అకౌంట్లలోకి జమ
- అవస్థలు పడుతున్న ప్రయాణికులు
టికెట్ల రద్దు ప్రహసనమే
Published Sun, Nov 20 2016 9:57 PM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM
రాజమహేంద్రవరం సిటీ :
పెద్ద నోట్ల రద్దు రైల్వే ప్రయాణీకుల సమస్యగా మారింది. రైల్వే టిక్కెట్ రద్దు చేసుకోవాలంటే గంట పాటు ప్రయాస పడాల్సి వస్తోం. టికెట్ రద్దు తరువాత తిరిగి డబ్బులు ఇస్తున్నారా అంటే టికెట్ డిపోజిట్ రసీదు ఇచ్చి, దాన్ని సికింద్రాబాద్ రైల్ నిలయానికి పంపాలని సూచిస్తున్నారు. ఇలా ప్రయాణీకులు తమ టిక్కెట్లను రద్దు చేసుకోవాలంటే మొదటగా రిజర్వేష¯ŒS కౌంటర్‌లో టిక్కెట్ రద్దు చేసుకుని, తరువాత మొదటి ప్లాట్‌ఫామ్ పై ఉన్న చీఫ్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించి బ్యాంక్, ఆధార్ వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంత తతంగం నడిచిన తరువాత కూడా మీ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలకు జమ అవుతాయని అంటుండడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోతునారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఇప్పటివరకూ రాజమహేంద్రవరం రైల్వేస్టేçÙ¯ŒSలో ఇప్పటివరకూ 641 మంది వారి తమ టికెట్లు రద్దు చేసుకున్నారు. వారికి రైల్వే శాఖ ప్రయాణీకులకు 4లక్షల 58 వేల335 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అలాగే ద్వారపూడి, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతాల్లోని ప్రయాణికులు రాజమహేంద్రవరం రైల్వే స్టేష¯ŒSకు రావాల్సి ఉండడంతో వారు ఇబ్బందులు వర్ణనాతీతం.
Advertisement