హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తు తం ఉన్న ‘ఆంధ్రప్రదేశ్ భూదాన్ యజ్ఞ బోర్డు’ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొత్త బోర్డు ఏర్పాటయ్యేవరకు బోర్డు విధులను నిర్వహించేందుకు అథారిటీని నియమించింది. అథారిటీ బాధ్యతలను రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
2012లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ భూదాన్ యజ్ఞ బోర్డు, నిబంధనలకు విరుద్ధంగా రూ.వేల కోట్ల విలువైన భూములను అనర్హులకు కేటాయించిందని ఆరోపణలున్నాయి. బోర్డు ఏర్పాటులోనే అవకతవకలు జరిగాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో బోర్డు చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర సభ్యులపై వచ్చిన ఆరోపణలు, భూ కేటాయింపులపై సీబీసీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
‘భూదాన్ బోర్డు’ రద్దు
Published Sat, May 16 2015 2:22 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM
Advertisement
Advertisement