నల్లగొండ టూటౌన్ : సీపీఎస్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ పద్ధతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం.రాజశేఖర్‌రెడ్డి మాట్లాడారు. సీపీఎస్ విధానం ఉద్యోగుల పాలిటశాపంగా మారిందన్నారు. సీపీఎస్ ద్వారా వసూలైన డబ్బులు షేర్ మార్కెట్‌లో పెట్టడం వల్ల అది కార్పొరేట్లకు ఉపయోగపడే విధంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల సైదులు, పి.వెంకటేశం, రామలింగయ్య, రాజశేఖర్, వీరాచారి, ఆంజనేయులు, సైదులు, రామారావు, సతీశ్, యాదయ్య, నరేశ్, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీపీఎస్ విధానం రద్దు చేయాలి
Published Fri, Aug 19 2016 2:02 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
Advertisement