పాత పెన్షన్ విధానం కోసం ఉద్యమిద్దాం
పాత పెన్షన్ విధానం కోసం ఉద్యమిద్దాం
Published Mon, Jul 18 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
చంద్రశేఖర్‌కాలనీ : పాత పెన్షన్ విధానం కోసం ఉద్యమిద్దామని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఎస్‌సీపీఎస్‌ఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానం వల్ల ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ‘చలో ఇందూరు’లో భాగంగా సీపీఎస్ రద్దుకోసం చేపట్టిన ఉద్యమంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన ‘మా గోడు– మా గోస’ సభలో ఆయన మాట్లాడారు. 2004 సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం అమలు చేశారన్నారు. ఈ విధానం వలన ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌ను షేర్ మార్కెట్‌లోకి తరలించబడి ఉద్యోగుల భవిష్యత్తు అయోమయంగా మారుతుందన్నారు. సీపీఎస్ రద్దు కోసం అన్ని డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు సంఘటితమై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. కొత్త పెన్షన్ పథకంలో నెలసరి వాటాగా చెల్లించే డబ్బుకు ఎలాంటి గ్యారంటీ లేదన్నారు. ఉద్యోగుల డెత్ క్లెయిమ్ విషయంలో ఆధారితులకు ఈ పెన్షన్ విధానం, ఎలాంటి సామాజిక భద్రత కల్పించడం లేదని స్థితప్రజ్ఞ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ 30 సంవత్సరాలు ప్రభుత్వం సేవ చేస్తే పదవి విరమణ తర్వాత ఆసరా ఉండాల్సిన ప్రభుత్వం ఉద్యోగుల జీవితాన్ని మార్కెట్‌పరం చేయడమేమిటని ప్రశ్నించారు. పాత పెన్షన్ విధానాన్ని సాధించేంత వరకు పోరాడతామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి నరేశ్‌గౌడ్, జాయింట్ సెక్రెటరీ కురాకుల శ్రీనివాస్, రాష్ట్ర సాహిత్య కార్యదర్శి పవన్‌కుమార్, టి.నరసింహారెడ్డి, చుక్క కిరణ్, ప్రవీణ్‌కుమార్, విక్రమ్‌సింగ్, శారద, గంగభవాని, షాకిర్, వీరేందర్‌సింగ్, డీసీటీవో చిస్తేశ్వర్, డాక్టర్ కిరణ్, రవికిరణ్, శ్రీధర్, వినోద, శాంతన్, గట్టు స్వామి అసోసియేట్ ఫ్రొఫెసర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement