
ప్రభుత్వమే బాధ్యత వహించాలి...
ఎంసెట్-3 వైఫల్యంపై కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : పరీక్షాపత్రం వెల్లడైన కారణంగా ఎంసెట్-2ని రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్-3ని నిర్వహించడంలో కూడా పూర్తిగా విఫలమైందని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందని ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ఎంసెట్-3 ప్రశ్నాపత్రంలో 160కి గానూ 15 ప్రశ్నల్లో తప్పులు దొర్లాయంటే ప్రభుత్వం ఎంత నిరక్ష్యం వహించిందో అర్థమవుతోందన్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగంపై దృష్టి సారించి విద్యార్థుల భవిష్యత్‌కు ఇబ్బంది కలగని విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.