EAMCET -2
-
‘ఎంసెట్-2’ సూత్రధారి సునీల్‌సింగ్
- కేసును కొలిక్కి తీసుకొచ్చిన సీఐడీ - నిందితుడు ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ నిర్వాహకుడు సునీల్‌గా గుర్తింపు సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్-2 పేపర్ లీకేజీ కుంభకోణాన్ని నేర దర్యాప్తు విభాగం (సీఐడీ) కొలిక్కి తీసుకొచ్చింది. ఈ కుంభకోణానికి అసలు సూత్రధారి ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ నిర్వాహకుడు సునీల్ కుమార్ సింగ్‌గా నిర్ధారించింది. ప్రస్తుతం అతడు నేపాల్‌లో తలదాచుకున్నట్లుగా పక్కా సమాచారాన్ని సేకరించింది. అతన్ని అదుపులోకి తీసుకునేందుకు అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. బ్రోకర్లుగా వ్యవహరించిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ పేపర్ లీకేజీ కుంభకోణంతో 128 మంది విద్యార్థులు లబ్ధిపొందినట్లు సీఐడీ నిర్ధారించింది. ఎంపిక చేసిన 6 ప్రాంతాల్లో పరీక్షకు రెండు రోజుల ముందు వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినటు ఆధారాలను సేకరించింది. వందలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఈ కుట్రలో 58 మంది బ్రోకర్లుగా వ్యవహరించినట్లు సీఐడీ దృష్టికి వచ్చింది. వీరిలో 33 మందిని అరెస్టు చేయగా, మరో ఇద్దరిని ఢిల్లీలో సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన 33 మందిలో 22 మంది తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వారు కాగా, ఒకరు తమిళనాడు, పది మంది ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారున్నారు. మరో 23 మందిని అరెస్టు చేయాల్సి ఉందని సీఐడీ పేర్కొంది. వీరిలో నలుగురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కాగా.. మిగతా వారు ఢిల్లీకి చెందిన వారున్నట్లు పేర్కొన్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి రూ.25 లక్షలు.. ఎంసెట్-2 ద్వారా సునీల్‌సింగ్, అతని మనుషులు ఆర్థికంగా భారీగా లబ్ధిపొందినట్లు సీఐడీ విచారణలో వెలుగు చూసింది. ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్ లీకైన వెంటనే సునీల్ సింగ్ మే 25న తనకు పరిచయమున్న కన్సల్టెన్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు. ఆరుగురు వ్యక్తులకు పేపర్ అప్పగించి ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.25 లక్షలు వసూలు చేయాలని షరతు విధించాడు. అక్కడి నుంచి ఆరుగురు వ్యక్తులు సబ్‌బ్రోకర్లకు అప్పగిస్తూ ఆ రేటు పెంచుకుంటూ పోయారు. ఈ కుంభకోణం ద్వారా బెంగళూరు, ముంబై, పుణే, షిర్డీ, కటక్, కోల్‌కతా కేంద్రంగా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అయితే షిర్డీ కేంద్రంగా శిక్షణ తీసుకున్న విద్యార్థులతో ఒక్కొక్కరి నుంచి రూ.65 లక్షలు వసూలు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో వెలుగుచూసింది. 2011లో కూడా.. 2011లో ఛత్తీస్‌గఢ్‌లో మెడికల్ ప్రవేశ పరీక్ష పత్రం లీక్‌లో సునీల్ హస్తం ఉంది. అప్పుడు కూడా ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్‌లో ఉన్న తన మనుషుల ద్వారా పేపర్ లీక్ చేసినట్లు రుజువైంది. దీంతో అక్కడి న్యాయస్థానాలు ఆరేళ్ల జైలు శిక్ష విధించాయి. అయితే ఆ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి తాత్కాలిక బెయిల్ పొందాడు. మళ్లీ ఎంసెట్-2 పేపర్‌ను కూడా ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి సునీల్ వ్యక్తులే తస్కరించినట్లు సీఐడీకి బలమైన ఆధారాలు లభించాయి. -
ప్రభుత్వమే బాధ్యత వహించాలి...
ఎంసెట్-3 వైఫల్యంపై కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్ : పరీక్షాపత్రం వెల్లడైన కారణంగా ఎంసెట్-2ని రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్-3ని నిర్వహించడంలో కూడా పూర్తిగా విఫలమైందని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందని ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ఎంసెట్-3 ప్రశ్నాపత్రంలో 160కి గానూ 15 ప్రశ్నల్లో తప్పులు దొర్లాయంటే ప్రభుత్వం ఎంత నిరక్ష్యం వహించిందో అర్థమవుతోందన్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగంపై దృష్టి సారించి విద్యార్థుల భవిష్యత్‌కు ఇబ్బంది కలగని విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
ఎంసెట్ స్కామ్‌లో మరో వ్యక్తి అరెస్ట్
ఎంసెట్ లీకేజీ కుంభకోణంలో ఢిల్లీకి చెందిన అశ్వినీకుమార్ థోమర్ అనే వ్యక్తిని సీఐడీ అరెస్టు చేసింది. అశ్వినీకుమార్ ఢిల్లీలో ఆకృతి కన్సల్టెన్సీ పేరిట కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడని... ఎంసెట్-2 లీకేజీ సూత్రధారులతో సంబంధాలు పెట్టుకొని ఇద్దరు విద్యార్థులకు ప్రత్యేక’ శిక్షణ ఇప్పించాడని సీఐడీ విచారణలో వెలుగు చూసింది. ఆ ఇద్దరిని ఎంసెట్-2 పరీక్షకు రెండు రోజుల ముందు బెంగళూరులో నిర్వహించిన క్యాంపుకు తరలించి శిక్షణ ఇప్పించాడని తేలింది. ఈ నేపథ్యంలో అశ్వినీకుమార్ను అరెస్టు చేసినట్లు సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా శుక్రవారం వెల్లడించారు. ఆయన ద్వారా సూత్రధారులను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
మంత్రి కేటీఆర్‌కు ఎంసెట్ సెగ
జిల్లాకేంద్రంలో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కు ఎంసెట్-2 పేపర్ లీకేజీ సెగ తగిలింది. పేపర్ లీకేజీని నిరసిస్తూ సంబంధిత మంత్రులను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. ప్రతిమ మలిటప్లెక్స్ వద్ద మంత్రి కారు ముందు బైఠాయించారు. ఎంసెట్-2 రద్దు చేయవద్దని బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను బలవంతంగా తొలగించి అరెస్ట్ చేశారు. అటు బీజేవైఎం కార్యకర్తలు సైతం మంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. -
తెలంగాణ ఎంసెట్-2 రద్దు
-
ఎంసెట్-2 పేపర్ లీకేజీని నిరసిస్తూ బీజేవైఎం ఆందోళన
ఎంసెట్-2 పేపర్ లీకేజీని నిరసిస్తూ భారతీయ జనతా ముక్తి మోర్చా ఆధ్వర్యంలో నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాసేపు ఆర్టీసీ బస్టాండు మార్గంలో రాస్తారోకోకు దిగారు. దీంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. బీజేవైఎం కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. వెంటనే ఎంసెట్ పేపర్ లీకేజీకి కారణమైన వ్యక్తులను శిక్షించాలని డిమాండ్ చేశారు. -
ఎంసెట్-2కు 30,787 దరఖాస్తులే!
తెలంగాణ నుంచి 20 వేలు, ఏపీ నుంచి 10 వేలు సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంసెట్-2కు ఇప్పటివరకు 30,787 దరఖాస్తులు వచ్చాయి. నీట్ ద్వారా నింపే సీట్లు పోనూ మిగిలిన 1,725 సీట్లను ఈ ఎంసెట్-2తో భర్తీ చేస్తారు. జూలై 7న నిర్వహించే ఈ పరీక్షకు హాజరు కావాలనుకునే వారి నుంచి ఈనెల 1 నుంచి ఎంసెట్ కమిటీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఈనెల 7వ తేదీతో ఆన్లైన్లో దరఖాస్తుల గడువు ముగియనుంది. అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అధికారులు భావించినా తక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఇక ఆలస్య రుసుముతో మాత్రం పరీక్షకు ఒక రోజు ముందు వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. ఎంసెట్-1కు మాత్రం లక్ష మందికిపైగా విద్యార్థులు అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ ఎంసెట్ ద్వారా అగ్రికల్చర్, వెటర్నరీ తదితర 12 రకాల కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉండటంతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారని, ప్రస్తుతం జూన్ 7న నిర్వహించబోయే ఎంసెట్-2 ద్వారా కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లోనే ప్రవేశాలు చేపట్టనున్న నేపథ్యంలో దరఖాస్తులు తగ్గాయని అధికారులు పేర్కొన్నారు. ఇక విద్యార్థులు జూలై 2 నుంచి 7వరకు ఎంసెట్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవ చ్చు. ఇదీ ఎంసెట్-2 షెడ్యూల్... 7-6-2016: ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 14-6-2016: రూ. 500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ 21-6-2016: రూ. 1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ 28-6-2016: రూ. 5 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ 6-7-2016: రూ. 10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ 2-7-2016 నుంచి 7-7-2016 వరకు: వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్ 9-7-2016: రాత పరీక్ష (ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు)