
మంత్రి కేటీఆర్‌కు ఎంసెట్ సెగ
జిల్లాకేంద్రంలో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కు ఎంసెట్-2 పేపర్ లీకేజీ సెగ తగిలింది. పేపర్ లీకేజీని నిరసిస్తూ సంబంధిత మంత్రులను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. ప్రతిమ మలిటప్లెక్స్ వద్ద మంత్రి కారు ముందు బైఠాయించారు. ఎంసెట్-2 రద్దు చేయవద్దని బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను బలవంతంగా తొలగించి అరెస్ట్ చేశారు. అటు బీజేవైఎం కార్యకర్తలు సైతం మంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు.