
శంషాబాద్‌లో పలు విమాన సర్వీసుల రద్దు
శంషాబాద్ (రాజేంద్రనగర్): వర్షం కారణంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు దేశీయ విమాన సర్వీసులు సోమవారం ఆల స్యంగా నడవగా.. మరికొన్ని సర్వీసులు రద్దయ్యాయి. సోమవారం ఉదయం ఇక్క డి నుంచి నాగ్‌పూర్ వెళ్లాల్సిన విమానంతో పాటు చెన్నై, బెంగళూరు, తిరుపతి, గోవా, కొచ్చిన్, చండీఘడ్, ముంబై వెళ్లాల్సిన గో ఎయిర్, జెట్ ఎయిర్‌వేస్, ట్రూజెట్, ఇండిగో సర్వీసులను రద్దు చేశారు.
దీంతో పాటు వర్షం కారణంగా పలు సర్వీసులు నిర్ణీత సమయాని కంటే 45 నిమిషాల నుంచి గంట ఆలస్యంగా నడిచాయి. సాయంత్రం 5 గంటలకు ముంబై వెళ్లా ల్సిన ఎయిర్ ఇండియా విమానం రాత్రి 9 గంటలకు బయలుదేరే అవకాశం ఉందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. అలాగే సాయంత్రం 6.10 గంటలకు వెళ్లాల్సిన కొచ్చిన్ విమానం రాత్రి 9 గంటల తర్వాత బయలుదేరనున్నట్లు వెల్లడించాయి.