
పలు రైళ్ల రద్దు
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : విశాఖ సమీపంలోని కొత్తవలస-కిరండూల్ రైల్వే మార్గంలో వివిధ అభివృద్ధి పనుల కారణంగా పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నారు. ఈ నెల 3 నుంచి 24వ తేదీ వరకూ అంచెలంచెలుగా పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసేందుకు వాల్తేరు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. దీని వల్ల కోరాపుట్, కిరండూల్, జగదల్‌పూర్, భువనేశ్వర్ వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది తప్పదు.
విశాఖపట్నం-కిరండూల్ ప్యాసిం జర్(58501)ను మూడో తేదీన కోరాపుట్-కిరండూల్ మధ్య రద్దు చేశారు. ఈ రైలు కోరాపుట్ నుంచే విశాఖకు బయల్దేరుతుంది.
కిరండూల్-విశాఖపట్నం(5850 2) ప్యాసింజర్ ఈ నెల 8వ తేదీన కిరండూల్‌లో ఉదయం 6 గంటలకు బదులు 8 గంటలకు బయల్దేరుతుంది.
భువనేశ్వర్-జగదల్‌పూర్ వెళ్లే హిరాకండ్ ఎక్స్‌ప్రెస్(18447) ఈనెల 17వ తేదీన జగదల్‌పూర్‌కు షెడ్యూల్ సమయానికే చేరుతుంది. కానీ కోరాపుట్‌లో పాక్షికంగా రద్దు చేస్తున్నారు. తిరిగి కోరాపుట్ నుంచి 18448గా జగదల్‌పూర్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌గా బయల్దేరుతుంది. కోరాపుట్-జగదల్‌పూర్ మధ్య ఈ రైలు 17న పాక్షికంగా రద్దవుతుంది. 24వ తేదీన కూడా కోరాపుట్-జగదల్‌పూర్ మధ్య పాక్షి కంగా రద్దు చేస్తున్నారు.
కిరండూల్-విశాఖపట్నం ప్యాసిం జర్(58502) ఈ నెల 17వ తేదీన కిరండూల్‌లో ఉదయం 6 గంటలకు బయల్దేరడానికి బదులు ఉదయం 7.30 గంటలకు బయల్దేరుతుంది.