వాషింగ్టన్: ఒబామా కేర్‌ను రద్దు చేస్తూ, కొత్త వైద్య విధానానికి ఆమోదం తెలుపుతూ అమెరికా ప్రతినిధుల సభ గురువారం అనుకూలంగా ఓటేసింది. కొత్తగా రూపొందించిన అమెరికన్ హెల్త్ కేర్ యాక్ట్‌కు 217–213 ఓట్ల తేడాతో సభ ఆమోదం తెలిపింది.
డెమోక్రాట్ సభ్యులంతా కొత్త బిల్లును వ్యతిరేకించగా.. రిపబ్లికన్లు అనుకూలంగా ఓటేశారు. అయితే దాదాపు 20 మంది రిపబ్లికన్లు బిల్లును వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ ఓటింగ్ కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నామని ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ ర్యాన్ పేర్కొన్నారు. అయితే ఈ బిల్లును సెనెట్ ఆమోదించాల్సి ఉంది.